Optical illusion: ఇక్కడున్న ‘‘राज’’ మధ్యలో ‘‘काज’’ ఎక్కడుందో.. 20 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..
ABN, Publish Date - Sep 08 , 2024 | 08:01 PM
ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు మన కళ్లను మనమే నమ్మలేని విధంగా భ్రాంతిని కలిగిస్తుంటాయి. పైకి చూస్తున్న చిత్రం వేరు.. అందులో దాక్కుని ఉన్న అంతరార్థం వేరు. చూసేందుకు రెండు చిత్రాలు ఒకేలా ఉన్నా కూడా అందులో చాలా ఉంటాయి. అలాగే చిత్రంలో కనిపించే వస్తువుల మధ్యలో ఇంకో వస్తువు దాక్కుని ఉంటుంది. కానీ ..
ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు మన కళ్లను మనమే నమ్మలేని విధంగా భ్రాంతిని కలిగిస్తుంటాయి. పైకి చూస్తున్న చిత్రం వేరు.. అందులో దాక్కుని ఉన్న అంతరార్థం వేరు. చూసేందుకు రెండు చిత్రాలు ఒకేలా ఉన్నా కూడా అందులో చాలా ఉంటాయి. అలాగే చిత్రంలో కనిపించే వస్తువుల మధ్యలో ఇంకో వస్తువు దాక్కుని ఉంటుంది. కానీ దాన్ని కనుక్కోవడం కొన్నిసార్లు చాలా కష్టంగా ఉంటుంది. కానీ ఇలాంటి పజిల్స్‌కు సమాధానాలు తెలుసుకోవడం వల్ల కాలక్షేపంతో పాటూ మన మెదడుకు వ్యాయామం కూడా అందుతుంటుంది. ఇందుకోసం ప్రస్తుతం మీ ముందుకు ఓ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాన్ని తీసుకొచ్చాం. ఇక్కడ మీకు కనిపిస్తున్న ‘‘राज’’ పదాల మధ్యలో ‘‘काज’’ అనే పదం కూడా దాగి ఉంది. అదెక్కడుందో 20 సెకన్లలో కనుక్కుంటే మీరు జీనియస్ అని అర్థం.
సోషల్ మీడియాలో ఓ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం (optical illusion Viral image) తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ మీకు అనేక ‘‘राज’’ పదాలు కనిస్తున్నాయి. ఎన్ని సార్లు చూసినా ఆ రాజ్ అనే పదం తప్ప ఇంకో పదం కనిపించదు. పైకి కిందకు, కిందకు పైకి, అడ్డదిడ్డంగా.. ఇలా ఎటూ చూసినా రాజ్ అనే పదాలు మాత్రమే కనిపిస్తాయి. కానీ మీకు తెలీని విషయం ఏంటంటే.. ఇందులో మీకు కళ్లకు కనిపించకుండా ‘‘काज’’ అనే పదం కూడా దాగి ఉంది.
అయితే అది అంత సులభంగా అయితే కనపడదు. దీనికి కాస్త సమయం కేటాయించి.. అటూ ఇటూ పరుగెడుతున్న మీ ఆలోచలను అదుపు చేసుకుని, కేవలం ఈ చిత్రంపై మాత్రమే దృష్టి పెట్టాలి. అప్పుడు మాత్రమే ఆ కాజ్ అనే పదాన్ని గుర్తించేందుకు సాధ్యమవుతుంది. చాలా మంది ఆ పదాన్ని కనుక్కునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.
కానీ కొందరు మాత్రమే ఆ పదాన్ని గుర్తించగలుగుతన్నారు. ఇంకెందుకు ఆలస్యం ఆ కాజ్ అనే పదం ఎక్కడుందో కనిపెట్టి.. మీరు కూడా జీనియస్ అని నిరూపించుకోండి. ఒక వేళ ఇప్పటికీ ఆ పదాన్ని గుర్తించడం మీ వల్ల కాకుంటే మాత్రం.. ఈ కింద ఇచ్చిన చిత్రం చూసి సమాధానం తెలుసుకోవచ్చు.
Optical illusion: ఈ వంట గదిలోని ఎలుకను 20 సెకన్లలో గుర్తిస్తే.. మీకు తిరుగు లేనట్లే..
ఇవి కూడా చదవండి..
Puzzle: ఈ చిత్రంలో దాగి ఉన్న తప్పును 30 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..
Puzzle: మీ కంటి చూపుకో పరీక్ష.. ఈ రెండు చిత్రాల్లోని 3 తేడాలను కనుక్కోండి చూద్దాం..
Puzzle: ఈ చిత్రంలో దాగి ఉన్న అతి పెద్ద తప్పును పసిగట్టగలరేమో ప్రయత్నించండి..
మరిన్ని వైరల్ వార్తల కోసంఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Sep 08 , 2024 | 08:01 PM