ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: ఈసారి లాటరీ గెలుస్తానని జోక్ చేశాడు! చివరకు ఏం జరిగిందో మీరే చూడండి!

ABN, Publish Date - Oct 25 , 2024 | 08:18 PM

లాటరీ గెలుస్తానని జోక్ చేసిన వ్యక్తిని నిజంగానే అదృష్టం కరుణించింది. అతడు ఏకంగా రూ.12 కోట్లు గెలుచుకునేలా చేసింది. అమెరికాలో వెలుగు చూసిన ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

ఇంటర్నెట్ డెస్క్: లాటరీ గెలుస్తానని జోక్ చేసిన వ్యక్తిని నిజంగానే అదృష్టం కరుణించింది. అతడు ఏకంగా రూ.12 కోట్లు గెలుచుకునేలా చేసింది. అమెరికాలో వెలుగు చూసిన ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా (Viral) మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

Viral: ఇంతకు తెగించారేంట్రా దేవుడా! ఈ యువతులు చేసిన దారుణం చూస్తే..

వర్జీనియాలోని రోవానోక్ నగరానికి చెందిన జార్జ్ హర్ట్‌కు తాను ఏనాటికైనా లాటరీ గెలుస్తానని ఓ గట్టి నమ్మకం. ఇదే నమ్మకంతో అతడు గత 13 ఏళ్లుగా లాటరీ టిక్కెట్లు కొంటున్నాడు. ఇటీవల ఓ సారి స్నేహితులతో లాటరీ దక్కించుకుంటానని కూడా సరదాగా వ్యాఖ్యానించారు. కానీ, అదృష్టం కరుణించడంతో ఆ మాటలే నిజమై అతడు రాత్రికి రాత్రి కోటీశ్వరుడైపోయాడు. క్లోవర్ డేల్‌ రోడ్ పక్కనున్న ఓ షాపులో జార్జ్ లాటరీ టిక్కెట్టు కొన్నాడు. ఆ షాపు ఓనర్ పేరు తిమిర్ పటేల్.


Viral: ఇక్కడకొచ్చి తప్పు చేశానేమో! న్యూజిలాండ్‌లో భారతీయ యువకుడి ఆవేదన

అయితే, టిక్కెట్టు కొన్నాక జార్జి తాను లాటరీ గెలవడం పక్కా అంటూ స్నేహితులతో సరదాగా వ్యాఖ్యానించారు. చివరకు అదే నిజమైంది. ఇటీవల నిర్వహించిన వర్జీనియా లాటరీలో అతడు ఏకంగా బంపర్ ప్రైజ్ దక్కించుకున్నాడు. ఏకంగా 1 మిలియన్ డాలర్లు గెలుచుకున్నాడు. అయితే, ఈ మొత్తాన్ని విడతల వారీగా కాకుండా ఏక మొత్తంగా తీసుకుంటానని అతడు చెప్పడంతో నిబంధనల మేరకు కంపెనీ వారు 5.71 లక్షల డాలర్లను చెల్లించారు. అయితే, ఈ డబ్బుతో తాను ఏం చేసేదీ జార్జ్ చెప్పలేదు.


మరోవైపు, జార్జ్ లాటరీ గెలవడంపై తిమిర్ కూడా హర్షం వ్యక్తం చేశాడు. తన షాపులోనే జార్జ్ టిక్కెట్టు కొన్నాడు కాబట్టి కమిషన్ కింద తనకు 10 వేల డాలర్లు వస్తుందని చెప్పాడు. తమది చిన్న షాపు కాబట్టి ఈ మొత్తం ఎంతో విలువైనదని అతడు చెప్పుకొచ్చాడు. ఈ మొత్తంలో కొంత వెచ్చించి అప్పులు తీర్చి మిగతాది షాపు అభివృద్ధికి వినియోగిస్తానని తిమిర్ చెప్పుకొచ్చాడు.

Iphone 16 ban: ఇండోనేషియాలో ఐఫోన్ 16పై నిషేధం! పర్యాటకుల్లో టెన్షన్!

కాగా ఈ ఉదంతంపై లాటరీ నిర్వాహకులు కూడా స్పందించారు. లాటరీ విజేతతో పాటు టిక్కెట్ అమ్మిన షాపు వాళ్లకూ తాము కమిషన్ ఇస్తామని తెలిపారు. ఇలా ఇచ్చే మొత్తం అంతిమంగా స్థానికంగానే వినియోగం అవుతుందని, ఫలితంగా అక్కడి వారికి పని దొరుకుతుందని చెప్పారు. అమెరికాలో తరచూ ఏదోక రాష్ట్రంలో అదృష్టవంతులు లాటరీలు గెలుచుకుంటూ రాత్రికి రాత్రి కొటీశ్వరులైపోతుంటారు.

Read Latest and Viral News

Updated Date - Oct 25 , 2024 | 08:30 PM