ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రయాణమే.. ఈ డాగీ పని

ABN, Publish Date - Dec 15 , 2024 | 11:05 AM

అనగనగా ఓ శునకం. దాని పేరు బోజీ. ఈ డాగీకి బస్సు, రైలు, ఓడలు ఎక్కి ప్రయాణించడ మంటే మహా ఇష్టం. పొద్దున్నే లేవడం, ప్రజా రవాణాని ఉపయోగించుకుని ఇస్తాంబుల్‌ మొత్తం చుట్టి రావడమే తన రోజూవారి పని.

అనగనగా ఓ శునకం. దాని పేరు బోజీ. ఈ డాగీకి బస్సు, రైలు, ఓడలు ఎక్కి ప్రయాణించడ మంటే మహా ఇష్టం. పొద్దున్నే లేవడం, ప్రజా రవాణాని ఉపయోగించుకుని ఇస్తాంబుల్‌ మొత్తం చుట్టి రావడమే తన రోజూవారి పని. అయితే దీన్ని గమనించిన కొందరు అధికారులు ఇది ఎక్కడికి వెళ్తుందోనని తెలుసుకోవడానికి.. దాని చెవికి ఓ ట్రాక్‌ చిప్‌ అమర్చారు. అందులో తెలిసిందేంటంటే.. ఈ శునకం దానికి కనిపించిన ఏదో ఒక వాహనం ఎక్కి గుర్తు తెలియని ప్రాంతానికి వెళ్లడం లేదట. సరిగ్గా ఏదో చారిత్రక కట్టడాన్ని సందర్శించడానికే వెళ్తుందని తెలిసి అధికారులు సైతం నోరెళ్లబెట్టారు. అయితే ఇదేమీ బోజీకి కొత్త కాదు..


గత పదేళ్లుగా ప్రయాణమే తన ప్రధాన అభిరుచి అట. ఇస్తాంబుల్‌లో ప్రతీరోజు బస్సు, మెట్రోలలో ప్రయాణించే వారికి బోజీ సుపరిచితురాలే. ప్రయాణికులు ఎంత హడావిడిగా ఆఫీసులకు వెళ్లినా.. బోజీ కనిపించగానే హాయ్‌ చెప్పాల్సిందే. కొందరేమో దాంతో సెల్ఫీలు దిగుతుంటారు. వారికి బోజీ కూడా మంచి పోజులు ఇస్తుంది. ట్రైన్‌, బస్సులో సీట్లు ఖాళీ ఉంటే ఇది దర్జాగా వెళ్లి అక్కడ కూర్చుంటుంది. అలాగే ఎవరైనా నించొని ఉంటే తన సీట్‌ను వాళ్లకు ఇచ్చేస్తుందట. ఇలా మొత్తానికి రోజుకు 30 కిలోమీటర్లు సునాయసంగా ప్రయాణించి ఔరా అనిపిస్తుందీ డాగీ.

Updated Date - Dec 15 , 2024 | 11:05 AM