Viral: లాటరీలో రూ.20 కోట్లు గెలిచాక మహిళ జీవితం తారుమారు! విధి అంటే ఇదేనేమో!
ABN, Publish Date - Nov 18 , 2024 | 06:41 PM
లైఫ్‌లో ఏదీ శాశ్వతం కాదనేందుకు అసలైన ఉదాహరణగా నిలుస్తోందో యుకే మహిళ. చక్కని సంసారంతో పాటు ఊహించని విధంగా లాటరీ గెలవడంతో ఆమె జీవితంలో సంబరం అంబరాన్ని అంటింది. అంతలోనే డబ్బంతా కోల్పోయి చివరకు భర్తకు కూడా దూరమైంది.
ఇంటర్నెట్ డెస్క్: లైఫ్‌లో ఏదీ శాశ్వతం కాదనేందుకు అసలైన ఉదాహరణగా నిలుస్తోందో యుకే మహిళ. చక్కని సంసారంతో పాటు ఊహించని విధంగా లాటరీ గెలవడంతో ఆమె జీవితంలో సంబరం అంబరాన్ని అంటింది. అంతలోనే డబ్బంతా కోల్పోయి చివరకు భర్తకు కూడా దూరమైంది. ఒకప్పుడు విలాసవంతమైన జీవితాన్ని చవి చూసిన ఆమె నేడు అత్యంత సాధారణ జీవితం గడుపుతోంది. పరిస్థితి ఎలాంటిదైనా తట్టుకుని నిలబడమే తనకు తెలిసినదని చెబుతున్న ఈ మహిళ పేరు లారా. ఆమె ఉండేది వెస్ట్‌యార్క్ షైర్‌లో (Viral)..
Viral: ఒకటో తరగతి ఫీజు రూ.4.27 లక్షలు.. బాలిక తండ్రి గగ్గోలు
అది 2005. అప్పటికి లారా వయసు 30. ఆమెకు పెళ్లై ఓ కూతురు కూడా ఉంది. ఆమె భర్త రాజర్ ఐటీ మేనేజర్‌గా చేస్తుండగా లారా స్కూల్ టీచర్‌గా పనిచేసేది. వారికి డబ్బు అంతగా లేకపోయినా జీవితం మాత్రం హ్యాపీగా సాగిపోయేది. అలాంటి సమయంలో వారి జీవితం అనూహ్య మలుపు తిరిగింది. వారికి ఏకంగా రూ.20 కోట్ల లాటరీ తగిలింది. దీంతో భార్యాభర్తలిద్దరూ ఉబ్బితబ్బిబ్బైపోయారు. ఉన్నఫళంగా ఉద్యోగాలకు రాజీనామా చేశారు. రూ.4.8 కోట్లు పెట్టి విలాసవంతమైన భవనాన్ని కొన్నారు. లగ్జరీ లైఫ్‌కు అలవాటు పడ్డారు. విదేశీ టూర్ల పేరిట భారీగా డబ్బులు ఖర్చు చేశారు. వ్యాపార రంగంలోకి ప్రవేశించేందుకు ఓ బ్యూటీ సెలూన్ కూడా కొన్నారు.
Viral: ఈ సింహం ఓవర్ కాన్ఫిడెన్స్ చూడండి.. తృటిలో తప్పిన చావు!
అంతా సాఫీగా సాగిపోతున్నతరుణంలో 2010లో వారి ఇల్లు అగ్నిప్రమాదంలో బుగ్గి అయిపోయింది. రోజుల పాటు మంటల్లో పడి ఇల్లు తగలబడింది. చివరకు బూడిదె కుప్పగా మారింది. ఉండటానికి ఇల్లు కూడా లేని దశకు చేరుకున్న వారు తమ సంతానంతో కలిసి చాలా రోజుల పాటు హోటళ్లల్లో తలదాచుకున్నారు. కొన్నాళ్ల పాటు బంధువుల ఇళ్లల్లోనూ ఉన్నారు. చివరకు ఎట్టాగొట్టా ఇల్లు నిర్మించుకున్నారు.
కానీ లైఫ్‌లో ఈ ఏగుడుదిగుడులు వారి కాపురంలో చిచ్చు పెట్టాయి. భార్యాభర్తల మధ్య ఎడం పెరిగి చివరకు విడాకులకు దారి తీసింది. 2013లో డైవర్స్ తీసుకున్నారు. బిడ్డలిద్దరూ లారాతోనే ఉండిపోయారు. ఆ తరువాత రెండేళ్ల పాటు లారాకు నరకం కనిపించింది. ఒంటరైనానన్న బాధ ఓవైపు, పిల్లల బాధ్యతలు, ఆర్థిక ఒడిదుడుకులు మరోవైపు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేశాయి. చివరకు ఆమె బిడ్డల కోసమైనా జీవితంతో పోరాడాలని నిర్ణయించుకుని ముందడుగు వేసింది. మళ్లీ చిన్న ఉద్యోగంలో చేరి బిడ్డలను పెంచి పెద్ద చేసింది.
Viral: లాబొరేటరీలో 100 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ ప్రయోగం గురించి తెలిస్తే..
ప్రస్తుతం లారా పెద్ద కూతురి వయసు 20, చిన్న కూతురి వయసు 17. తాము ఏదోలా జీవితాన్ని నెట్టుకొస్తు్న్నామని లారా మీడియాకు చెప్పుకొచ్చింది. నాటి అగ్నిప్రమాదం పిల్లలపై తీవ్ర ప్రభావం చూపిందని, ఇప్పటికీ వారు ఆ ఘటన గుర్తొ్స్తే వణికిపోతారని లారా చెప్పింది. జీవితంలో అనుకున్నవన్నీ జరగవని తాను స్వానుభవంతో చేర్చుకున్న విషయమని లారా చెప్పుకొచ్చింది. జరిగిన దానికి తనకు విచారం లేదని కూడా వివరించింది. లైఫ్‌లో ముఖ్యమైనదేదో ఈ కష్టాలు తనకు నేర్పించాయని వివరించింది.
Viral: అమ్మో.. సొర చేపపై స్వారీ.. ఇంతకంటే మూర్ఖత్వం ఏమైనా ఉంటుందా
Updated Date - Nov 18 , 2024 | 06:47 PM