ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral: పెళ్లైన రోజునే మహిళకు షాకింగ్ అనుభవం! బాస్ పెట్టిన మెసేజ్ చూసి..

ABN, Publish Date - May 28 , 2024 | 05:44 PM

పెళ్లి రోజునే ఓ మహిళ ఉద్యోగం పోగొట్టుకుంది. ఆ రోజు యువతి వివాహం అని తెలిసీ బాస్ ఆమెను ఉద్యోగం నుంచి మెసేజ్ పెట్టాడు. బ్రిటన్ లో వెలుగు చూసిన ఈ ఘటన సంచలనంగా మారింది.

ఇంటర్నెట్ డెస్క్: ఉద్యోగం అన్నాక ప్రమోషన్లు, తొలగింపులు, జీతాల్లో పెంపులు, కోతలు కామన్. ప్రతి ఉద్యోగి ఇలాంటి విషయాల్ని జీవితంలో భాగంగా చూస్తారు. అయితే, తన పెళ్లి రోజు ఓ మహిళ బాస్ శాడిజానికి బలైపోయింది. ఆ షాక్ నుంచి కోలుకోలేక ఆమె చివరకు ఓ యూట్యూబ్ ఛానల్ లో తన ఆవేదన పంచుకుంది. బ్రిటన్ లో వెలుగు చూసిన ఈ ఘటన ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ గా (Viral) మారింది. యువతి పరిస్థితి చూసి జనాలు అయ్యో అని నిట్టూరుస్తున్నారు. కర్కశంగా వ్యవహరించిన బాస్ పై మండిపడుతున్నారు.

Viral: వామ్మో.. అపరకుబేరులు! వీళ్ల బాత్‌రూంలో ఏముందో చూస్తే..


ఇంతకీ జరిగిందేంటే.. ఓ మహిళ సరిగ్గా తన పెళ్లి రోజునే ఉద్యోగం కోల్పోయింది. బంధువుల, స్నేహితుల నడుము నచ్చిన వాడిని మనువాడిన ఆమెకు ఆనందం ఎక్కువ సేపు నిలవకుండా చేశాడా బాస్. వివాహం రోజునే ఆమెను ఉద్యోగం తొలగించినట్టు వాట్సాప్ మెసేజ్ పెట్టాడు. పూర్తి వివరాల కోసం ఈమెయిల్ చెక్ చేసుకోమ్మని అన్నాడు. పెళ్లి హడావుడిలో తీరిక లేకుండా గడిపి ఆమె వివాహం తరువాత బంధువుల సందడి మధ్య తనకు ఎవరో శుభాకాంక్షల సందేశాలు పంపించారో చెక్ చేసుకుంటుంటే బాస్ పంపిన సందేశం కనిపించింది. ఎంతో ఆనందంగా గడపాల్సిన రోజు బాస్ చేసిన పనికి ఆమె మనసంతా బాధతో నిండిపోయింది (UK Woman Shares She Got Fired On Wedding Day Via Text Message From Boss).


ఆ రోజు తన వివాహం అని తెలిసీ బాస్ ఉద్యోగం నుంచి తీసేస్తున్నట్టు మెసేజ్ పెట్టాడని మహిళ వాపోయింది. ఆ ఒక్క రోజు ఆగి మరుసటి తొలగించి ఉంటే తాను ఇంతలా బాధపడేదాన్ని కాదని చెప్పుకొచ్చింది. తన పనితీరు బాలేనందుకు తొలగిస్తున్నట్టు బాస్ ఈ మెయిల్ చూశాక తెలిసిందని చెప్పింది. ఎలాంటి హెచ్చరికలు లేకుండా ఒక్కసారిగా తొలగించారని బాధపడింది. కానీ, తన పని బాలేదన్న విషయం గతంలో బాస్ మాటమాత్రమైనా చెప్పలేదని వాపోయింది. కొద్ది రోజుల క్రితమే ఓ కొత్త ఉద్యోగి చేరాడని, ఆ వ్యక్తిని తన స్థానంలో నియమించుకున్నట్టు ఇప్పుడు అర్థమైందని వాపోయింది. ఇది తెలిసిన జనాలు షాకైపోతున్నారు. ఇంతకంటే శాడిస్ట్ బాస్ మరొకరు ఉండరంటూ మండిపడుతున్నారు.

Read Viral and Telugu News

Updated Date - May 28 , 2024 | 05:44 PM

Advertising
Advertising