Optical illusion: ఈ చిత్రంలో దాక్కుని ఉన్న గరాటును 30 సెకన్లలో కనుక్కుంటే.. మీ చూపు బాగున్నట్లే..
ABN, Publish Date - Aug 01 , 2024 | 11:48 AM
ఆప్టికల్ ఇల్యూషన్, పజిల్ ఫొటోలు నిత్యం తెగ వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని పటిల్స్‌కు సమాధానాలు తెలుసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. అయితే ఇలాంటి వాటికి సమాధానాలు తెలుసుకునేందుకు ప్రయత్నించడం వల్ల కాలక్షేపంతో పాటూ..
ఆప్టికల్ ఇల్యూషన్, పజిల్ ఫొటోలు నిత్యం తెగ వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని పటిల్స్‌కు సమాధానాలు తెలుసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. అయితే ఇలాంటి వాటికి సమాధానాలు తెలుసుకునేందుకు ప్రయత్నించడం వల్ల కాలక్షేపంతో పాటూ మెదడుకు వ్యాయామం కూడా అందుతుంటుంది. దీంతో ఇలాంటి ఫొటోల పట్ల చాలా మంది నెటిజన్లు తెగ ఆసక్తిని కనబరుస్తుంటారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం మీకోసం ఇలాంటి ఓ ఫొటోను తీసుకొచ్చాం. ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో దాక్కుని ఉన్న గరాటును 30 సెకన్లలో కనుక్కోవడానికి ప్రయత్నించండి..
సోషల్ మీడియాలో ఓ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం (Optical illusion viral photo) ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో రెండు జంతువులు (Two animals) టేబుల్ వద్ద ఎదురెదుగా కూర్చుని కూల్‌డ్రింక్ తాగుతూ ఎంజాయ్ చేస్తుంటాయి. మధ్యలో వాటి మీద ఎండ పడకుండా పెద్ద గొడుగు కూడా ఉంటుంది.
Viral Video: పామును పేపర్లలో చుట్టేసి నిప్పు పెట్టిన వ్యక్తి.. చివరకు ఏం జరిగిందో చూడండి..
అలాగే టేబుల్‌పై ఓ పెద్ద గాజు మగ్ కూడా ఉంటుంది. అలాగే వాటికి ముందు వైపు చాలా వస్తువులు కూడా ఉంటాయి. ఇంతవరకూ బాగానే ఉన్నా ఇక్కడే అసలు ట్విస్ట్ దాగి ఉంది. ఈ చిత్రంలో ఓ గరాటు (hidden funnel) కూడా దాక్కుని ఉంది. అయితే దాని గుర్తించడం అంత సులభమేమీ కాదు. అలాగని అంత కష్టం కూడా కాదు. కాస్త నిశితంగా పరిశీలిస్తే మాత్రం ఆ గరాటును గుర్తించడం చాలా సులభం.
చాలా మంది ఆ గరాటును గుర్తించేందుకు వివిధ రకాలుగా ప్రయత్నిస్తున్నారు. అయితే కొందరు మాత్రమే దాన్ని గుర్తించగలుగుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఆ గరాటు ఎక్కడుందో మీరూ గుర్తించేందుకు ప్రయత్నించండి. ఒకవేళ ఎంత సేపు చూస్తున్నా కూడా ఆ గరాటును గుర్తించడం మీవల్ల కాకుంటే ఈ కింద ఇచ్చిన ఫొటో చూసి సమాధానం తెలుసుకోవచ్చు.
Viral Video: బంగ్లాదేశ్‌లో ఇలాక్కూడా జరుగుతుందా.. రైలిజంన్‌పై వీళ్లు చేస్తున్న నిర్వాకం చూడండి..
Updated Date - Aug 01 , 2024 | 12:45 PM