ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: బ్రిడ్జి పైనుంచి దూకి ఆత్మహత్యాయత్నం! కారుపై పడటంతో ప్యాసెంజర్ మృతి

ABN, Publish Date - Sep 02 , 2024 | 12:30 PM

అమెరికాలో తాజాగా అసాధారణ ఘటన వెలుగు చూసింది. ఆత్మహత్య చేసుకునేందుకు బ్రిడ్జిపై నుంచి దూకిన వ్యక్తి కింద వెళుతున్న కారుపై పడటంతో లోపలున్న వృద్ధురాలు తీవ్ర గాయాల పాలయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తాజాగా మృతి చెందారు.

ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో (USA) తాజాగా అసాధారణ ఘటన వెలుగు చూసింది. ఆత్మహత్య చేసుకునేందుకు బ్రిడ్జిపై నుంచి దూకిన వ్యక్తి కింద వెళుతున్న కారుపై పడటంతో లోపలున్న వృద్ధురాలు తీవ్ర గాయాల పాలయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తాజాగా మృతి చెందారు. కాలిఫోర్నియాలో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా సంచలనం రేకెత్తించింది.

Viral: డ్యూటీ దిగిపోయినా బాధ్యత మర్చిపోలేదు! ఈ పోలీసుకు సలామ్ చెప్పాల్సిందే!

స్థానిక మీడియా కథనాల ప్రకారం, ఆగస్టు 9న సిల్మార్ ప్రాంతంలోని 210 ఫ్రీవేపై ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో మార్గరీటా నొవేలా గలిండో తన భర్తతో కలిసి కారులో టూర్ వెళుతుంది. భర్త డ్రైవ్ చేస్తుండగా ఆమె పక్క సీటులో కూర్చుకుంది. ఇంతలో ఓ వ్యక్తి బ్రిడ్జిపై నుంచి దూకేశాడు. అతడు నేరుగా మార్గరీటా కూర్చున్న వైపు కారు విండ్ షీల్డ్‌పై పడటంతో ఆమె తీవ్ర గాయాల పాలైంది. భర్త కూడా గాయాలపాలయ్యారు. బాధితురాలిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా ఆగస్టు 28న ఆమె మృతి చెందారు. ఆమె భర్త ప్రాణాలతో బయటపడ్డారు.


మార్గరీటా మృతితో ఆమె కుటుంబం శోకసంద్రంలో కూరుకుపోయింది. ‘‘ఇది నిజంగా అన్యాయం. ఎవరో తనకు జీవితం వద్దనుకుంటే మా అమ్మ మరణించడం ఏంటో అర్థం కావట్లేదు’’ అని ఆమె కుమారుడు కన్నీరుమున్నీరయ్యాడు. ఆమె ఆసుపత్రి ఖర్చులు, అంత్యక్రియల ఖర్చుల కోసం ఆన్‌లైన్‌లో విరాళాలు సేకరణకు గోఫండ్ మీ పేజ్ ప్రారంభించిన ఆయన తన గోడును వెళ్లబోసుకున్నారు. ‘‘నా తల్లిదండ్రులు కాస్త ఆలస్యంగా బయలుదేరి ఉన్నా, లేదా మరో రూట్‌లో ప్రయాణించి ఉన్నా ఈ దారుణం జరిగి ఉండేది కాదేమో. నా తండ్రి తన జీవిత సర్వస్వాన్నీ కోల్పోయారు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.


అయితే, తన భార్య మరణానికి కారణమైన వ్యక్తిపై తనకు ఎలాంటి కోపం, ద్వేషం లేవని మార్గరీటా భర్త మీడియాకు తెలిపారు. ‘‘ఆ వ్యక్తికి ఏ సమస్యలు ఉన్నాయో.. ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడో మనకు తెలియదు’’ అని తన తండ్రి అన్నట్టు మార్గరీటా కుమార్తె చెప్పుకొచ్చింది.

Read Latest and Viral News

Updated Date - Sep 02 , 2024 | 01:03 PM

Advertising
Advertising