ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Shocking: ఉద్యోగం లేక రెండేళ్లుగా ఇంట్లోనే.. దీనికి గర్ల్‌ఫ్రెండ్ విమర్శలు తోడవడంతో..

ABN, Publish Date - Dec 14 , 2024 | 10:13 PM

నిరుద్యోగానికి తోడు గర్ల్‌ఫ్రెండ్ విమర్శలు కూడా తోడవడంతో ఓ యువ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకున్న ఉదంతం నోయిడాలో తాజాగా వెలుగుచూసింది. స్థానికంగా కలకలానికి దారి తీసింది

ఇంటర్నెట్ డెస్క్: నిరుద్యోగానికి తోడు గర్ల్‌ఫ్రెండ్ విమర్శలు కూడా తోడవడంతో ఓ యువ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకున్న ఉదంతం నోయిడాలో తాజాగా వెలుగుచూసింది. స్థానికంగా కలకలానికి దారి తీసింది (UP).

జాతీయ మీడియా కథనాల ప్రకారం, మయాంక్ ఛండేల్ అనే యువకుడు తన గర్ల్‌ఫ్రెండ్‌తో నాలుగేళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. అతడి స్వస్థలం యూపీలోని జాలాలాబాద్ కాగా యువతిది రాష్ట్రంలోని బందా ప్రాంతం. ఏడేళ్ల క్రితం వారి మధ్య ఉన్న స్నేహం ప్రేమగా మారి చివరకు వారు సహజీవనం మొదలుపెట్టారు. ఇద్దరూ కలిసే చదువుకున్నారు. నోయిడాలోని సెక్టర్ 73లోని శౌర్య బాంకెట్ హాల్‌కు సమీపంలో ఉంటున్నారు.

కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేయడం ఇష్టం లేక వేళ్లు నరికేసుకున్న వ్యక్తి!


యువతి ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తోంది. అయితే, చండేల్ మాత్రం కొంతకాలంగా జాబ్ లేక ఒత్తిడికి లోనవుతున్నాడు. ఈ క్రమంలో అతడు సూసైడ్ లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. తనకు ఉద్యోగం లేకపోవడంతో ఒత్తిడి పెరిగిపోయిందని సూసైడ్ నోట్‌లో రాసుకొచ్చాడు. పైపెచ్చు.. రోజంతా ఇంట్లోనే ఉండి తిండి తింటున్నావంటూ గర్ల్‌ఫ్రెండ్ సూటిపోటి మాటలు అంటున్నట్టు పరోక్షంగా ప్రస్తావించాడు. ఇవన్నీ తన ఒత్తిడిని మరింత పెంచాయని తెలిపాడు. చివరకు తాను ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమయ్యాయని తన మరణానికి ఎవరూ కారణం కాదని కూడా రాసుకొచ్చాడు.

Viral: ఏం క్రియేటివిటీ! ఇది ఆధార్ కార్డు అనుకుంటే పప్పులో కాలేసినట్టే..


కాగా, శుక్రవారం సాయంత్రం ఉద్యోగం నుంచి ఇంటికొచ్చిన యువతి బాయ్‌ఫ్రెండ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని వేళాడుతూ అచేతనంగా కనిపించడంతో షాకైపోయింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. మృతుడి కుటుంబసభ్యులకు కూడా సమాచారం అందించారు.

Viral: సోషల్ మీడియాలో జనాల సానుభూతితో డబ్బులు దండుకున్న వ్యక్తి జైలుపాలు

Viral: వామ్మో.. ఈ అడల్ట్ డైపర్స్ ధర రూ.6 వేలు! ఎందుకో తెలిస్తే..

Viral: వామ్మో! టెస్లా రూపొందించిన ఈ మనిషి లాంటి రోబోను చూశారా..

Read Latest and Viral News

Updated Date - Dec 14 , 2024 | 10:13 PM