ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Pushpa-2: ఇది ``పుష్ప-2`` సైడ్ ఎఫెక్ట్.. థియేటర్‌కు వెళ్లిన ప్రేక్షకుడికి చుక్కలు.. అసలేం జరిగిందంటే..

ABN, Publish Date - Dec 12 , 2024 | 03:07 PM

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన షబ్బీర్ అనే వ్యక్తి ``పుష్ప 2`` సినిమా చూసేందుకు ఆదివారం నాడు ఇందర్‌గంజ్‌ ప్రాంతంలోని కైలాష్‌ టాకీస్‌‌కు వెళ్లాడు. ఇంటర్వెల్ సమయంలో స్నాక్స్ కొన్నాడు. అయితే ఆ స్నాక్స్ బిల్లు విషయంలో షబ్బీర్‌కు, క్యాంటిన్ ఓనర్‌ రాజుకు మధ్య వాగ్వాదం మొదలైంది.

Pushpa-2 movie theater

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) నటించిన ``పుష్ప-2`` (Pushpa-2) సినిమాకు ఉత్తరాది ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. సినిమాను చూసేందుకు థియేటర్లకు పోటెత్తుతున్నారు. చాలా మంది పుష్పలా రంగు రంగులా చొక్కాలేసుకుని వస్తున్నారు. ఇంకొందరు అల్లు అర్జున్ తరహాలో ఆడ వేషం వేసుకుని కూడా థియేటర్లకు వెళ్తున్నారు. అయితే మధ్యప్రదేశ్‌ (MadhyaPradesh)లోని ఓ సినిమా హాల్ క్యాంటీన్ యజమాని పుష్ప తరహాలో ఓ ప్రేక్షకుడిని కొరికేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Viral News).


మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన షబ్బీర్ అనే వ్యక్తి ``పుష్ప 2`` సినిమా చూసేందుకు ఆదివారం నాడు ఇందర్‌గంజ్‌ ప్రాంతంలోని కైలాష్‌ టాకీస్‌‌కు వెళ్లాడు. ఇంటర్వెల్ సమయంలో స్నాక్స్ కొన్నాడు. అయితే ఆ స్నాక్స్ బిల్లు విషయంలో షబ్బీర్‌కు, క్యాంటిన్ ఓనర్‌ రాజుకు మధ్య వాగ్వాదం మొదలైంది. బిల్లు ఎక్కువ కావడంతో డబ్బులు ఇచ్చేందుకు షబ్బీర్ అంగీకరించలేదు. దీంతో రాజు, అతడి అనుచరులు షబ్బీర్‌తో గొడవకు దిగారు. ఆ గొడవ ముదిరి కొట్టుకునే వరకు వెళ్లింది. తీవ్ర ఆగ్రహానికి గురైన రాజు.. షబ్బీర్‌ను కొట్టాడు.


షబ్బీర్ కూడా రాజుపై దాడి చేశాడు. ఆ క్రమంలో షబ్బీర్ చెవిని క్యాంటిన్ యజమాని రాజు కొరికేశాడు. దీంతో షబ్బీర్‌‌కు తీవ్ర రక్తస్రావం జరిగింది. అంతేకాదు షబ్బీర్‌ను చంపేస్తామని అందరి ముందు రాజు, అతడి అనుచరులు బెదిరించారు. హాస్పిటల్‌కు వెళ్లి చికిత్స చేయించుకున్న షబ్బీర్ సోమవారం నాడు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు క్యాంటిన్ ఓనర్ రాజును, అతడి ముగ్గురి అనుచరులను అరెస్ట్ చేశారు.

ఇవి కూడా చదవండి..

Optical Illusion Test: మీ కళ్లకు, బ్రెయిన్‌కు టెస్ట్.. ఈ రాళ్ల మధ్యలో ఉన్న కుక్కను 5 సెకెన్లలో పట్టుకోండి..


Viral Video: వామ్మో.. కుక్కను మింగేసి కదల్లేకపోతున్న భారీ కొండ చిలువ.. షాకింగ్ వీడియో వైరల్..


Viral News: అద్దెకు బాయ్‌ఫ్రెండ్స్, గర్ల్‌ఫ్రెండ్స్.. వియత్నాంలో ఈ కొత్త ట్రెండ్‌కు కారణం ఏంటంటే..


Viral Video: ఈ కుక్కకు ఏమైంది.. పెళ్లి మండపంలో వధువుకు చుక్కలు చూపించిన పెట్ డాగ్..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Dec 12 , 2024 | 03:07 PM