ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral: భార్యతో కలిసి విదేశీ టూర్‌.. ఇంటికొచ్చాక రూ.1.2 కోట్ల ఫోన్ బిల్లు చూసి షాక్!

ABN, Publish Date - Apr 19 , 2024 | 04:23 PM

విదేశీ టూర్‌పై వెళ్లిన ఓ జంట ఇంటికొచ్చాక రూ.1.2 కోట్ల ఫోన్ బిల్లు చూసి షాకైపోయింది. అంత బిల్లు కట్టేది లేదంటూ న్యాయపోరాటం ప్రారంభించి చివరకు విజయం సాధించింది.

ఇంటర్నెట్ డెస్క్: విదేశీ టూర్‌పై వెళ్లిన ఓ జంట ఇంటికొచ్చాక రూ.1.2 కోట్ల ఫోన్ బిల్లు చూసి షాకైపోయింది. అంత బిల్లు కట్టేది లేదంటూ న్యాయపోరాటం ప్రారంభించి చివరకు విజయం సాధించింది. అమెరికాలో (USA) వెలుగు చూసిన ఈ ఉదంతం పూర్తి వివరాల్లోకి వెళితే,

రెనే రెస్మండ్, ఆయన భార్య లిండా ఫ్లోరిడా రాష్ట్రంలో ఉంటారు. గతేడాది సెప్టెంబర్‌లో వారు తమ స్వస్థలమైన స్విట్జర్‌ల్యాండ్‌కు (Switzerland) వెళ్లారు. టూర్‌పై వేళ్లేముందే రెనే తన మొబైల్ సర్వీస్ ప్రొవైడర్ టి-మొబైల్‌కు విదేశీ టూర్ సమాచారం అందించారు. ఆ తరువాత తన భార్యతో కలిసి టూర్ ఎంజాయ్ చేసిన అతడు వివిధ లోకేషన్లలో ఫొటోలు దిగాడు. వాటన్నిటినీ మొబైల్‌లో ఫ్రెండ్స్‌కు, బంధువులకు షేర్ చేశాడు. అయితే టూర్ ముగించుకుని ఇంటికొచ్చాక ఆ జంటకు దిమ్మతిరిగినంత పనైంది (US Couple Returns From Switzerland Only To Receive Rs 1.2 Crore Phone Bill).

Viral: దేశం ఎప్పటికీ ఇంతే.. వీళ్లింక మారరు! ఇదిగో ప్రూఫ్!


టీ మొబైల్ పంపిన బిల్లలో రూ.1.2 కోట్లు (143,000 డాలర్లు) చెల్లించాలని ఉండటంతో రెనే షాకైపోయాడు. మొబైల్ డాటాతో ఫొటోలు, మెసేజీలు షేర్ చేసినందుకు 9.5 జీబీ డేటా ఖర్చైందని, ఆ మెరుకు బిల్లు రూ.1.2 కోట్లైందని తెలిసి అవాక్కయ్యాడు. తన విదేశీ టూర్ గురించి, ఇంటర్నేషనల్ రోమింగ్ (International Roaming) గురించి ముందే కంపెనీకి సమాచారం అందించానని, రోమింగ్ చార్జీల గురించి ఆందోళన అక్కర్లేదని సంస్థ సిబ్బంది చెప్పారని రెనే వాపోయాడు. ఈ ఉదంతంలో తన తప్పు ఏమీ లేదని బలంగా నమ్మిన రెనే చివరకు టీ-మొబైల్‌కు లాయర్ నోటీసులు పంపించాడు. దీనిపై చాలా రోజుల పాటు మౌనం పాటించిన సంస్థ చివరకు స్పందించింది. ఏదో పొరపాటు కారణంగా ఇలా జరిగిందన్న సంస్థ, రెనే చెల్లించాల్సి బిల్లు మేరకు క్రెడిట్స్ జారీ చేసి బిల్లు రద్దైనట్టు చేస్తామని ప్రకటించింది.

Viral: ఇలాంటి అన్నాన్ని ఎవరైనా తింటారా? రోత పుడుతోంది.. కొత్త అన్నం రెసీపీకి షేకైపోతున్న నెటిజన్లు

అయితే, విదేశీ టూర్లపై వెళ్లే వారు తాము ఇంటర్నేషనల్ రోమింగ్ ఫీచర్ యాక్టివేట్ చేసుకున్నదీ లేనిదీ ఒకసారి చెక్ చేసుకోవాలని టీ మొబైల్ స్పష్టం చేసింది. లేకపోతే విదేశాల్లో మొబైల్ డాటా వాడినందుకు భారీగా బిల్లు చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. రోమింగ్ ఫీచర్ లేని వాళ్లు విదేశీ టూర్లకు వెళ్లినప్పుడు మొబైల్‌ను ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో ఉంచాలని, లేదా వైఫై ద్వారా నెట్‌కు కనెక్ట్ అవ్వాలని సూచించింది.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Apr 19 , 2024 | 04:29 PM

Advertising
Advertising