ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Locomotive In Field: పొలంలో రైలు ఇంజెన్ ప్రత్యక్షం.. జనాలకు షాక్!

ABN, Publish Date - Sep 15 , 2024 | 04:12 PM

పొలంలో ఓ రైల్ ఇంజెన్ కనిపించిన అసాధారణ ఘటన బీహార్‌లో తాజాగా వెలుగు చూసింది. గయా జిల్లాలో పట్టాలు తప్పిన ఓ రైలు ఇంజెన్ ట్రాక్ పక్కనే ఉన్న పొలంలోకి దూసుకొచ్చింది.

ఇంటర్నెట్ డెస్క్: పొలంలో ఓ రైల్ ఇంజెన్ కనిపించిన అసాధారణ ఘటన బీహార్‌లో తాజాగా వెలుగు చూసింది. గయా జిల్లాలో పట్టాలు తప్పిన ఓ రైలు ఇంజెన్ ట్రాక్ పక్కనే ఉన్న పొలంలోకి దూసుకొచ్చింది. శుక్రవారం జరిగిన ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బురదలో ఇరుక్కున్న రైలు ఇంజెన్‌ను చూసేందుకు తండోపతండాలుగా తరలివచ్చారు (Viral).

Viral: బిడ్డకు ఆ పేరు పెట్టొద్దు! తల్లిదండ్రులకు అడ్డుపడ్డ కోర్టు!


రఘునాథపూర్ గ్రామంలో వెలుగు చూసిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. బోగీలు లేకుండా ఇంజెన్ లూప్‌లైన్‌లో ప్రయాణిస్తుండగా ఇంజెన్ పట్టాలు తప్పి పొలంలోకి దూసుకొచ్చింది. ఆ తరువాత కొద్ది సేపటికి అక్కడికి వచ్చిన స్థానికులు పొలంలోని బురదలో రైలు ఇంజెన్ కనిపించడం చూసి షాకైపోయారు. అసలు అది పొలంలోకి ఎలా వచ్చిందో అనుకుంటూ నోరెళ్లబెట్టారు. కొందరు రైలు ఇంజెన్‌తో సెల్ఫీలు దిగారు. దీంతో, ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారింది. పొలం దున్నేందుకు రైలు ఇంజెన్‌ను తెచ్చి ఉంటారని కొందరు ఛలోక్తులు విసిరారు (Train Engine Spotted In Field In Bihars Gaya Pic Goes Viral).

Viral: ఈ రక్తం ధర లీటరుకు రూ.12 లక్షలు! ఇంత ఖరీదు ఎందుకో తెలిస్తే..


మరోవైపు, ఘటన గురించి తెలియగానే అధికారులు అక్కడకు చేరుకున్నారు. అయితే, దాన్ని మళ్లీ పట్టాలెక్కించేందుకు వారు చేస్తున్న ప్రయత్నాలు ఇంకా ఓ కొలిక్కి రాలేదని సమాచారం. ఘటనపై స్థానిక స్టేషన్ మాస్టర్ కూడా ఇంకా స్పందించలేదని జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

Viral: సక్సెస్ అంటే ఇదీ.. సిలికాన్ వ్యాలీలోని ఈ ఎన్నారై ఇల్లు చూస్తే..

Read Latest and Viral News

Updated Date - Sep 15 , 2024 | 04:17 PM

Advertising
Advertising