Viral Video: నీటి ఒడ్డున షాకింగ్ దృశ్యం.. వేట కోసం దాక్కున్న మొసలిని చూడగానే.. ఈ పులి ఏం చేసిందో చూడండి..
ABN, Publish Date - Feb 03 , 2024 | 03:59 PM
నీటిలో ఉన్న మొసలికి ఎంత బలం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పెద్ద పెద్ద ఏనుగులు సైతం నీటిలో ఉన్న మొసలి నుంచి తప్పించుకోవడం అసాధ్యం. దీంతో వాటి జోలికి వెళ్లేందుకు చాలా జంతువులు భయపడిపోతుంటాయి. అయితే..
నీటిలో ఉన్న మొసలికి ఎంత బలం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పెద్ద పెద్ద ఏనుగులు సైతం నీటిలో ఉన్న మొసలి నుంచి తప్పించుకోవడం అసాధ్యం. దీంతో వాటి జోలికి వెళ్లేందుకు చాలా జంతువులు భయపడిపోతుంటాయి. అయితే కొన్నిసార్లు ఇందుకు పూర్తి విరుద్ధంగా కూడా జరుగుతుంటుంది. ఇటీవల, ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆహారం కోసం నీటి ఒడ్డున పొంచి ఉన్న మొసలిని చూడగానే పులికి కోపం కట్టలు తెంచుకుంది. చివరకు ఏం జరిగిందందంటే..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. రాజస్థాన్‌లోని (Rajasthan) రణతంబోర్ నేషనల్ పార్క్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. పర్యాటకులంతా పార్కులోని జంతువులను సందర్శిస్తుండగా.. ఓ పులి వద్దకు వెళ్లగానే వారికి అరుదైన దృశ్యం కనిపించింది. ఓ మొసలి (crocodile) వేట కోసం నీటి ఒడ్డున పొంచి ఉంది. ఏదో ఒక జంతువు సమీపానికి వస్తే నోట కరుచుకుని వెళ్లాలని నక్కి నక్కి చూస్తోంది. అంతలో దాహం తీర్చుకోవడానికి ఓ పులి (tiger) అక్కడకు వెళ్లింది. అప్పటికే ఆవేశంతో ఉన్న పులి.. నీటి ఒడ్డుకు వెళ్లే ముందు మొసలి నక్కి ఉండడాన్ని గమనించింది.
మొసలి దాక్కుని ఉండడాన్ని చూడగానే పులికి కోపం కట్టలు తెంచుకుంటుంది. ‘‘ప్రశాంతంగా నీళ్లు తాగుదామని వస్తుంటే.. చంపేయాలని స్కెచ్ వేస్తావా’’.. అన్నట్లుగా కోపంగా దానిపై దాడి చేసేందుకు పరుగు పరుగున వెళ్తుంది. పులి రావడాన్ని చూసిన మొసలి.. భయంతో ఉలిక్కిపడి దూరంగా పారిపోతుంది. కాస్త దూరానికి వెళ్లి పులిని గమనిస్తూ ఉంటుంది. నీళ్లు తాగిన పులి అక్కడి నుంచి తాపీగా వెళ్లిపోతుంది. ఈ దృశ్యాన్ని పర్యాటకులు తమ ఫోన్లలో బంధించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 800కి పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.
రోజూ ఎండిన ఆప్రికాట్లను తీసుకుంటే.. ఎన్ని లాభాలంటే..
Updated Date - Feb 03 , 2024 | 04:01 PM