Viral: వామ్మో.. బైక్ను ఇలాక్కూడా వాడొచ్చా.. ఏం తెలివిరా బాబూ..
ABN, Publish Date - May 23 , 2024 | 03:53 PM
బైక్ను ఊయలలా వాడిన ఓ వ్యక్తి వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. తాడు తెగితే తీవ్ర గాయాలు అవుతాయని నెటిజన్లు హెచ్చరిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: మనందరం చిన్నప్పుడు ఊయల ఊగే ఉంటాం. ఊయల మీద ఒకరు కూర్చుంటే మరొకరు దాన్ని తోయడం సాధారణంగా కనిపించే దృశ్యం. కానీ ఇందుకు భిన్నంగా బైక్ తో ఊయల సిద్ధం చేశాడో వ్యక్తి. అంతేకాదు దానిపై కూర్చుని ఊగుతూ నెటిజన్లు ఆశ్చర్యపోయేలా చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ (Viral) అవుతోంది.
వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఓ వ్యక్తి బైక్ తో చాలా వినూత్నంగా ఊయట డిజైన్ చేశాడు. ఇందుకోసం అతడు బైక్ కు ఇరు వైపులా తాళ్లు కట్టి బైక్ను వేళాడదీశాడు. ఈ ఊయల ఊగాలనుకుంటే ముందుగా దాన్ని సాధారణ స్థితిలో ఉంచి బైక్ ఎక్కాలి. ఆ తరువాత బైక్ స్టార్ట్ చేసి యాక్సెలరేటర్ రేయిజ్ చేయాలి. ఈ క్రమంలో బైక్ ముందుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. అయితే, బైక్ కు ఇరు వైపులా తాళ్లు కట్టి ఉండటంతో ఉండటంతో కొద్ది దూరంగా ముందుకెళ్లగానే బైక్ ఊయలలా గాల్లోకి లేచి మళ్లి యథాస్థానికి వచ్చేస్తుంది. ఇలా వచ్చిన ప్రతిసారీ యాక్సెలరేటర్ రేయిజ్ చేస్తూ చక్కగా ఊయల ఆట ఆడుకోవచ్చన్న మాట (This person made a bike swing and people are shocked).
Viral: వామ్మో.. బస్సులో రెస్టారెంట్.. ఇదేం ఐడియారా బాబూ!
@snoopdogg అనే ఇన్ స్టా అకౌంట్లో దీన్ని పోస్టు చేశారు. జనాలను ఆశ్చర్యరుస్తున్న ఈ వీడియోకు ఇప్పటివరకూ 69 వేల వ్యూస్ వచ్చాయి. చాలా మందికి ఈ ఐడియా నచ్చినా కొందరు మాత్రం పెదవి విరిచారు. ఇది ప్రమాదకరమైన చర్య అంటూ హెచ్చరించారు. తాళ్లు గనక అకస్మాత్తుగా తెగితే తీవ్రగాయాల పాలవ్వాల్సి వస్తుందని కొందరు హెచ్చరించారు. ఇలాంటి ఐడియాలు ఎందుకు వస్తాయో అంటూ కొందరు నోరెళ్లబెట్టారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య వీడియో వైరల్ అవుతోంది. జనాలను ఆశ్చర్యానికి గురి చేస్తున్న ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.
Updated Date - May 23 , 2024 | 04:38 PM