Viral News: చనిపోయిన స్నేహితుడికి ఇష్టమని.. శ్మశాన వాటికలోకి సిగరెట్లను తీసుకెళ్లిన యువకులు.. చివరకు..
ABN, Publish Date - Mar 09 , 2024 | 03:57 PM
ప్రస్తుత టెక్నాలజీ యుగంలో మూఢనమ్మకాలతో ఎంతో మంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. మరికొందరు చివరకు నేరాలకు పాల్పడి జైలుపాలవడం చూస్తూ ఉన్నాం. అయినా ఇలాంటి ఘటనలు రోజూ ఎక్కడో చోట చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా..
ప్రస్తుత టెక్నాలజీ యుగంలో మూఢనమ్మకాలతో ఎంతో మంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. మరికొందరు చివరకు నేరాలకు పాల్పడి జైలుపాలవడం చూస్తూ ఉన్నాం. అయినా ఇలాంటి ఘటనలు రోజూ ఎక్కడో చోట చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా, మధ్యప్రదేశ్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. చనిపోయిన స్నేహితుడికి ఇష్టమని.. అతడి స్నేహితులు శ్మశాన వాటికలోకి సిగరెట్లను తీసుకెళ్లారు. అయితే తీరా అక్కడి దృశ్యం చూసి షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే..
మధ్యప్రదేశ్ (Madhya Pradesh) గుణ జిల్లా గోపాల్‌పురాలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన అశ్విన్ కేవత్ (29) అనే యువకుడు.. శివరాత్రి సందర్భంగా తన స్నేహితులతో కలిసి కేదార్‌నాథ ధామ్‌కి వెళ్లాడు. అయితే అక్కడ ఉన్నట్టుండి అతడు ఛాతీలో నొప్పితో కుప్పకూలిపోయాడు. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించాగా.. అతను గుండెపోటుతో (heart attack) మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. అనంతరం అతడి మృతదేహానికి గోపాల్‌పురాలోని శ్మశాన వాటికలో కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. రాత్రి అంతా ఇంటికి చేరుకున్నాక.. స్నేహితులుకు ఓ విషయం గుర్తుకువచ్చింది. చనిపోయిన తన స్నేహితుడు అశ్విన్‌కి సిగరెట్లు ఇష్టం ఉండడంతో.. కోరిక తీర్చాలనే ఉద్దేశంతో కొన్ని సిగరెట్లు తీసుకుని రాత్రి వేళ శ్మశానవాటికకు వెళ్లారు.
Viral Video: తన పవర్ ఏంటో చూపించిన జిరాఫీ.. సింహం నోటికి చిక్కిన మరో జిరాఫీని ఎలా కాపాడిందో చూస్తే..
అయితే అక్కడికి వెళ్లి చూడగా.. ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు తమ స్నేహితుడి చితి వద్ద పూజలు (Worship) చేస్తూ కనిపించారు. బూడిదను సీసాలో నింపి మంత్రాలు చదువుతూ కనిపించారు. వారిని విచారించగా.. వారి పేర్లు అవినాష్, దిలీప్, రాహుల్ అని తెలిసింది. అయితే పరిస్థితి విషమిస్తోందని గమనించిన రాహుల్ అనే వ్యక్తి అక్కడి నుంచి పారిపోయాడు. దీంతో మిగతా ఇద్దరినీ పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు విచారించగా.. మృతదేహానికి కర్మకాండలు చేశామని చెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వివిధ కోణాల్లో దర్యా్ప్తు చేస్తున్నారు. అయితే ఈ ఘటనపై మృతుడి కుటుంబ సభ్యులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయని, ఇకనైనా ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆందోళన చేశారు. కాగా, ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Updated Date - Mar 09 , 2024 | 03:57 PM