Viral Video: ప్రాణాల మీద ఆశ లేదా? కదులుతున్న లారీ వెనకాల స్కేటింగ్.. షాకింగ్ వీడియో వైరల్!
ABN, Publish Date - Aug 13 , 2024 | 08:42 AM
యుక్త వయసులో ఉండే వారు సహసాలు చేస్తుంటారు. థ్రిల్లింగ్ అనుభవాలను చవిచూడాలని అనుకుంటారు. అందుకోసం ప్రాణాంతక సాహసాలు చేస్తుంటారు. సోషల్ మీడియా, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ వంటివి అందుబాటులోకి వచ్చాక ఈ ధోరణి మరింత పెరిగింది.
యుక్త వయసులో ఉండే వారు సహసాలు (Adventurous) చేస్తుంటారు. థ్రిల్లింగ్ అనుభవాలను చవిచూడాలని అనుకుంటారు. అందుకోసం ప్రాణాంతక సాహసాలు (Dangerous Stunts) చేస్తుంటారు. సోషల్ మీడియా, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ (Reels) వంటివి అందుబాటులోకి వచ్చాక ఈ ధోరణి మరింత పెరిగింది. వ్యూస్, లైక్స్, పాపులారిటీ కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి సాహసాలు చేస్తున్నారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే నివ్వెరపోవాల్సిందే. అత్యంత వేగంగా వెళుతున్న లారీ వెనకాల ఇద్దరు కుర్రాళ్లు రిస్కీ స్టంట్స్ చేశారు (Viral Video).
ఈ వీడియోను బంగ్లాదేశ్ (Bangladesh)లో చిత్రీకరించారు. ఢాకాలోని బిజోయ్ సరనీ మెట్రో స్టేషన్ సమీపంలో రద్దీగా ఉండే రహదారిపై ప్రమాదకర విన్యాసం చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఇద్దరు కుర్రాళ్లు స్కేటింగ్ షూస్ వేసుకుని, వేగంగా వెళుతున్న లారీని (Truck) పట్టుకున్నారు. రద్దీగా ఉన్న ఆ రహదారిపై ఆ లారీతో పాటు వేగంగా స్కేటింగ్ (Skating) చేశారు. ఆ తర్వాత ఓ కుర్రాడు లారీని వదిలేసి రోడ్డు మీదకు వచ్చి ఒంటి కాలితో స్కేటింగ్ చేశారు. వారి ట్యాలెంట్‌కు అందరూ ముగ్ధులయ్యారు. అలాగే అంత బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించినందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు.
@Nishantjournali అనే ట్విటర్ యూజర్ షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు 8 లక్షల కంటే ఎక్కువ మంది ఈ వీడియోను వీక్షించారు. దాదాపు 4 వేల మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``వీళ్లు ఎంత ప్రతిభావంతులు. అలాగే ఎంత మూర్ఖులు``, ``ఒక అబ్బాయి అద్భుతమైన బ్యాలెన్స్, ప్రతిభను ప్రదర్శించాడు. అతడి ట్యాలెంట్‌ను ఉపయోగించుకోవాలి``, ``వీరి ట్యాలెంట్‌కు సరైన వేదిక దొరకాలి``, ``అనుకోనిది జరిగితే ఇంత ట్యాలెంట్ వృథాగా పోతుంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral: ``బై.. బై.. సర్``.. ఉద్యోగి పంపించిన రాజీనామా లెటర్ చూసి ఖంగుతున్న బాస్.. అసలు కథేంటంటే..!
Viral Video: పాము, మూడు ముంగిసల మధ్య భీకర ఫైట్.. రన్ వేపై పోరాడుకున్న బద్ధ శత్రువులు..!
Picture Puzzle: మీ కళ్లకు పరీక్ష.. ఈ రెండు ఫొటోల్లోని మూడు తేడాలను 10 సెకెన్లలో కనిపెట్టండి!
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి
Updated Date - Aug 13 , 2024 | 08:43 AM