Puzzle: డైనింగ్ టేబుల్ వద్ద వీళ్లిద్దరిలో ఒకరు తప్పు చేస్తున్నారు.. అదేంటో కనిపెట్టేందుకు ప్రయత్నించండి..
ABN, Publish Date - Apr 18 , 2024 | 05:44 PM
సోషల్ మీడియాలో అనేక ఆప్టికల్, పజిల్ ఫొటోలు వైరల్ అవుతుంటాయి. పైకి కనిపించే దృశ్యం ఒకటైతే.. లోపల ఇంకో దృశ్యం దాగి ఉంటుంది. అలాగే ఒకేలా ఉన్న రెండు ఫొటోల్లో అనేక తేడాలు ఉంటాయి. ఇలాంటి..
సోషల్ మీడియాలో అనేక ఆప్టికల్, పజిల్ ఫొటోలు వైరల్ అవుతుంటాయి. పైకి కనిపించే దృశ్యం ఒకటైతే.. లోపల ఇంకో దృశ్యం దాగి ఉంటుంది. అలాగే ఒకేలా ఉన్న రెండు ఫొటోల్లో అనేక తేడాలు ఉంటాయి. ఇలాంటి అనేక ఫొటోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంటాయి. వాటికి సమాధానాలు కనుక్కునేందుకు చాలా మంది ప్రయత్నిస్తుంటారు. ప్రస్తుతం అలాంటి ఆసక్తికర పజిల్ ఫొటోను మీ ముందుకు తీసుకొచ్చాం. ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఓ జంట డైనింగ్ టేబుల్ మీద కూర్చుని సూప్ తాగుతూ ఉంది. అయితే వాళ్లిద్దరిలో ఒకరు తప్పు చేస్తున్నారు. ఆ తప్పేంటో కనుక్కునేందుకు ప్రయత్నించండి..
సోషల్ మీడియాలో పజిల్ ఫొటో (Puzzle viral photo) ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో ఓ జంట డైనింగ్ టేబుల్ వద్ద కూర్చుని సూప్ తాగుతూ ఉంది. టేబుల్‌పై వాళ్లకు ఎదురుగా పాలు, బిస్కట్లు తదితర అనేక ఆహార పదార్థాలు ఉన్నాయి. ఇంతవరకూ బాగానే ఉన్నా ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. సూప్ తాగుతున్న వీళ్లిద్దరిలో ఒకరు తప్పు చేస్తున్నారు.
ఆ జంట చేస్తున్న తప్పు ఏంటో పసిగట్టడం కష్టమే అయినా.. కాస్త తీక్షణంగా చూస్తే సులభంగా చెప్పేయవచ్చు. మీకు ఇంకా క్లూ కావాలంటే.. వాళ్లు తినే పద్ధతిని గమనిస్తే.. సమాధానం ఈజీగా తెలిసిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం ఆ తప్పు ఏంటో పసిగట్టండి. ఇప్పటికీ మీరు ఆ తప్పును గుర్తించకపోతే మాత్రం ఈ కింద ఫొటో చూసి సమాధానం తెలుసుకోండి.
Viral Video: ఇదెలా సాధ్యం..! బండ రాయి కింద లంకెబిందె.. తెరచిచూడగా..
Updated Date - Apr 18 , 2024 | 05:44 PM