Optical illusion: మీరు నిజంగా చురుకైన వారైతే.. ఇందులో దాక్కున్న కారును 20 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..
ABN, Publish Date - Dec 05 , 2024 | 08:40 PM
ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో చాలా మంది పిల్లలు, పెద్దలు కలిసి పార్క్‌లో చెట్లకు నీరు పడుతున్నారు. కొందరు చెట్టుకు బకెట్ వేలాడదీస్తుంటే.. మరికొందరు పిల్లలు బకెట్‌తో చెట్లకు నీళ్లు పోస్తున్నారు. అయితే ఇదే చిత్రంలో ఓ కారు కూడా దాక్కుని ఉంది. దాన్ని 20 సెకన్లలో గుర్తించండి చూద్దాం..
ప్రస్తుత ఉరుకుపరుగుల జీవితంలో చాలా మందిలో ఏకాగ్రత లోపించడంతో పాటూ అనేక మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని కొన్ని వ్యాపకాలను అలవాటు చేసుకోవడం ద్వారా ఇలాంటి సమస్యల నుంచి బయటపడొచ్చు. అలాగే అనేక రకాల పజిల్స్‌ను పరిష్కరించడం వల్ల మెడదును షార్ప్‌గా మార్చుకోవడంతో పాటూ మానసికోళ్లాసం పొందవచ్చు. దీన్ని దృష్టిలో ఉంచుకుని మీకోసం ప్రస్తుతం ఓ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాన్ని తీసుకొచ్చాం. ఈ చిత్రంలో కారు దాక్కుని ఉంది. దాన్ని 20 సెకన్లలో కనిపెడితే మీరు ఎంతో చురుకైన వారని అర్థం.
సోషల్ మీడియాలో ఓ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం (Optical illusion Viral Photo) తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో చాలా మంది పిల్లలు, పెద్దలు కలిసి పార్క్‌లో (Park) చెట్లకు నీరు పడుతున్నారు. కొందరు చెట్టుకు బకెట్ వేలాడదీస్తుంటే.. మరికొందరు పిల్లలు బకెట్‌తో చెట్లకు నీళ్లు పోస్తున్నారు.
ఆ పార్క్‌లో పిల్లలతో పాటూ ఓ కుక్క కూడా ఉంటుంది. ఇక్కడ మీకు చాలా పెద్ద పెద్ద చెట్లు కనిపిస్తుంటాయి. అలాగే నేలపై మొత్తం మంచు కప్పుకొని ఉంటుంది. ఇక్కడ చెట్లు, మనుషులు, కుక్క తప్ప మరేదీ లేనట్లు అనిపిస్తుంది. కానీ మీకు తెలీని విషయం ఏంటంటే.. మీ కంటికి కనిపించకుండా ఈ చిత్రంలో (hidden car) ఓ కారు కూడా దాక్కుని ఉంది. కానీ దాన్ని గుర్తించడం అంత సులభం కాదు. అలాగని అంత పెద్ద కష్టం కూడా కాదు.
కాస్త నిశితంగా పరిశీలిస్తే సులభంగా గుర్తించవచ్చు. చాలా మంది ఆ కారును గుర్తించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అయితే వారిలో కొందరు మాత్రమే ఆ కారును గుర్తించగలుగుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఆ కారును గుర్తించేందకు మీరూ ప్రయత్నించండి. ఒకవేళ ఇప్పటికీ మీరు ఆ కారును గుర్తించలేకపోతే మాత్రం.. ఈ కింద ఇచ్చిన చిత్రం చూసి సమాధానం తెలుసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి..
Puzzle: ఈ చిత్రంలో దాగి ఉన్న తప్పును 30 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..
Puzzle: మీ కంటి చూపుకో పరీక్ష.. ఈ రెండు చిత్రాల్లోని 3 తేడాలను కనుక్కోండి చూద్దాం..
Puzzle: ఈ చిత్రంలో దాగి ఉన్న అతి పెద్ద తప్పును పసిగట్టగలరేమో ప్రయత్నించండి..
మరిన్ని వైరల్ వార్తల కోసంఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Dec 05 , 2024 | 08:40 PM