ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: జీప్ వీడియోతో స్ఫూర్తివంతమైన సందేశం ఇచ్చిన ఆనంద్ మహీంద్రా..

ABN, Publish Date - Jul 08 , 2024 | 05:31 PM

జీవితంలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా గమ్యం చేరతారంటూ స్ఫూర్తినింపే వీడియో షేర్ చేశారు ఆనంద్ మహీంద్రా. మండే మోటివేషన్ పేరిట షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది.

ఇంటర్నెట్ డెస్క్: వారంతం వచ్చిదంటే ఎంత సంబరంగా ఉంటుందో సోమవారం ఉదయం చాలా మందికి అంతే నైరాశ్యం ఆవరిస్తుంది. ఇలాంటి ఇబ్బంది తన ఫాలోవర్లకు రాకుండా ఉండేందుకు ప్రముఖ పారిశ్రామికవేత్త పలు స్ఫూర్తిమంతమైన విషయాలు సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు. Monday Motivation (మండే మోటివేషన్) పేరిట ఆయన షేర్ చేసే స్ఫూ్ర్తిమంతమైన కథనాలు నిత్యం వైరల్ (Viral) అవుతోంది. నేడు సోమవారం కాబట్టి మరో ఆణిముత్యం లాంటి సందేశంతో ఆనంద్ మహీంద్రా తన ఫాలోవర్లలో జోష్ నింపే ప్రయత్నం చేశారు.

Viral: అద్దె ఇళ్లకు ఇంత కరువొచ్చిందా! కేవలం బాల్కనీ రెంట్ రూ.81 వేలు


సాధారణ రహదారులు లేని ప్రాంతాల్లో ప్రయాణించేందుకు అనువుగా కొందరు ఆఫ్ రోడింగ్ వాహనాన్ని రెడీ చేశారు. మహీంద్రా జీపుకు కొన్ని మార్పులు చేసి ఆఫ్ రోడింగ్‌కు అనుకూలంగా మార్చారు. ఈ క్రమంలో జీపును భారీ గొయ్యిలున్న దారి మీదుగా పోనిచ్చారు. ఈ క్రమంలో కారు గొయ్యిలో పడిన ప్రతిశారీ బోల్తా పడ్డంత పనైంది. కానీ ఎలాగొలా తేరుకుని కారు గొయ్యి నుంచి బయటపడింది. ఇలా పలుమార్లు పరిస్థితి తలకిందులయ్యే స్థితి వచ్చినా తేరుకుని కారు గమ్యానికి చేరుకుంది.

నెట్టింట ఈ వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా చాలా విలువైన సందేశం చెప్పారు. దారి ఎంత కఠినంగా ఉన్నా మీరు కచ్చితంగా మీ గమ్యానికి చేరుకుంటారు అంటూ పోస్టు పెట్టారు. ఇది చూసిన జనాలు పెద్ద ఎత్తున స్పందించారు. స్ఫూర్తిమంతమైన వీడియో గొప్పగా ఉందని కామెంట్ చేశారు. ‘‘జీవితంలో అనూహ్య మలుపులు సవాళ్లు తప్పవు. ఇబ్బందులు తప్పవు. కానీ ఎన్ని అడ్డంకులు ఎదురైనా చివరకు గమ్యం కచ్చితంగా చేరతారు. జీవితం అంటే ఇదే’’ అని ఓ వ్యక్తి అభిప్రాపడ్డాడు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య వీడియో తెగ వైరల్ అవుతోంది.

Read Viral and Telugu News

Updated Date - Jul 08 , 2024 | 05:34 PM

Advertising
Advertising
<