Viral: స్వస్తిక పేరున్న మహిళ అకౌంట్‌పై ఊబెర్ నిషేధం.. చివరకు క్షమాపణలు!
ABN, Publish Date - Apr 20 , 2024 | 09:28 PM
స్వస్తిక పేరున్న ఓ మహిళపై నిషేధం విధించిన ఊబెర్ చివరకు తన తప్పు తెలుసుకుని బాధితురాలికి క్షమాపణలు చెప్పింది.
ఇంటర్నెట్ డెస్క్: స్వస్తిక పేరున్న ఓ మహిళపై నిషేధం విధించిన ఊబెర్ చివరకు తన తప్పు తెలుసుకుని బాధితురాలికి క్షమాపణలు చెప్పింది. ఆస్ట్రేలియాలో (Australia) వెలుగు చూసిన ఈ ఘటన ప్రస్తుతం వైరల్‌గా (Viral) మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే, ఫిజీలో పుట్టిన స్వస్తిక చంద్ర ఆస్ట్రేలియాకు వెళ్లింది. అక్కడ గతేడాది అక్టోబర్‌లో ఆమె ఊబెర్ ఈట్స్‌లో (Uber Eats) స్వస్తిక ఫుడ్ ఆర్డరిచ్చేందుకు ట్రై చేసింది. స్వస్తిక పేరు జర్మనీ నియంత హిట్లర్‌తో (Hitler) ముడిపడి ఉండటంతో ఆ పేరుతో అకౌంట్ తన కంపెనీ నిబంధనలకు విరుద్ధమని ఊబెర్ పేర్కొంది. అంతేకాకుండా, పేరు మార్చాలని కూడా ఆమెకు చెప్పింది. ఆ తరువాత ఆమె అకౌంట్‌పై నిషేధం (Ban) విధించింది.
Viral: డాల్ఫిన్‌ను కాపాడిన మత్స్యకారులు.. నెట్టింట వీడియో వైరల్
అయితే, హిందూ మతంలో ముఖ్యభాగమైన స్వస్తిక పదాన్ని మార్చేదేలేన్న బాధితురాలు తన పోరాటం ప్రారంభించింది. ఆస్ట్రేలియాలోని హిందు సంస్థల సాయంతో ఊబెర్‌కు జరిగిన పొరాపాటు గురించి వివరించింది. వేల ఏళ్ల చరిత్ర కలిగిన హిందూ మతానికి చెందిన పదాన్ని హిట్లర్ 1920ల్లో తనకు అనుకూలంగా మార్చుకున్నాడని చెప్పింది. ఈ అంశంపై స్పష్టత రావడంతో ఊబెర్ తాజాగా ఆమె అకౌంట్‌ను పునరుద్ధరించింది. ‘‘హిట్లర్ ఆ పదాన్ని దుర్వినియోగ పరచకముందు వేల ఏళ్లుగా స్వస్తిక పేరును హిందువులు వాడుతున్నారన్న విషయం వాళ్లకు తెలియదు’’ అని స్వస్తిక చంద్ర చెప్పింది.
మరిన్న వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి
Updated Date - Apr 20 , 2024 | 09:41 PM