ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: రోడ్డుపై దొరికిన కరెన్సీ నోటుతో లాటరీ టిక్కెట్ కొంటే..

ABN, Publish Date - Oct 28 , 2024 | 08:53 AM

లైఫ్‌లో అదృష్టం ఎప్పుడు, ఎలా కరుణిస్తుందో చెప్పడం కష్టం అనేందుకు తాజా ఉదాహరణగా ఓ ఉదంతం అమెరికాలో వెలుగు చూసింది. రోడ్డుపై దొరికిన కరెన్సీ నోటుతో లాటరీ టిక్కెట్ కొన్న ఓ వ్యక్తి రాత్రికి రాత్రి కోటీశ్వరుడైపోయాడు.

ఇంటర్నెట్ డెస్క్: లైఫ్‌లో అదృష్టం ఎప్పుడు, ఎలా కరుణిస్తుందో చెప్పడం కష్టం అనేందుకు తాజా ఉదాహరణగా ఓ ఉదంతం అమెరికాలో వెలుగు చూసింది. రోడ్డుపై దొరికిన కరెన్సీ నోటుతో లాటరీ టిక్కెట్ కొన్న ఓ వ్యక్తి రాత్రికి రాత్రి కోటీశ్వరుడైపోయారు. రెక్కల కష్టంతో జీవితమంతా నెట్టుకొచ్చిన ఆయన తనకు కావాల్సినంత డబ్బు సమకూరడంతో సంతోషంగా రిటైర్ అయిపోయారు. ఉత్తరకెరొలీనా రాష్ట్రంలో అక్టోబర్ 22న ఈ ఘటన జరిగింది (Viral.

Viral: వామ్మో.. ఇలాగైతే సోఫాలో కూర్చోవడానికీ భయపడాల్సిందే!


పూర్తి వివరాల్లోకి వెళితే, జెర్రీ హిక్స్ అనే వ్యక్తి కార్పెంటర్. గత 56 ఏళ్లుగా ఆయన అదే వృత్తిలో కొనసాగుతున్నారు. ఇటీవల బూన్ ప్రాంతంలోని ఓ పార్కింగ్ స్థలంలో ఆయనకు నేలపై ఓ 20 డాలర్ల కరెన్సీ నోటు కనిపించింది. ఆ నోటును తీసుకున్న హిక్స్ పక్కనే ఉన్న ఓ షాపులో ఎక్స్‌ట్రీ‌మ్‌ క్యాష్ లాటరీ టిక్కెట్ కొనుగోలు చేశారు. అదే ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. ఆ తరువాత కొన్ని రోజులకు తీసి లక్కీ డ్రాలో ఆయన ఏకంగా 1 మిలియన్ డాలర్ల బంపర్ లాటరీ గెలుచుకున్నారు.

Viral: బాబోయ్.. బాణసంచా దుకాణం పెట్టుకున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్!

‘‘వాస్తవానికి నేను కొనుగోలు చేయాలనుకున్న టిక్కెట్ వారి వద్ద లేదు. దీంతో, అక్కడున్న ఎక్స్‌ట్రీమ్ క్యాష్ టిక్కెట్‌ను కొనుక్కోవాల్సి వచ్చింది. అదే నా జీవితాన్ని మార్చేసింది’’ అంటూ హిక్స్ సంబరపడిపోతూ చెప్పారు.

లాటరీ నిబంధనల ప్రకారం, మిలియన్ డాలర్లను లబ్ధిదారులు ఏటా 50 వేల డాలర్ల చొప్పున 20 ఏళ్ల పాటు పొందొచ్చు. లేదా, ఒకేసారి 6 లక్షల డాలర్లు తీసుకోవచ్చు. హిక్స్ రెండో ఆప్షన్ ఎంచుకోవడంతో ఆయనకు.. కేంద్ర, రాష్ట్ర పన్నులు పోను చేతికి 429,007 డాలర్లు అందాయి.


Viral: ఇలాంటోళ్ల వల్లే సోషల్ మీడియాలో భారత్ ఇమేజ్ పెరిగేది.. వైరల్ వీడియో!

తన జీవితంలో అంత పెద్ద మొత్తం ఎప్పుడూ చూడకపోవడంతో హిక్స్ ఉబ్బితబ్బిబ్బైపోయారు. ఈ డబ్బులోని కొంత మొత్తంతో తన పిల్లల్ని సెటిల్ చేస్తానని, ఇక రిటైర్ అవుతానని చెప్పుకొచ్చాడు. ఇంత భారీ లాటరీ గెలిచాక మీరు మొదట చేయాలనుకున్న పనేంటి అని మీడియా ప్రశ్నించగా కడుపు నిండా తినడమే అని ఆయన చెప్పుకొచ్చారు. సమీపంలోనే ఉన్న తన ఫేవరెట్ రెస్టారెంట్‌కు వెళ్లి అక్కడ ఉన్న వంటకాలన్నీ మనస్ఫూ్ర్తిగా తింటానని అన్నారు.

Viral: బాస్ తిట్టడంతో షాక్! చలనం లేకుండా బొమ్మలా మారిపోయిన యువతి!

Read Latest and Travel News

Updated Date - Oct 28 , 2024 | 08:55 AM