Viral: స్వీయ వివాహం చేసుకున్న ఇన్‌ఫ్లుయెన్సర్ ఆత్మహత్య!
ABN, Publish Date - Sep 29 , 2024 | 07:22 PM
తుర్కియేలో అపార ఫాలోయింగ్ ఉన్న సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ కుబ్రా ఐకుట్ ఆత్మహత్య చేసుకుంది. ఓ లగ్జరీ అపార్ట్‌మెంట్‌లో ఐదో అంతస్తులో ఉన్న తన ఫ్లాట్ నుంచి కిందపడి దుర్మరణం చెందింది.
ఇంటర్నెట్ డెస్క్: తుర్కియేలో అపార ఫాలోయింగ్ ఉన్న సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ కుబ్రా ఐకుట్ ఆత్మహత్య చేసుకుంది. ఓ లగ్జరీ అపార్ట్‌మెంట్‌లో ఐదో అంతస్తులో ఉన్న తన ఫ్లాట్ నుంచి కిందపడి దుర్మరణం చెందింది. 26 ఏళ్ల కుబ్రా ఐకుట్ గతేడాది స్వీయ వివాహం చేసుకుని సంచలనం సృష్టించింది. తనకు తగిన తోడు దొరకలేదని చెప్పుకొచ్చిన ఆమె వరుడు లేకుండా పెళ్లి సరీస్ పేరిట నెట్టింట పలు వీడియోలతో అపార పాప్యులారిటీ సాధించింది (Viral).
Viral: డబ్బున్నోళ్లంటే భారతీయులకు అందుకే ద్వేషం! ప్రముఖ సంస్థ సీఈఓ వ్యాఖ్య
2023లో జరిగిన ఈ స్వీయ వివాహం తుర్కియేలో పెను కలకలం రేపింది. ఒక్కసారిగా నెటిజన్లు దృష్టి ఆమెపై పడింది. తెల్లని పెళ్లి గౌనులో మెరిసిపోతూ ఫొటోలు పంచుకున్న ఆమె తాను స్వీయ వివాహం చేసుకున్నట్టు ప్రకటించింది. నాకు తగిన జోడీ దొరకలేదు.. అందుకే ఇలా.. అంటూ ఆమె పెట్టిన వరసు పోస్టులు తెగ వైరల్ అయ్యాయి. పెళ్లి తరువాత ఆమె చేతిలో పూల బొకే తీసుకుని కారెక్కి తనంతట తానుగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోయింది. ఇక పెళ్లి డ్రెస్‌లోనే ఓ విందులో ఎంజాయ్ చేస్తూ ఆమె మరో వీడియోను కూడా పంచుకుంది. కాస్తంత టెన్షన్ పడుతున్న కొత్త పెళ్లికూతురిగా ఆమె ఈ వీడియోల్లో తనని తాను అభివర్ణించుకుంది (Turkish Influencer Who Went Viral For Marrying Herself Dies By Suicide At 26 ).
ఏంటీ.. అంత సంపాదిస్తున్నా సరిపోట్లేదా! కెనడా ఎన్నారైపై జనాల విసుర్లు!
ఇలా తుర్కియేలో అపార ఫాలోయింగ్ సంపాదించుకున్న కుబ్రా ఆత్మహత్య చేసుకుందన్న వార్త ఆమె అభిమానులను తీరని సోకంలో ముంచేసింది. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు స్పష్టంగా తెలియలేదు. ‘‘శక్తినంతా కూడ దీసుకున్నా బరువు పెరగట్లేదు. ప్రతి రోజూ ఒక కిలోగ్రాము చొప్పున బరువు తగ్గిపోతున్నా. ఏం చేయాలో అర్థం కావట్లేదు. త్వరగా నేను బరువు పెరగాలి’’ అని ఆమె చివరగా సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టింది. ఇక ఘటనా స్థలంలో పోలీసులు ఆమె రాసిన సూసైడ్ నోట్ కూడా లభించినట్టు తెలుస్తోంది. పోలీసులు యువతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం పంపించారు. సూసైడ్ వెనక కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు.
లైఫ్ ఎలా ఎంజాయ్ చేయాలో ఈమెను చూసి నేర్చుకోవాలి! వీడియో వైరల్!
కాగా, గత కొన్ని రోజులుగా ఆమె సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టుల్లో చాలా మార్పు కనిపించేదని ఆమె అభిమానులు చెబుతున్నారు. ఆత్మహత్యకు గంట మునుపు కూడా ఆమె తన బరువు పెరిగే ప్రయత్నాలు గురించి రాసుకొచ్చింది. తన చివరి వీడియోలో ఆమె తన అపార్ట్‌మెంట్‌ను శుభ్రం చేస్తూ కూడా కనిపించింది. ఇక ఆమె ఆకస్మిక మరణం సోషల్ మీడియాను కుదిపేసింది. అనేక మంది సంతాపం వ్యక్తం చేశారు. మంచి మనసున్న దేవ కన్య అంటూ ఆమెను కీర్తించారు. ఇక కుబ్రా అత్యంత క్రియలను స్వగ్రామంలో ఏర్పాటు చేశారు. సాటి ఇన్‌ఫ్లుయెన్సర్లు కూడా ఇందులో పాల్గొననున్నారు.
ఆఫీసులో అలసిపోయి వచ్చిన భార్య కోసం వంట వండని భర్త! చివరకు..
వామ్మో! పెళ్లికొచ్చిన అతిథుల నుంచి వధూవరులు రూ.2 లక్షలు చొప్పున వసూల్!
Updated Date - Sep 29 , 2024 | 07:22 PM