మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Eye Challenge: ఇది నిజంగా మీ కంటికి పరీక్షే.. ఈ చిత్రంలో పిల్లి ఎక్కడుందో కనుక్కోవడానికి ట్రై చేయండి..

ABN, Publish Date - Apr 30 , 2024 | 04:39 PM

ఆప్టికల్ ఇల్యూషన్, పజిల్ ఫొటోల్లో కొన్ని మన కళ్లకు పెద్ద పరీక్ష పెడుతుంటాయి. ఇలాంటి పజిళ్లకు సమాధానాలు కనుక్కోవడం కొన్నిసార్లు చాలా కష్టంగా అనిపిస్తుంటుంది. అయితే కాస్త సమయం కేటాయించి, ఇలాంటి పజిళ్లకు సమాధానాలు కనుక్కోవడం వల్ల...

Eye Challenge: ఇది నిజంగా మీ కంటికి పరీక్షే.. ఈ చిత్రంలో పిల్లి ఎక్కడుందో కనుక్కోవడానికి ట్రై చేయండి..

ఆప్టికల్ ఇల్యూషన్, పజిల్ ఫొటోల్లో కొన్ని మన కళ్లకు పెద్ద పరీక్ష పెడుతుంటాయి. ఇలాంటి పజిళ్లకు సమాధానాలు కనుక్కోవడం కొన్నిసార్లు చాలా కష్టంగా అనిపిస్తుంటుంది. అయితే కాస్త సమయం కేటాయించి, ఇలాంటి పజిళ్లకు సమాధానాలు కనుక్కోవడం వల్ల మెడదకు పెద్ద రిలీఫ్‌లా అనిపిస్తుంటుంది. దీంతో పాటూ మనలో ఏకాగ్రత మరింత పెరుగుతుంది. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఇలాంటి ఫొటోలు అనేకం అందుబాటులో ఉన్నాయి. తాజాగా, మీ కోసం ఇలాంటి ఓ ఫొటోను తీసుకొచ్చాం.


సోషల్ మీడియాలో ఓ ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటో (Optical illusion viral photo) తెగ వైరల్ అవుతోంది. కొన్నిసార్లు మనం పైకి చూసేందంతా నిజం కాకపోవచ్చు. ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటోలు కూడా అలాంటి భావననే కలిగిస్తాయి. ప్రస్తుతం మీ ముందు ఉన్న చిత్రం కూడా ఇలాంటిదే. ఇందులో ఓ యువతి (young woman) బ్యాగు తగిలించుకుని సముద్రం ఒడ్డున నిలబడింది.

Optical illusion: ఇందులో కనించకుండా దాక్కున్న కుందేలును కనుక్కుంటే.. మీరు తిరుగులేనట్లే..


సముద్రం అందాలను వీక్షిస్తూ అలాగే నిలబడిపోయింది. ఆ యువతి పక్కనే చాలా రకాల చెట్లు,చిన్న చిన్న మొక్కలు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడే మీ కంటికి ఓ పెద్ద పరీక్ష పెడుతున్నాం. ఈ చిత్రంలో ఓ పిల్లి (cat) కూడా దాక్కుని ఉంది. అయితే పైకి చూస్తే అక్కడ యువతి, చెట్లు తప్ప ఇంకేమీ కనిపించవు. కానీ ఎవరికీ కనిపించకుండా ఓ పిల్లి దాక్కుని ఉంది.

Viral Video: వామ్మో..! ఐడియా మామూలుగా లేదుగా.. ఎండ తగలకుండా ఇంటిని ఏసీగా ఎలా మార్చాడో చూస్తే..


ఈ చిత్రాన్ని ఎంతో తీక్షణంగా పరిశీలిస్తే తప్ప ఆ పిల్లిని గుర్తించడం కష్టం. చాలా మంది పిల్లిని గుర్తించడంలో విఫలమవుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఆ పిల్లి ఎక్కడుందో కనిపెట్టేందుకు మీరూ ప్రయత్నించండి. ఒకవేళ మీకు ఇప్పటికీ పిల్లిని గుర్తించడం మీకు కష్టంగా అనిపిస్తుంటే.. ఈ కింద ఇచ్చిన చిత్రం చూసి సమాధానం తెలుసుకోవచ్చు.

Viral Video: 2050లో ఉన్నామా..! ఆశ్చర్యానికి గురి చేస్తున్న 19 సెకన్ల వీడియో.. స్మార్ట్‌ఫోన్ లోపల వేయగానే..

Updated Date - Apr 30 , 2024 | 04:42 PM

Advertising
Advertising