Viral: జస్ట్ 2 ఏళ్ల వయసు.. ఇంత స్పీడేంటిరా! ఈ తరం రేంజే వేరు!
ABN , Publish Date - Dec 07 , 2024 | 01:30 PM
టెక్నాలజీ ఇచ్చిన ఊపుతో నేటి తరం చిన్నారులు దూసుకుపోతున్నారు. అనంతమైన సమాచారాన్ని చిటికెలో మెదళ్లల్లోకి ఎక్కించుకుంటూ పాలబుగ్గల వయసులోనే ప్రపంచం గురించి అన్నీ తెలుసుకుంటున్నారు. ఇందుకు తాజా ఉదాహరణగా ఓ బాలుడి వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: టెక్నాలజీ ఇచ్చిన ఊపుతో నేటి తరం చిన్నారులు దూసుకుపోతున్నారు. అనంతమైన సమాచారాన్ని చిటికెలో మెదళ్లల్లోకి ఎక్కించుకుంటూ పాలబుగ్గల వయసులోనే ప్రపంచం గురించి అన్నీ తెలుసుకుంటున్నారు. ఇందుకు తాజా ఉదాహరణగా ఓ బాలుడి వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. వీడియోలో చిన్నారి తెలివితేటలు చూసి జనాలు షాకైపోతున్నారు. ఇంత స్పీడేంటిరా బాబూ అంటూ నోరెళ్లబెడుతున్నారు (Viral).
Psychological Games: పురుషులు మహిళలపై ప్రయోగించే మైండ్ గేమ్స్ ఇవే!
ఓ మహిళ తన కుమారుడి తెలివితేటల్ని చూపెడుతూ ఈ వీడియో షేర్ చేసింది. మాటలు కూడా సరిగ్గా రాని రెండేళ్ల వయసులో ఉన్న ఆ కుర్రాడు పార్కింగ్ స్థలంలో కలియతిరుగుతూ ఎదురుగా ఉన్న కార్లు ఏవో చకచకా చెప్పేశాడు. హోండా.. సూబరూ, కియా, షెవీ, ఫోక్స్‌వ్యాగన్.. ఇలా కార్లను గుర్తుపట్టి వాటి పేర్లను చకచకా చెప్పేశాడు. ఓ రెండు మూడు సార్లు చిన్నారి తడబడితే తల్లి సరిదిద్దింది. ఆ తరువాత రెట్టించిన ఉత్సాహంతో చిన్నారి తనకు కార్లపై ఉన్న ఆసక్తిని ప్రదర్శించాడు.
Washing White Clothes: ఈ టెక్నిక్స్‌తో తెల్ల దుస్తులపై పాత మరకలు మాయం!
ఇక వీడియో చూసిన అనేక మంది మురిసిపోయారు. పిల్లాడి తెలివితేటలకు జేజేలు పలికారు. అతడు ముద్దుముద్దుగా కార్ల పేర్లు పలుకుతుంటే చూసి అనేక మంది సంబర పడ్డారు. ‘‘హోండా అనే పదాన్ని భలే పలుకుతున్నాడుగా’’ అని ఓ వ్యక్తి కామెంట్ చేశారు. ఇతడు భవిష్యత్తులో గొప్ప కార్ల సేల్స్‌మన్ అవుతాడని కొందరు చెప్పారు. భవిష్యత్తులో పెద్ద రేసర్ అవుతాడని మరికొందరు కామెంట్ చేశారు.
Kitchen: వాస్తు శాస్త్రం ప్రకారం వంటగదిలో ఈ మార్పులు తప్పనిసరి!
కాగా, గతంలో ఇలాంటి వీడియో ఒకటి భారత్‌లో కూడా వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఆరో తరగతిలో ఉన్న కొందరు విద్యార్థులు కోడింగ్ నేర్చుకోవడమే కాకుండా ఓ వెబ్‌సైట్ డిజైన్‌లోని బాగోగుల గురించి విశ్లేషాత్మకంగా కామెంట్స్ చేస్తుండటం పలువురిని ఆకర్షించింది. టెక్నాలజీ అండతో నేటి తరం దూసుకుపోతోందని కొందరు కామెంట్ చేశారు. మరికొందరు మాత్రం ఈ తీరుపై పెదవి విరిచారు. ఆటలు ఆడుతూ శారీరక, మానసిక ఆరోగ్యం నైపుణ్యాలు పెంపొందించుకోవాల్సిన వయసులో ఉన్న పిల్లలు ఇలా కంప్యూటర్లకు అతుక్కుపోవడం అంత మంచిది కాదని కామెంట్ చేశారు. అప్పట్లో ఈ ఉదంతంపై పెద్ద చర్చే జరిగింది.
Viral: ఏం ఐడియా బ్రో.. గుళ్లల్లో చెప్పులు చోరీ కాకుండా ఉండేందుకు భలే చిట్కా!