Photo Puzzle: ఇక్కడ కనిపిస్తున్న రెండు ఫొటోల్లో 5 తేడాలు ఉన్నాయి. అవేంటో 60 సెకన్లలో గుర్తిస్తే మీకు తిరుగులేనట్లే..
ABN, Publish Date - Feb 14 , 2024 | 06:08 PM
ఆప్టికల్ ఇల్యూజన్, ఫొటో ఫజిల్స్ తదితరాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. వీటిలో కొన్నింటిని పరిష్కరించడం చాలా కష్టం అవుతుంటుంది. కానీ చివరకు చూస్తే అందులో లాజిక్ చాలా సింపుల్‌గా ఉంటుంది. ఇలాంటి ..
ఆప్టికల్ ఇల్యూజన్, ఫొటో ఫజిల్స్ తదితరాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. వీటిలో కొన్నింటిని పరిష్కరించడం చాలా కష్టం అవుతుంటుంది. కానీ చివరకు చూస్తే అందులో లాజిక్ చాలా సింపుల్‌గా ఉంటుంది. ఇలాంటి ఫొటోలు, వీడియోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంటాయి. తాజాగా, ఇలాంటి ఫొటో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఇక్కడ మీకు కనిపిస్తన్న రెండు కోతి ఫొటోల్లో మొత్తం 5 తేడాలు ఉన్నాయి. అవేంటో 60 సెకన్లలో గుర్తిస్తే మీ కంటి చూపు చురుగ్గా ఉన్నట్లు అర్థం.
సోషల్ మీడియాలో కోతి ఫజిల్ ఫొటో (Fuzzy photo) తెగ వైరల్ అవుతోంది. ఓ పిల్ల కోతి (monkey) చెట్టు కొమ్మపై నడుస్తూ ఫొటోకు ఫోజు ఇస్తూ ఉంది. దాని వెనుకే పెద్ద చెట్టు కూడా ఉంది. అయితే ఇక్కడున్న రెండు ఫొటోల్లో మొత్తం 5 తేడాలు ఉన్నాయి. ఒక ఫొటోల్లో ఉన్నవి మరో ఫొటోలో కనిపించవు. కానీ పైకి చూస్తే అలాంటి డౌటే రాదు. ఆ 5 తేడాలేంటో గుర్తించేందకు అంతా తెగ ట్రై చేస్తున్నారు. కొందరు ఇందులో సక్సె్స్ అయితే.. మరికొందరు ఫెయిల్ అవుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. ఆ 5 తేడాలేంటో గుర్తించడానికి మీరూ ఓసారి ట్రైచేయండి. ఒక వేళ మీకు కష్టం అనిపిస్తే.. ఈ కింద ఇచ్చిన ఫొటో చూసి సమాధానం తెలుసుకోవచ్చు.
Optical illusion: ఈ చెట్ల మధ్యన దాక్కున్న.. మూడు గుడ్లగూబలను కనిపెట్టడం మీ వల్ల అవుతుందా..?
Updated Date - Feb 14 , 2024 | 06:08 PM