ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: వేల కోట్ల ఆస్తి ఉన్నా.. 30 ఏళ్లుగా చీరలు కొనని సుధామూర్తి! ఎందుకంటే..

ABN, Publish Date - Jul 05 , 2024 | 04:59 PM

ముఫ్పై ఏళ్ల క్రితం తాను కాశీ వెళ్లినప్పుడు గంగా నది సాక్షిగా షాపింగ్ అలవాటును వదిలిపెట్టానని సుధామూర్తి చెప్పారు. నాటి నుంచీ ఇప్పటివరకూ ఒక్క చీర కూడా కొనలేదని అన్నారు. స్నేహితులు బంధువులు ఇచ్చిన చీరలను ధరిస్తున్నానని వివరించారు.

ఇంటర్నెట్ డెస్క్: ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి అర్ధాంగి సుధామూర్తి సాధారణ జీవితం గడపడానికే ఇష్టపడతారు. వేల కోట్ల ఆస్తిపరురాలైనా ఆమె నిరాడంబర జీవన శైలికి అమిత ప్రాధాన్యం ఇస్తారు. తన తల్లి, అమ్మమ్మను చూసి ఈ అలవాటు నేర్చుకున్నానని ఆమె తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. తాను గత 30 ఏళ్లుగా ఒక్క చీర కూడా కొనుక్కోలేదని అన్నారు (Viral).

‘‘కాశీకి వెళితే ఏదైనా నచ్చినది ఒదులుకోవాలనేది తరతరాల ఆనవాయితీగా వస్తోంది. నాకు షాపింగ్ అంటే చాలా ఇష్టం. కాబట్టి, అక్కడికి వెళ్లినప్పుడు గంగా నది సాక్షిగా ఇక జీవితంలో ఎన్నడూ షాపింగ్ చేయనని ప్రమాణం చేశాను’’ అని సుధామూర్తి తెలిపారు. నాటి నుంచీ తాను దీనికి కట్టుబడే ఉన్నానని పేర్కొన్నారు. పెద్దల నుంచి వారసత్వంగా వచ్చిన సంస్కారమే దీనికి కారణమని వివరించారు (Trip To Kashi 30 Years Ago Convinced Sudha Murty To Not Buy Sarees).

Viral: మరీ ఇలా తెగించేస్తున్నారేంట్రా.. పెట్రోల్ బంక్‌లో ప్రాణాలతో చెలగాటమా!!

‘‘ఆరున్నర ఏళ్ల క్రితం నా తల్లి మరణించినప్పుడు ఆమెకు సంబంధించిన వస్తువులను మేము అరగంటలోనే ఇతరులకు ఇచ్చేశాం. ఎందుకంటే, ఆమె వద్ద 8 నుంచి 10 చీరలకు మించి లేవు. మా అమ్మమ్మ 32 ఏళ్ల క్రితం పోయారు. ఆమె వద్ద కూడా నాలుగు చీరలు మాత్రమే ఉండేవి. కాబట్టి, సింపుల్‌గా జీవించడమనే తీరు నాకు పెద్దల నుంచి సంక్రమించింది. కాబట్టి, వస్తువ్యామోహం లేకుండా నిరాడంబరంగా జీవించడం నాకు అంత పెద్ద కష్టమేమీ అనిపించలేదు’’ అని ఆమె చెప్పారు.


షాపింగ్ అలవాటు వదులుకున్నాక సుధామూర్తి తనకు బంధువులు, స్నేహితులు బహుమతిగా ఇచ్చిన చీరలను మాత్రమే కట్టుకోవడం ప్రారంభించారు. ఒక్కోసారి సుధామూర్తితో కలిసి పని చేసే ఎన్జీఓలు కూడా చీరలు బహుమతిగా ఇస్తుంటాయి. సుధామూర్తి బాగా నచ్చిన దుస్తుల్లో రెండు ఎంబ్రాయిడరీ చేసిన చీరలను ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ద్వారా సాయం పొందిన మహిళా బృందాలు బహూకరించాయి.

ఇలా బహుమతిగా వచ్చిన చీరలు కొండలా పేరుకు పోవడంతో ఇక చాలని ఓసారి తన శ్రేయోభిలాషులకు చెప్పినట్టు సుధామూర్తి పేర్కొన్నారు. తన చీరలు త్వరగా పాడుకాకుండా ఉండేందుకు అనేక జాగ్రత్తలు తీసుకుంటానని కూడా చెప్పారు. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్మన్‌గా గతంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించిన సుధామూర్తి పిల్లల కోసం అనేక పుస్తకాలు కూడా రచించారు. ఈ ఏడాది మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె రాజ్యసభకు నామినేట్ అయ్యారు.

Read Viral and Telugu News

Updated Date - Jul 05 , 2024 | 05:03 PM

Advertising
Advertising