ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral: నేను పిల్లల్ని కనాలంటే.. కాబోయే వాడికి యువతి షరతులు చూసి జనాలు షాక్

ABN, Publish Date - Jun 07 , 2024 | 03:21 PM

పెళ్లి, పిల్లలు.. మహిళల జీవితంలో తీసుకునే అతి ముఖ్యమైన నిర్ణయాలు ఇవి. భవిష్యత్తును పూర్తిగా మార్చేసే అంశాలు ఇవి. ఈ విషయాల్లో బ్రిటన్‌కు చెందిన ఓ యువతి పెట్టిన కండీషన్లు నెటిజన్లను షాక్‌కు గురి చేస్తున్నాయి.

ఇంటర్నెట్ డెస్క్: పెళ్లి, పిల్లలు.. మహిళలు తమ జీవితాల్లో తీసుకునే అతి ముఖ్యమైన నిర్ణయాలు ఇవి. భవిష్యత్తును పూర్తిగా మార్చేసే అంశాలు ఇవి. ఈ విషయాల్లో బ్రిటన్ కు చెందిన ఓ యువతి పెట్టిన కండీషన్లు నెటిజన్లను షాక్‌కు గురి చేస్తున్నాయి. కొందరు ఆమెకు మద్దతుగా నిలిచినా అధికశాతం మంది మాత్రం ముక్కున వేలేసుకుంటున్నారు. విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ గా (Viral) మారింది.

లండన్‌కు చెందిన నోరా అనే యువతి టెక్ సేల్స్ రంగంలో పనిచేస్తోంది. ఆమె వయసు 26. తను పిల్లల్ని కనాలంటే భర్త ఏమేం అమర్చాలో చెబుతూ కోరికల చిట్టాను నెట్టింట పంచుకుంది. ముందుగా ఆమెకు కనీసం వెయ్యి డాలర్ల విలువైన బహుమతి కావాలట. అంతేకాదు, ఓ డిజైనర్ బ్యాగు, కరీదైన బూట్లను భర్త ఇవ్వాలని చెప్పుకొచ్చింది. బిడ్డని కన్నాక తనకు ప్రైవసీ కోసం ఓ ప్రత్యేక గది ఉన్న త్రిపుల్ బెడ్ రూం ఇల్లు సిద్ధంగా ఉండాలని కూడా చెప్పింది. ఈ ఇల్లు లండన్ లేదా నగరం చుట్టుపక్కల మాత్రమే ఉండాలని వివరించింది (UK Womans Bizarre Pregnancy Conditions Shock Internet ).

Viral: 2 ఏళ్ల బాలికను ఆహారంగా భావించిన జిరాఫ్.. చివరకు.. షాకింగ్ వీడియో


‘‘నేను జీవితంలో చాలా కష్టపడి నా కోసమని బోలెడన్నీ సౌకర్యాలు అమర్చుకున్నా. ప్రస్తుతం నేను డిమాండ్ చేస్తున్నవన్నీ నాకు నేను అమర్చుకోగలను. కాబట్టి, నాకు కాబోయే వాడి విషయంలో నేను ఎందుకు రాజీ పడాలి. బిడ్డను కన్నాక చాలా కాలం పాటు నేను ఉద్యోగం చేయను. బిడ్డకు కనీసం 4-5 ఏళ్లు వచ్చే వరకూ సంపాదనకు దూరంగా ఉంటాను. కాబట్టి, భర్తే నా ఖర్చులన్నీ భరించాలి’’ అని నోరా చెప్పుకొచ్చింది. అంతేకాదు, బిడ్డను కన్నాక తనకు మళ్లీ ఫిట్‌నెస్ లెవెల్స్ పెంచుకునేందుకు వ్యక్తిగత ట్రైనర్‌ను కూడా భర్త ఏర్పాటు చేయాలని ఆమె డిమాండ్ చేసింది.

ఈ పోస్టు చదివిన వాళ్లు భిన్నరకాల అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కొందరు మాత్రం ఆమె డిమాండ్లు సబబు గానే ఉన్నాయని అన్నారు. జీవితంలో ఓ స్థాయికి వచ్చిన మహిళ తన భర్త కూడా అదే స్థాయిలో ఉండాలని కోరుకోవడం తప్పులేదని భావించారు. కొందరు ఆమె తీరును విమర్శించారు. ఆమె చేసుకునే వాడికి చుక్కలేనంటూ కామెంట్స్ గుప్పించారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.

Read Viral and Telugu News

Updated Date - Jun 07 , 2024 | 03:39 PM

Advertising
Advertising