కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: రైలు ప్రయాణికులను ఆకట్టుకుంటున్న భేల్ పూరీ వ్యాపారి.. ఇంతకీ ఇతడి వ్యాపార టెక్నిక్ ఏంటో మీరే చూడండి..

ABN, Publish Date - Jan 04 , 2024 | 08:47 PM

వ్యాపారం చేయడంలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. కొందరు కొత్త కొత్త రెసిపీలతో సరికొత్త వంటకాలను తయారు చేస్తూ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటుంటే.. మరికొందరు తమ ప్రవర్తన ద్వారా కస్టమర్లను ఆకట్టుకుంటుంటారు. ఇంకొందరు...

Viral Video: రైలు ప్రయాణికులను ఆకట్టుకుంటున్న  భేల్ పూరీ వ్యాపారి.. ఇంతకీ ఇతడి వ్యాపార టెక్నిక్ ఏంటో మీరే చూడండి..

వ్యాపారం చేయడంలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. కొందరు కొత్త కొత్త రెసిపీలతో సరికొత్త వంటకాలను తయారు చేస్తూ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటుంటే.. మరికొందరు తమ ప్రవర్తన ద్వారా కస్టమర్లను ఆకట్టుకుంటుంటారు. ఇంకొందరు సాధారణానికి భిన్నంగా వ్యాపారం చేస్తూ అందరి దృష్టినీ ఆకర్షించడం చూస్తూ ఉంటాం. ఇలాంటి వ్యాపారులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి రైల్లో భేల్ పూరీ విక్రయిస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు. ఇంతకీ ఇతడి వ్యాపార టెక్నిక్ ఏంటో మీరే చూడండి..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ చిరు వ్యాపారి రైల్లో భేల్ పూరీ (Bhel Puri) విక్రయిస్తుంటాడు. ఇందులో ప్రత్యేకత ఏముందీ అని సందేహం రావొచ్చు. భేల్ పూరీని అందరిలా కాకుండా ఇతడు ప్రత్యేకంగా మిక్స్ చేస్తూ ప్రయాణికులను ఆకట్టుకుంటున్నాడు. భేల్ పూరీకి కావాల్సిన ఆహార పదార్థాలను అన్నింటినీ డబ్బాల్లో వేసుకుని, వాటిని నడుముకు కుట్టుకున్నాడు. అయితే ఇతడు భేల్ పూరీ చేసే సమయంలో ఎక్కడా అపరిశుభ్రత లేకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు.

Viral Video: గీజర్‌గా మారిన పొయ్యి.. ఓ వైపు వంట చేస్తుంటే.. మరోవైపు వేడినీరు ఎలా వస్తుందో చూడండి..

ఈ వ్యాపారి ఏ ఆహార పదార్థాన్నీ చేత్తో తాకకుండా స్పూన్ ఉపయోగిస్తున్నాడు. ఇలా స్పూన్ తీసుకుని అన్ని ఆహార పదార్థాలనూ సమపాళ్లలో కలిపి శుభ్రంగా అందిస్తుండడంతో ప్రయాణికులు కొనేందుకు ఆసక్తికనబరుస్తున్నారు. అందులోనూ ఇతడు చేసే భేల్ పూరీ ఎంతో రుచిగా ఉండడంతో అంతా ఎగబడి మరీ కొంటున్నారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఎంతో శుభ్రత పాటిస్తున్నాడు’’.. అంటూ కొందరు, ‘‘భవిష్యత్తులో ఇతను పెద్ద వ్యాపారవేత్త అవుతాడు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral: చైనీయులు బలంగా నమ్మే ఈ వస్తువులను మీ ఇంట్లో పెట్టుకుంటే.. ఏం జరుగుతుందో తెలుసా..

Updated Date - Jan 04 , 2024 | 09:05 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising