ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: మహిళకు భారీ షాక్! విమానప్రయాణాల రూల్స్ తెలీకపోతే ఇంతే..

ABN, Publish Date - Nov 09 , 2024 | 06:30 PM

క్యాబిన్ లగేజీ సైజు 2 సెంటీమీటర్లు ఎక్కువగా ఉండటంతో ఓ మహిళ ఏకంగా రూ.8000 వేలు అధిక చార్జీలు ఇచ్చుకోవాల్సి వచ్చింది. బ్రిటన్‌లో వెలుగు చూసిన ఈ ఉదంతం ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది.

ఇంటర్నెట్ డెస్క్: విమానప్రయాణాలు చేసేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. జర్నీకి సంబంధించిన నిబంధనలన్నీ క్షుణ్ణంగా తెలుసుకోవాలి. కొత్తగా విమానం ఎక్కేవారు అనుభవజ్ఞులను అడిగి అన్ని వివరాలను తెలుసుకోవాలి. విమానంలోకి తీసుకెళ్లే క్యాబిన్ లగేజీ బరువు, సైజు వంటి విషయాల్లో పూర్తిస్థాయి జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాలో చెప్పే ఉదంతం ఇటీవల బ్రిటన్‌లో వెలుగు చూసింది. క్యాబిన్ లగేజీ పరిమితులను అతిక్రమించినందుకు ఓ మహిళకు ఊహించని పరిస్థితి ఎదురైంది (Viral). పూర్తి వివరాల్లోకి వెళితే..

4B Movement: అమెరికాలో మరో ఉద్యమం! పురుషులతో శృంగారానికి నో అంటున్న మహిళలు


ఆక్స్‌ఫర్డ్‌కు చెందిన క్యాథరిన్ విల్లో అనే మహిళ స్పెయిన్‌కు వెళ్లేందుకు విమాన టిక్కెట్లు బుక్ చేసుకుంది. లగేజీతో పాటు విమానాశ్రయానికి వచ్చింది. అయితే, ఆమె లగేజీ సైజు ఎక్కువగా ఉందని గుర్తించి సిబ్బంది ఆమెను అడ్డుకున్నారు. క్యాబిన్ లగేజీ సైజు తగ్గకపోతే లోపలకు అనుమతించేది లేదన్నారు. దీంతో, ఆమె అందులోని కొన్ని వస్తువులను తీసి పారేసింది. అది ఎక్స్‌పాండబుల్ బ్యాగు కావడంతో దానికున్న తాళ్లు లాగి బ్యాగు సైజు తగ్గేలా చేసింది. ఇంత చేసినా కూడా బ్యాగు సైజు నిబంధనలకు మించి 2 సెంటీమీటర్లు అదనంగా ఉన్నట్టు తేలింది. దీంతో, దాన్ని అనుమతించబోమని సిబ్బంది కరాఖండీగా చెప్పేశారు. పరిమితి మించినందుకు రూ.8 వేలు చెల్లించాలని, లేకపోతే బ్యాగును విమానశ్రయంలోనే వదిలి ఫ్లైట్ ఎక్కాలని అన్నారు. చేసేదేమీ లేకపోవడంతో మహిళ.. సిబ్బంది చెప్పినట్టు అదనపు చార్జీలు చెల్లించి విమానం ఎక్కింది. తిరుగు ప్రయాణంలో కూడా ఆమెకు ఇదే అనుభవం ఎదురైంది. ఈసారి మరో మూడు వేలు అదనంగా చెల్లించుకుంది.

Viral: భర్తకు జాబ్ పోయిందని విడాకులిచ్చి.. 4 ఏళ్ల తరువాత ఊహించని విధంగా..


ఇంటికి చేరుకున్నాక క్యాథరిన్ ఈ విషయంపై విమానయాన సంస్థకు ఫిర్యాదు చేసింది. బ్యాగు సైజు కేవలం రెండు సెంటీమీటర్ల ఎక్కువగా ఉన్నందుకు ఈస్థాయిలో అదనపు చార్జీలు వసూలు చేయడం భావ్యం కాదని స్పష్టం చేసింది. తను చెల్లించిన అదనపు చార్జీలు వెనక్కు ఇచ్చేయాలని అభ్యర్థించింది. ఆమె విన్నపాన్ని మన్నించిన ఎయిర్‌లైన్స్ సంస్థ డబ్బును తిరిగిచ్చేసింది. అయితే, తమ సిబ్బంది చేసిన దాంట్లో తప్పేమీ లేదని స్పష్టం చేసింది. సుహృద్భావంతో ఈ డబ్బును తిరిగిస్తున్నామని, తదుపరి ప్రయాణాల్లో నిబంధనలు కచ్చితంగా పాటించాలని చెప్పింది.

Read Latest and Viral News

Updated Date - Nov 09 , 2024 | 06:38 PM