ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral: దుబాయ్‌లో జలప్రళయం రేంజ్ ఇదా? ఒళ్లుగగుర్పొడిచే 30 సెకెన్ల వీడియో..!

ABN, Publish Date - Apr 19 , 2024 | 10:00 PM

దుబాయ్ ఆకస్మిక వర్షం బీభత్సం ఎంతటిదో చెప్పే టైమ్ లాప్స్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

Time Lapse Video of Dubai Rains Goes Viral

ఇంటర్నెట్ డెస్క్: దుబాయ్‌లో ఆకస్మిక వానలు (Dubai Rains, Flooding) ఎంతటి ప్రళయం సృష్టించాయో తెలిసింది. 24 గంటల వ్యవధిలో కురిసిన కుండపోత వర్షం యావత్ యూఏఈని సంద్రంగా మార్చేసింది. రహదారులన్నీ జలమయమై కార్లు పెద్ద సంఖ్యలో కొట్టుకుపోయాయి. గత 75 ఏళ్లల్లో ఎన్నడూ చూడని స్థాయిలో వాన కురిసిందని దుబాయ్ ప్రభుత్వం చెప్పింది. దీన్నో చారిత్రాత్మక ఘటనగా అభివర్ణించింది. అయితే, వర్షం ఏం రేంజ్‌లో కురిసిందీ చెప్పే ఓ టైమ్ లాప్స్ వీడియో (Time Lapse Video) నెట్టింట వైరల్‌గా (Viral) మారింది.

Viral Video: ఇలాంటోళ్లతో రైళ్లల్లో ప్రయాణించడం నరకమే! మహిళ ఎంతకు తెగించిందో చూడండి!


కేవలం 30 సెకెన్ల నిడివి గల ఈ వీడియో జనాలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. యూఏఈపై మేఘాలు ఆవరించిన క్షణం నుంచి కుండపోత వర్షం వరకూ మొత్తం ఈ వీడియోలో చూడొచ్చు. తొలుత మేఘాలు మెల్లగా ఆ ప్రాంతమంతా ఆవరిస్తాయి. ఈ క్రమంలో చిరుజల్లుగా మొదలైన వాన ఆ తరువాత విశ్వరూపం దాలుస్తుంది. కుంభవృష్టి కురుస్తోంది.

వీడియోలో ఇదంతా చూసిన జనాలు భయపడిపోతున్నారు. ప్రకృతి కన్నెర చేస్తే మానవాళి బ్రతుకు క్షణాల్లో తలకిందులవుతుందని కామెంట్ చేశారు. ప్రకృతి శక్తి ఎంతటిదో కళ్లకు కట్టినట్టు చూపించిందీ వీడియో అంటూ కొందరు కామెంట్ చేశారు. ఇక అంతర్జాతీయ వార్తా కథనాల ప్రకారం, ఈ ఆకస్మిక వర్షాలు యూఏఈతో పాటూ పొరుగున ఉన్న ఒమాన్ దేశాన్నీ అతలాకుతలం చేశాయి. ఒమాన్‌ సరిహద్దుకు సమీపంలోని దుబాయ్ నగరం అల్ అయిన్‌లో రికార్డు స్థాయిలో 10 అంగుళాల వర్షపాతం నమోదైంది.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Apr 19 , 2024 | 10:10 PM

Advertising
Advertising