ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral: అపరిచితుడితో ప్రేమ.. 8 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న అతడిని కలుసుకునేందుకు కోటి ఆశలతో వెళితే..

ABN, Publish Date - Mar 15 , 2024 | 03:50 PM

8 వేల కిలోమీటర్ల దూరంలోని బాయ్‌ఫ్రెండ్‌ కలుసుకునేందుకు వెళ్లాక ఊహించని విధంగా బ్రేకప్ చెప్పేసిన మహిళ

ఇంటర్నెట్ డెస్క్: విహారయాత్రలో ఉండగా ఓ అపరిచితుడు దగ్గరయ్యాడు. ఆ బంధం శాశ్వతమని భావించిన ఆమె అతడిని కలుసుకునేందుకు 8 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. కానీ, అక్కడి కెళ్లాక అతడి తీరు తెలిసి తమ బంధానికి ముగింపు చెప్పి స్వదేశానికి వచ్చేసింది. తన అనుభవాన్ని ఆమె నెట్టింట పంచుకోవడంతో ఇది వైరల్‌గా (Viral) మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

Viral: భార్య తనకు సొంత చెల్లెలు అవుతుందని పెళ్లైన 6 ఏళ్లకు తెలిసి..

బ్రిటన్‌కు (UK) చెందిన కేలీ కాసిల్ గతేడాది మెక్సికో (Mexico Tour) పర్యటనకు వెళ్లింది. అక్కడ ఆమెకు ఓ అమెరికన్ పరిచయమయ్యాడు. అతడిని అంతకు మునుపు ఎన్నడూ చూసుండకపోయినా మనసు పారేసుకుంది. ఆ తరువాత మళ్లీ స్వదేశానికి తిరిగొచ్చిన ఆమె ఇటీవల మళ్లీ అతడిని కాంటాక్ట్ అయ్యింది. మరోసారి కలుసుకుందామని ఇద్దరూ డిసైడయ్యారు. ఈ క్రమంలో అతడు ఆమెకు స్వయంగా విమానం టిక్కెట్లు బుక్ చేసి అమెరికాకు రప్పించుకున్నాడు. అతడు శాన్‌ఫ్రాన్‌సిస్కోలో (Sanfrancisco) ఉంటుండటంతో ఇద్దరూ కలిసి అక్కడున్న పర్యాటక స్థలాలన్నీ చుట్టొచ్చారు. ఆ పర్యటనల్లో ఊహించని విధంగా వారి బంధం బలహీన పడింది (UK Woman Travels 8000 Km To Meet Her Date than breaks up with him)

Viral: తప్పు చేసి భారీ మూల్యం చెల్లించిన బబూన్ కోతి! సింహం ఏ రేంజ్‌లో రివెంజ్ తీర్చుకుందో చూస్తే..


ఆమెతో విహారయాత్రలో ఉన్నా కూడా అతడు ఎప్పుడూ తన పనిమీదే ధ్యాసపెట్టేవాడు. సముద్ర తీరంలో నడుస్తూ ప్రకృతిని ఆస్వాదించాలని ఆమె ఆశపడితే అతడు మాత్రం కారులో కూర్చుని తన ఫోనులో తన ఆఫీసువారితో మాట్లాడుతూ ఉండిపోయేవాడు. ప్రకృతికంటే పనిమీదే అతడి దృష్టి అంతా ఉండటం ఆమెకు నచ్చలేదు. తనతో ఉన్నప్పుడు కూడా అతడి దృష్టి పనిపై మళ్లడం ఆమె గమనించింది. దీంతో, ఇద్దరి అభిరుచులు ప్రాధాన్యాలు వేర్వేరని భావించింది. చివరకు, అతడికి బ్రేకప్ చెప్పేసి మళ్లీ బ్రిటన్‌కు వచ్చేసింది. ఆ తరువాత జరిగినదంతా నెట్టింట పంచుకుంది. ఫ్రెండ్స్‌గా ఉందామని నిర్ణయించుకుని విడిపోయామని చెప్పింది. అనేక మంది ఆమె అభిప్రాయంతో ఏకీభవించారు. అభిరుచులు, ప్రాధాన్యాలు వేర్వేరుగా ఉన్న వ్యక్తులు కలిసి బతకడం కష్టమని చెప్పారు.

Viral: పెళ్లిలో వరుడి కంట కన్నీరు.. డాక్టర్ వధువుకు అతడిపై డౌటొచ్చి..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Mar 15 , 2024 | 03:56 PM

Advertising
Advertising