ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Optical illusion: ఇక్కడ కనిపిస్తున్న ఫొటోలో ఓ తప్పు ఉంది.. దాన్ని కనిపెడితే మాత్రం మీరే జీనియస్..

ABN, Publish Date - Mar 20 , 2024 | 02:59 PM

సోషల్ మీడియాలో ఇటీవల ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. వాటిలో కొన్ని ఫొటోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంటాయి. కొన్ని ఫొటో ఫజిల్స్‌ను పరిష్కరించడం చాలా కష్టంగా ఉంటుంది. పైకి చూసేందుకు వాటిలో ఎలాంటి పొరపాట్లు లేకున్నా.. నిశితంగా పరిశీలిస్తే మాత్రం...

సోషల్ మీడియాలో ఇటీవల ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. వాటిలో కొన్ని ఫొటోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంటాయి. కొన్ని ఫొటో ఫజిల్స్‌ను పరిష్కరించడం చాలా కష్టంగా ఉంటుంది. పైకి చూసేందుకు వాటిలో ఎలాంటి పొరపాట్లు లేకున్నా.. నిశితంగా పరిశీలిస్తే మాత్రం చిన్న చిన్న తప్పులు బయటపడుతుంటాయి. అయితే వీటిని కనుక్కోవడం అంత సులభం కాదు. సమాధానం తెలిసిన తర్వాత.. అరే..! ఇంత ఈజీనా అని అనిపిస్తుుంటుంది. అలాంటి ఆసక్తికర ఫొటోను ప్రస్తుతం మీ ముందుకు తీసుకొచ్చాం. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఫొటోలో ఓ తప్పు ఉంది. దాన్ని గుర్తిస్తే మీరు జీనియస్ అని అర్థం.

సోషల్ మీడియాలో ఓ ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటో (Optical illusion photo) ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న పార్క్‌లో ముగ్గురు పిల్లలు బెలూన్లను ఎగరవేస్తూ ఆడుకుంటున్నారు. వారిలో ఓ బాలుడు రెండు చేతులతో రెండు బెలూన్లు ఎగురవేస్తుంటే.. మరో ఇద్దరూ ఒకే చేత్తో రెండు బెలూన్లను ఎగురవేస్తుంటారు. అలాగే వారి వెనుక పెద్ద పెద్ద చెట్లతో పాటూ ఆకాశంలో ఇంద్రధనస్సు (rainbow) కూడా కనిపిస్తుంటుంది.

Optical illusion: ఈ చెట్టులో దాక్కున్న తొండను గుర్తించడం మీ వల్ల అవుతుందా..?

ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఇక్కడే ఓ తప్పు దాగి ఉంది. దాన్ని గుర్తించడం అంత సులభమేమీ కాదు. కానీ కాస్త తీక్షణంగా గమనిస్తే మాత్రం ఆ తప్పును గుర్తించడం పెద్ద కష్టం కూడా కాదు. మీరు ఎంత త్వరగా ఆ తప్పును గుర్తిస్తే.. అంత జీనియస్‌లు అని అర్థం. ఇంకెందుకు ఆలస్యం ఆ తప్పు ఏంటే కనిపెట్టేందుకు ప్రయత్నించండి మరి. ఒక వేళ మీకు తప్పును పసిగట్టడం కష్టంగా ఉంటే మాత్రం.. ఈ కింద ఇచ్చిన ఫొటో చూసి సమాధానం తెలుసుకోవచ్చు.

ఈ ఫొటొలో ఉన్న ఇంద్రధనస్సులోనే ఆ తప్పు దాగి ఉంది. సాధారణంగా ఇంద్ర ధనస్సులో ఎరుపు, నారింజ, పసుపు, ఆకుపచ్చ, నీలం, నీలిమందు (ఆకాశ వర్ణం), ఊదా రంగులు ఉంటాయి. కానీ ఇక్కడ మీరు చూస్తున్న ఫొటోలో నీలి మందు రంగు పక్కన ఊదా(వైలెట్) రంగుకు బదులుగా నీలం రంగు కనిపిస్తుంది. ఈ తప్పును ఎవరు ముందుగా గుర్తించి ఉంటే.. వారికి ఎంత తీక్షణమైన దృష్టి ఉందని అర్థం చేసుకోవచ్చు.

Optical illusion: ఈ అడవిలో కలిసిపోయిన పక్షిని గుర్తిస్తే.. మీకు తిరుగు లేనట్లే..

Updated Date - Mar 20 , 2024 | 02:59 PM

Advertising
Advertising