ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

‘కొత్త’ నిర్ణయాలకు సరైన సమయమిదే!

ABN, Publish Date - Dec 29 , 2024 | 07:04 AM

కొత్త ఏడాది వస్తోందంటే చాలు... కొత్త కొత్త నిర్ణయాలు తీసుకోవాలని, పాత పద్ధతులను మార్చుకోవాలని ఉబలాటపడుతుంటారు చాలామంది. ఇక నుంచి ఫిట్‌గా ఉండాలనో, పొగత్రాగటం లేదా మద్యపానం మానెయ్యాలనో, డైట్‌ను తప్పనిసరిగా ఫాలో అవ్వాలనో... ఇలా రకరకాల ‘రిజల్యూషన్స్‌’ రాసుకుంటారు. అయితే వీటిని జనవరి 1 నుంచి కాకుండా డిసెంబర్‌ నుంచే మొదలెడితే మంచిదంటున్నారు సైకాలజిస్టులు.

కొత్త ఏడాది వస్తోందంటే చాలు... కొత్త కొత్త నిర్ణయాలు తీసుకోవాలని, పాత పద్ధతులను మార్చుకోవాలని ఉబలాటపడుతుంటారు చాలామంది. ఇక నుంచి ఫిట్‌గా ఉండాలనో, పొగత్రాగటం లేదా మద్యపానం మానెయ్యాలనో, డైట్‌ను తప్పనిసరిగా ఫాలో అవ్వాలనో... ఇలా రకరకాల ‘రిజల్యూషన్స్‌’ రాసుకుంటారు. అయితే వీటిని జనవరి 1 నుంచి కాకుండా డిసెంబర్‌ నుంచే మొదలెడితే మంచిదంటున్నారు సైకాలజిస్టులు.

- ‘కొత్త’ నిర్ణయాలను పాత ఏడాది నుంచే మొదలెడితే... వాటిని సాధించేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయనేది వాస్తవం. ఎందుకంటే... పాత అలవాట్లను దూరం చేసుకోవాలన్నా, కొత్త నిర్ణయాలను కొనసాగించాలన్నా ‘హ్యాబిట్‌ బిల్డింగ్‌ జోన్‌’ను ఏర్పరచుకోవడం ముఖ్యం. జనవరి 1 నుంచి రిజల్యూషన్‌ను మొదలుపెట్టాలంటే దానికి కొంత సాధన అవసరం. అనేక ప్రయత్నాలతో ఆ సాధనే క్రమంగా అలవాటుగా మారుతుంది. అందుకే డిసెంబర్‌ చివర్లోనే వాటిని మొద లెట్టాలని చెబుతున్నారు నిపుణులు.


- డిసెంబర్‌ ప్రణాళిక వల్ల ‘ఆల్‌ ఆర్‌ నథింగ్‌’ అనే మైండ్‌సెట్‌ను అధిగమించేందుకు అవకాశం ఉంటుంది. ఒకసారి మొదలెట్టి దాన్ని అమలుపరచలేక ఇబ్బందులు పడేకన్నా... ట్రయల్‌రన్‌ పూర్తయితే ముందుకు వెళ్లడానికి మార్గం సుగమమవుతుంది.

- మార్పు సిద్ధాంతం (చేంజ్‌ థియరీ) ప్రకారం కొత్త ప్రవర్తనలకు అలవాటయ్యే ముందు, నిర్ణయం తీసుకోవడం, చర్యల మధ్య జరిగే సంఘర్షణ చక్రం గుండా అనేకసార్లు వెళతారు. ఒకవేళ న్యూఇయర్‌ రిజల్యూషన్‌ను ఒకరోజు లేదా అంతకన్నా ఎక్కువ రోజులు కొనసాగించలేకపోతే దానిని తమ వైఫల్యంగా భావించి నిరాశ నిస్పృహలకు గురవుతారు. దాని బదులు డిసెంబర్‌లోనే మొదలెడితే ఒక అవకాశం చేజారిందని, మరోసారి ప్రయత్నించొచ్చు.


- జనవరి 1 అని ఒక తేదీ పెట్టుకుంటే... ఏం చేయాలి? ఎలా చేయాలి? అని ఆలోచించుకునేందుకే సమయాన్ని వెచ్చిస్తారు. కొన్నిసార్లు ఏడాదంతా ఆలోచనలకే పరిమితం అవ్వాల్సి వస్తుంది. ఇదొక పెద్ద సవాలు.

- సైకాలజీ ప్రకారం ఎలాంటి రెజల్యూషన్‌కైనా డిసెంబర్‌ అనేది ‘సాఫ్ట్‌ బిగినింగ్‌’ లాంటిది. దానికోసం ఆందోళన, ఒత్తిడికి గురికావాల్సిన అవసరం ఉండదు. ఏ పనైనా ఒత్తిడి, ఆందోళన లేకుండా చేస్తే తప్పకుండా విజయం వరిస్తుంది.


- నిర్ణయాలు, లక్ష్యాలు అనేవి ఎప్పుడు కూడా నిర్దిష్టంగా ఉండాలి. ఉదాహరణకు 5 కిలోల బరువు తగ్గాలనుకుంటే... మూడు నెలలుగా సమయాన్ని నిర్ణయించుకుంటే... అందుకోసం ప్రతీ రోజూ ఉదయంగానీ, సాయంత్రంగానీ గంటసేపు వ్యాయామం చేయాలి. ఇలా సాధన అనేది వాస్తవ రూపంలో ఉన్నప్పుడే ఏదైనా వర్కవుట్‌ అవుతుంది. స్మార్ట్‌ లక్ష్యాలను శాస్త్రీయ పద్ధతుల్లో అవలంబిస్తేనే ఎవరైనా అనుకున్నది సాధించగలుగుతారు.


- ‘మైక్రో మైల్‌స్టోన్‌’ పద్ధతి ఎప్పుడైనా మంచిదే. అంటే ఏడాదికి 50 వేల రూపాయలు పొదుపు చేయాలనుకుంటే.. ప్రతీనెలా నాలుగైదు వేలను కూడబెడితేనే ముఖ్యమైన మైల్‌స్టోన్‌ను చేరుకుంటారు. చిన్న చిన్న విజయాలే పెద్ద విజయానికి బాటలు వేస్తాయి.

- ‘టూ డే’ రూల్‌ కూడా ఫాలో అవ్వాలి. అంటే తీసుకున్న ఏ నిర్ణయాన్ని అయినా వరుసగా రెండు రోజులు వాయిదా వేయకూడదు. అలా వేస్తున్నారంటే అది ‘ఆల్‌ ఆర్‌ నథింగ్‌’ మైండ్‌సెట్‌కు వెళ్తుంది. కావున మంచి నిర్ణయానికి ఒక తేదీ అంటూ అవసరం లేదు. ఆ తేదీకి ముందు నుంచే మొదలెడితే క్రమక్రమంగా గాడిలో పడుతుంది. న్యూ ఇయర్‌ రిజల్యూషన్‌ విషయంలో కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది.

Updated Date - Dec 29 , 2024 | 07:04 AM