ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: కొంపముంచిన హైనా.. జింకపై ప్రేమ కురిపించిన పులి.. చివరకు మనసు ఎలా మార్చుకుందంటే..

ABN, Publish Date - Mar 10 , 2024 | 09:46 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ జింక పిల్ల వద్దకు వెళ్లిన పులి (tiger) .. దాని చంపడం పోయి ప్రేమ కురిపించింది. ఎలాంటి హానీ చేయకుండా ముద్దులు పెడుతూ సొంత పిల్ల తరహాలో చూసుకుంది. జింక పిల్ల కూడా పులికి ముద్దులు పెడుతూ, అటూ ఇటూ తిరుగుతూ ఆడుకుంది. జింక పిల్ల ఆడుకోవడం చూసి

పులి వేటాడితే ఎలాంటి జంతువైనా దానికి బలి కావాల్సిందే. అయితే పులులు కూడా కొన్నిసార్లు కొన్ని జంతువులపై ఎక్కడ లేని ప్రేమ చూపిస్తుంటాయి. చంపాల్సింది పోయి స్నేహం చేస్తుంటాయి. అయితే ఇంకొన్ని పులులు ఉన్నట్టుండి చిత్రవిచిత్రంగా ప్రవర్తించడం కూడా చూస్తుంటాం. తాజాగా, ఇలాంటి పులికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. జింక పిల్లపై ఎక్కడ లేని ప్రేమ కురిపించిన పులి.. హైనా రావడం చూసి చివరకు ఏం చేసిందంటే..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ జింక పిల్ల వద్దకు వెళ్లిన పులి (tiger) .. దాని చంపడం పోయి ప్రేమ కురిపించింది. ఎలాంటి హానీ చేయకుండా ముద్దులు పెడుతూ సొంత పిల్ల తరహాలో చూసుకుంది. జింక పిల్ల (baby deer) కూడా పులికి ముద్దులు పెడుతూ, అటూ ఇటూ తిరుగుతూ ఆడుకుంది. జింక పిల్ల ఆడుకోవడం చూసి పులి ఎంజాయ్ చేస్తూ ఉంది. ‘‘నిన్ను చూస్తుంటే చంపాలి అనిపించలేదు.. నా ఆకలి పూర్తిగా చచ్చిపోయింది’’.. అన్నట్లుగా వ్యవహరిస్తుంది. అయితే అంతలో ఊహించని సంఘటన చోటు చేసుకుంటుంది. ఓ హైనా (Hyena) అటు వైపు వస్తుంది. హైనా రావడాన్ని చూసి పులి అలెర్ట్ అవుతుంది.

Viral Video: గూస్‌బమ్స్ తెప్పించే సీన్.. యువతిని జలపాతం నుంచి కిందకు తోయగానే.. చివరకు ఏం జరిగిందో చూస్తే..

అప్పటిదాకా జింక పిల్లపై ప్రేమ చూపించిన పులి.. దాన్ని హైనా ఎక్కడ ఎత్తుకెళ్లిపోతుందేమో అనే భయంతో ఒక్కసారిగా తనలోని సహజ గుణం బయటపెడుతుంది. అప్పటిదాకా ప్రేమ కురిపించిన పులి.. ఒక్కసారిగా చెలరేగిపోతుంది. జింక పిల్లను నోట కరుచుకుని ఓ పెద్ద చెట్టు పైకి ఎత్తుకెళ్తుంది. చెట్టు వద్దకు వెళ్లిన హైనా.. నిరాశగా చూస్తూ ఉండిపోతంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అయ్యో..! ఈ హైనా జింక ప్రాణం తీసిందే’’.. అంటూ కొందరు, ‘‘పులి చివరకు తన స్వభావాన్ని చూపించింది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1.90లక్షకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: కోబ్రాతో కోతి ఫన్నీ గేమ్.. తల మీద ఒక్కటి ఇవ్వగానే.. పాము రియాక్షన్ ఏంటంటే..

Updated Date - Mar 10 , 2024 | 09:46 PM

Advertising
Advertising