Optical illusion: ఈ రెండు చిత్రాల్లో మొత్తం 3 తేడాలున్నాయి.. అవేంటో 30 సెకన్లలో కనుక్కుంటే మీరే తోపు..
ABN, Publish Date - Sep 04 , 2024 | 07:22 PM
సోషల్ మీడియాలో పజిల్ ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఓ డ్రాగన్ నిప్పులు కక్కుతూ ఉంటుంది. అలాగే పక్కనే ఉన్న ఇంకో చిత్రంలోనూ డ్రాగన్ నిప్పులు కక్కుతూ కనిపిస్తుంది. అయితే..
సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూషన్, పజిల్ చిత్రాలు తెగ వైరల్ అవుతుంటాయి. వీటిలో కొన్ని పజిల్ ఫొటోలు తెగ ఆసక్తిని కలిగిస్తుంటాయి. ఇలాంటి పజిల్స్‌ను పరిష్కరించడం వల్ల కాలక్షేపంతో పాటూ మానసికోళ్లాసం కూడా కలుగుతుంది. రెండు ఫొటోలు చూసేందుకు ఒకేలా ఉంటాయి. కానీ వాటిలో అనేక తేడాలు దాగి ఉంటాయి. ఇలాంటి పజిల్స్‌ను పరిష్కరించేందుకు నెటిజన్లు ప్రయత్నిస్తుంటారు. తాజాగా, మీ కోసం ఇలాంటి పజిల్ ఫొటోను మీ ముందుకు తీసుకొచ్చాం. ఇక్కడ కనిపిస్తున్న రెండు చిత్రాల్లో మొత్తం 3 తేడాలున్నాయి. అవేంటో కనుక్కునేందుకు ప్రయత్నించండి..
సోషల్ మీడియాలో పజిల్ ఫొటోలు (Optical illusion Viral photo) తెగ వైరల్ అవుతున్నాయి. ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఓ డ్రాగన్ నిప్పులు కక్కుతూ ఉంటుంది. అలాగే పక్కనే ఉన్న ఇంకో చిత్రంలోనూ డ్రాగన్ (Dragon) నిప్పులు కక్కుతూ కనిపిస్తుంది. అయితే ఈ రెండు చిత్రాలను చూస్తే ఒకేలా అనిపిస్తాయి. కానీ ఇక్కడ మీకు తెలీని విషయం ఏంటంటే.. ఈ రెండు చిత్రాల్లో (Three differences) మొత్తం 3 తేడాలు ఉన్నాయి.
Optical illusion: ఈ వంట గదిలోని ఎలుకను 20 సెకన్లలో గుర్తిస్తే.. మీకు తిరుగు లేనట్లే..
చూస్తే రెండు చిత్రాలు ఒకేలా ఉన్నాయి కదా.. ఇందులో తేడాలు ఎక్కడున్నాయి.. అనే సందేహం మీకు రావొచ్చు. కానీ కాస్త నిశితంగా పరిశీలిస్తే ఆ తేడాలు ఏంటో ఇట్టే తెలుసుకోవచ్చు. కంగారుగా కాకుండా మీ దృష్టిని ఈ ఫొటోలపై బాగా నిమగ్నం చేసి చూడాలి. అలాగే ఇందులో ఎక్కడడెక్కడ తేడాలున్నాయో పరిశీలించాలి. అందులోనూ చాలా చిన్న చిన్న గుర్తులను కూడా నిశితంగా పరిశీలించాలి. అప్పుడే ఆ తేడాలను గుర్తించడానికి సాధ్యమవుతుంది.
Optical illusion: ఇక్కడ కనిపిస్తున్న ‘Real’ మధ్యలో ‘Reel’ ఎక్కడుందో కనుక్కోండి చూద్దాం..
చాలా మంది ఆ తేడాలను కనుక్కునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే కొందరు మాత్రమే గుర్తించగలుగుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. ఆ తేడాలేంటో పసిగట్టేందుకు మీరూ ప్రయత్నించండి. ఎంత ప్రయత్నించినా తేడాలను కనుక్కోలేకపోతుంటే మాత్రం.. ఈ కింద ఇచ్చిన ఫొటోను చూసి సమాధానం తెలుసుకోండి.
ఇవి కూడా చదవండి..
Puzzle: ఈ చిత్రంలో దాగి ఉన్న తప్పును 30 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..
Puzzle: మీ కంటి చూపుకో పరీక్ష.. ఈ రెండు చిత్రాల్లోని 3 తేడాలను కనుక్కోండి చూద్దాం..
Puzzle: ఈ చిత్రంలో దాగి ఉన్న అతి పెద్ద తప్పును పసిగట్టగలరేమో ప్రయత్నించండి..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Sep 04 , 2024 | 07:22 PM