ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: బోను తాళాన్ని పళ్లతో విరగ్గొట్టిన పులి.. చూస్తే గూస్ బంప్స్ పక్కా!

ABN, Publish Date - Sep 17 , 2024 | 05:21 PM

బోనుకు వేసి ఉన్న తాళాన్ని ఓ పులి తన పంటితో విరగొట్టిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. పులి పంటి బలం చూసి జనాలు షాకైపోతున్నారు. ఇలాగైతే పులుల్ని బోనుల్లో బంధించడం కష్టమేనని కామెంట్ చేస్తున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: పులి బలం అంతా ఇంతా కాదు. ముఖ్యంగా దాని దవడలు, పళ్లకు ఉన్న శక్తి అపారం. కఠినమైన జంతు చర్మాలను, ఎముకలను అవి తమ పళ్లతో ఈజీగా ముక్కలు చేయగలవు. కానీ, ఇనుముతో చేసిన తాళాలు వంటి వాటిని కూడా విరగొట్టగలవంటే ఓ పట్టాన నమ్మబుద్ధి కాదు. కానీ ఓ పులి సరిగ్గా ఇదే చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ (Viral) అవుతూ జనాలు నోరెళ్లబెట్టేలా చేస్తోంది. గూస్ బంప్స్ తెప్పిస్తోంది.

వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఓ పులి తన బోనుకు ఉన్న తాళాన్ని ఈజీగా పగలగొట్టేసింది. ఆ తరువాత తలుపు తెరుచుకుని బయటకు వచ్చే ప్రయత్నం చేసింది. తొలుత అది తాళాన్ని పంటి కింద నొక్కి పెట్టి గట్టిగా వెనక్కు లాగింది. దీంతో, తాళం ఒక్కసారిగా విరిగిపోయింది. ఆ తరువాత అది తన పంజాతో బోను తలుపును తెరిచే ప్రయత్నం కూడా చేసింది (Tiger Uses Its Powerful Jaws To Break Cage Lock ).

Viral: వామ్మో.. వీఐపీ బాత్రూమ్‌లంట! రూ.1000! షాక్‌లో కస్టమర్లు!


వీడియోలో ఇదంతా చూసిన జనాలు షాకైపోతున్నారు. పులి తనంతట తానుగా ఎలా బయటకొచ్చిందని ప్రశ్నిస్తున్నారు. తాళాలను కూడా పగలగొట్టే శక్తి ఉందంటే ఇక వాటిని ఆపతరం ఎవరివల్లా కాదని కొందరు అన్నారు. మరికొందరు మాత్రం స్వేచ్ఛాజీవులనైన క్రూర మృగాలను బోనులో బంధించడం క్రూరత్వమని అభిప్రాయపడ్డారు. పులులకు ఇంత బలం ఉంటుందని తనకు తెలీదని, ఇకపై ఎప్పుడూ తాను జూకు వెళ్లబోనని మరో వ్యక్తి భయపడుతూ కామెంట్ చేశారు. కొందరు మాత్రం ఇందులో ఆశ్చర్యకరమైంది ఏమీ లేదని అన్నారు. కుక్కలు కూడా అప్పుడప్పుడూ ఇలా చేయగలవని, అలాంటప్పుడు ఓ పులి చేయడంలో వింతేమీ లేదని అన్నారు.

Viral: పొట్టపై సాలీడు కుడితే ఇంత ప్రమాదమా! ఇతడికి ఏమైందో తెలిస్తే..


ఇక ప్రస్తుతం వైరల్ అవుతున్న మరో వీడియోలో ఓ పులి జూకు వచ్చిన చిన్నారిని అనుకరించే ప్రయత్నం చేసింది. తొలుత ఓ బాలుడు బోనులోని పులి ఎదుట నిలబడ్డాడు. ఆ తరువాత బోనుకు ఉన్న గాజు గోడపై చేతులతో పంజావిసరుతున్నట్టు గీరాడు. ఇది చూసిన పులి కూడా గాజు గోడపై పంజాతో బాలుడి మాదిరే చేసింది. ఎలాగైనా బాలుడిని పట్టుకోవాలన్న తాపత్రయం కనిపించింది. ఈ వీడియో చూసిన జనాలు షాకైపోతున్నారు. జీవితం మొత్తం బోనులోనే గడిపినా కూడా పులి దాని వేటాడే లక్షణాన్ని కోల్పోలేదని కామెంట్ చేశారు. (వీడియో కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి).

Viral: తల్లి ఇంట్లో లేకపోతే ఇంతే.. పిల్లలను రిస్క్‌లో పడేసిన తండ్రి!


Viral: ఈ రక్తం ధర లీటరుకు రూ.12 లక్షలు! ఇంత ఖరీదు ఎందుకో తెలిస్తే..

Viral: విమానం ఎంట్రీ డోర్స్ ఎడమ వైపే ఎందుకుంటాయో తెలుసా?

Read Latest and Viral News

Updated Date - Sep 17 , 2024 | 05:29 PM

Advertising
Advertising