Viral News: రాత్రి కన్న ‘కలే’ ఆమె ప్రాణాలు కాపాడింది.. అసలు ఏమైందంటే?
ABN , Publish Date - Apr 30 , 2024 | 07:03 AM
రాత్రిళ్లలో పడుకున్నప్పుడు, మరీ ముఖ్యంగా తెల్లవారుజామున గాఢ నిద్రలో ఉన్నప్పుడు వచ్చే కలలు నిజం అవుతుంటాయని చాలామంది నమ్ముతుంటారు. ఇతరుల విషయంలో ఏమో గానీ, యునైటెడ్ కింగ్‌డమ్‌కి చెందిన ఓ మహిళకు మాత్రం తనకొచ్చిన కల నిజమైందని..
రాత్రిళ్లలో పడుకున్నప్పుడు, మరీ ముఖ్యంగా తెల్లవారుజామున గాఢ నిద్రలో ఉన్నప్పుడు వచ్చే కలలు (Dreams) నిజం అవుతుంటాయని చాలామంది నమ్ముతుంటారు. ఇతరుల విషయంలో ఏమో గానీ, యునైటెడ్ కింగ్‌డమ్‌కి (United Kingdom) చెందిన ఓ మహిళకు మాత్రం తనకొచ్చిన కల నిజమైందని చెప్తోంది. అంతేకాదు.. ఆ కలే తనని ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడేసి, తన ప్రాణాలు కాపాడిందని తెలుపుతోంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
మీ కళ్లను మీరే నమ్మలేరు.. చెట్టు నుంచి బయటకు వచ్చిన దెయ్యం కాలి వేళ్లు..
ఆ మహిళ పేరు షార్లెట్ వ్రో (Charlotte Wroe) (46). ఆమె ఒక బిజినెస్‌వుమన్. 2021లో తనకొచ్చిన ఓ భయంకరమైన కల గురించి షార్లెట్ వివరిస్తూ.. ‘‘నాకెప్పుడూ విచిత్రమైన కలలు వస్తుంటాయి. అవి అచ్చం సినిమాలు చూస్తున్నట్టుగా అనిపిస్తాయి. ఎప్పట్లాగే ఒక రోజు నేను గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఓ పీడకల వచ్చింది. ఆ కలలో నేను ఏదో ఒక ఆఫీస్‌లో కూర్చొని ఉన్నాను. నా రొమ్ము వద్ద ఏదో గడ్డ ఉందన్న భావన కలిగింది. అనంతరం నేను ఓ డాక్టర్ వద్ద ఉన్నట్టు, నాకు బ్రెస్ట్ క్యాన్సర్ ఉందని ఆ వైద్యుడు చెప్పినట్లు మాటలు వినిపించాయి. ఆ కల వచ్చిన వెంటనే నేను ఒక్కసారిగా లేచి కూర్చున్నాను. అప్పుడు సమయం తెల్లవారుజామున 4:00 అవుతోంది. టాయిలెట్ కోసం వెళ్లాక ఓసారి చెక్ చేసుకుందామనుకొని.. రొమ్ము వద్ద చెయ్యి పెట్టి చూశాను. కలలో కనిపించిన ప్రదేశంలోనే.. గడ్డ ఉన్నట్టు అనిపించింది’’ అని చెప్పింది.
వీడు కొడుకు కాదు.. ఆస్తి కోసం కన్న తండ్రిపై కిరాతక దాడి..
తనకు అనుమానం రావడంతో.. అదే రోజు తాను వైద్యుడ్ని సంప్రదించానని షార్లెట్ పేర్కొంది. స్కానింగ్స్, ఇతర పరీక్షలు నిర్వహించిన తర్వాత.. తనకు ట్రిపుల్ నెగెటివ్ కేన్సర్ ఉన్నట్టు నిర్ధారణ అయ్యిందని చెప్పింది. తన భర్త, పిల్లల సహకారంతో తాను కేన్సర్ చికిత్సను మొదలుపెట్టానని.. రెండు సంవత్సరాల పాటు మాస్టెక్టమీ, రేడియోథెరపీలతో పాటు కీమోథెరపీలు చేయించుకున్నానని వెల్లడించింది. చివరికి 2023 మార్చి నాటికి తనకు క్యాన్సర్ నయమైందని చెప్పుకొచ్చింది. ఆరోజు రాత్రి తనకొచ్చిన కలే తన ప్రాణాలను కాపాడిందని సంతోషం వ్యక్తం చేసింది. ఈ విశ్వంలో ఎవరో ఒకరు ఏదో ఒక రూపంలో సందేశం పంపేందుకు ప్రయత్నిస్తున్నారని.. తనకొచ్చిన కలే అందుకు ప్రత్యక్ష సాక్ష్యమని.. అందుకు తాను కృతజ్ఞురాలినని షార్లెట్ చెప్పుకొచ్చింది.
Read Latest Viral News and Telugu News