ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: ‘నాన్నా! నాకు యాక్సిడెంట్ అయ్యింది’ అంటూ ఫోన్! తండ్రికి డౌట్ రావడంతో..

ABN, Publish Date - Oct 04 , 2024 | 02:03 PM

ఏఐ దుర్వినియెగంతో కలిగే ప్రమాదాల గురించి యావత్ ప్రపంచం ఆందోళన చెందుతోంది. ఈ నేపథ్యంలో వెలుగులోకి వచ్చిన ఓ ఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఏఐ సాంకేతికతతో తన తండ్రిని ఎలా మోసగించేందుకు నిందితులు ప్రయత్నించారో అమెరికా యువ రాజకీయ నాయకుడు ఒకరు నెట్టింట పంచుకున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: ఏఐ దుర్వినియెగంతో కలిగే ప్రమాదాల గురించి యావత్ ప్రపంచం ఆందోళన చెందుతోంది. మరోవైపు, నానాటికీ మెరుగవుతున్న ఏఐ సాంకేతికత తనకు సాధ్యం కానిది ఏదీ లేదన్నట్టు విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో వెలుగులోకి వచ్చిన ఓ ఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఏఐ సాంకేతికతతో తన తండ్రిని ఎలా మోసగించేందుకు నిందితులు ప్రయత్నించారో అమెరికా యువ రాజకీయ నాయకుడు ఒకరు నెట్టింట పంచుకున్నారు (Viral). పూర్తి వివరాల్లోకి వెళితే..

Viral: 130 ఏళ్ల నాటి కెమెరాతో ఫొటో తీశాడు.. ఎలా ఉందో మీరే చూడండి!


ఫ్లోరిడాకు చెందిన జే షూస్టర్ రాజకీయాల్లో ఉన్నారు. కొంత కాలం క్రితమే రాజకీయ ప్రయాణం ప్రారంభించిన అతడు స్థానిక ఎన్నికల్లో కూడా పోటీ పడ్డాడు. ఆ సందర్భంగా టీవీలో కొద్ది సేపు ప్రసంగించాడు. వాస్తవానికి అతడి ప్రసంగానికి సంబంధించి కేవలం 15 సెకెన్ల క్లిప్ మాత్రమే ప్రసారమైంది. దీని సాయంతోనే ‘ఏఐ’ నేరగాళ్లు రెచ్చిపోయారు. షూస్టర్ తండ్రిని బురిడీ కొట్టించి ఏకంగా 30 వేల డాలర్ల తస్కరించే ప్రయత్నం చేశారు (US Man Shares Chilling Tale Of How His Parents Almost Paid 30000).

Viral: మీ తెలివికో పరీక్ష! ఈ 2 బొమ్మల్లో 3 తేడాలను 10 సెకెన్లలో కనిపెట్టగలరా?

షూస్టర్ తెలిపిన వివరాల ప్రకారం, ఇటీవల ఓ రోజు ఓ వ్యక్తి తన తండ్రికి ఫోన్ చేశాడు. ఏఐ సాయంతో తన గొంతును అనుకరిస్తూ ఫోన్ చేశాడు. ‘‘నాన్నా.. నాకు యాక్సింట్ అయ్యింది. మద్యం మత్తులో ఉన్నా. పోలీసులు అరెస్టు చేశారు. బెయిల్ కోసం ముందు 30 వేల డాలర్లు పంపించండి’’ అంటూ నిందితుడు షూస్టర్ గొంతును అనుకరించాడు. అవి ఏ తండ్రి కలలో కూడా వినాలనుకోని మాటలు. షూస్టర్ తండ్రికి కాళ్ల కింద భూమి కంపిస్తున్నట్టు అనిపించింది. అది అచ్చు తన కొడుకు గొంతులాగే ఉంది. కానీ, గొంతులోని స్వల్ప తేడాను గుర్తు పట్టిన ఆయన నిందితుల పాల పడకుండా తప్పించుకోగలిగారు.


Viral: అంతరిక్షం నుంచి దూకి.. గంటకు 1,357 కిలోమీటర్ల వేగంతో కిందకొస్తూ..

ఈ ఉదంతాన్ని నెట్టింట పంచుకున్న షూస్టర్ ఏఐ దుర్వినియోగంతో వచ్చే సమస్యల గురించి ప్రజలను అప్రమత్తం చేశాడు. కేవలం పదిహేను సెకెన్ల వీడియో ఆధారంగా దొంగలు తన గొంతును పోలిన వాయిస్‌ను సృష్టంచగలిగారని అన్నారు. ఫోన్‌లోని వ్యక్తి తన సంతానమో కాదో చెప్పలేని స్థితి తల్లిదండ్రులెవరికీ రాకూడదు. ఇలాంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి, ఏఐ విషయంలో ప్రభుత్వాలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇక ఈ ఉదంతం జనాలను కూడా భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఏఐ నియంత్రణకు దేశాలన్ని కలిసికట్టుగా కార్యరంగంలోకి దిగాలని పలువురు డిమాండ్ చేశారు.

Read Latest and Viral News

Updated Date - Oct 04 , 2024 | 02:12 PM