ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: ప్రముఖ యూనివర్సిటీలో లెక్చరర్.. ఉండటానికి ఇల్లు కూడా లేదంటూ వీడియో!

ABN, Publish Date - Oct 27 , 2024 | 06:17 PM

అమెరికాలోని ప్రముఖ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో ఆస్ట్రోఫిజిక్స్ ప్రొఫెసర్ డా. డేనియల్ మెక్‌కియోన్ ఇటీవల నెట్టింట షేర్ చేసిన వీడియో సంచలనంగా మారింది. తన శాలరీ తక్కువ కావడంతో ఉండటానికి ఇల్లు కూడా లేని దయనీయ స్థితిలో కూరుకుపోయానంటూ ఆయన షేర్ చేసిన వీడియో పెను కలకలానికి దారి తీసింది.

ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలోని ప్రముఖ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో ఆస్ట్రోఫిజిక్స్ ప్రొఫెసర్ డా. డేనియల్ మెక్‌కియోన్ ఇటీవల నెట్టింట షేర్ చేసిన వీడియో సంచలనంగా మారింది. తన శాలరీ తక్కువ కావడంతో ఉండటానికి ఇల్లు కూడా లేని దయనీయ స్థితిలో కూరుకుపోయానంటూ ఆయన షేర్ చేసిన వీడియో పెను కలకలానికి దారి తీసింది (Viral).

Viral: ప్రపంచంలో తొలిసారిగా ‘డిజిటల్ కండోమ్‌’ను రూపొందించిన జర్మన్ కంపెనీ!


స్థానిక మీడియా కథనాల ప్రకారం, ఏటా తన కొచ్చే 70 వేల డాలర్ల జీతం లాస్ ఏంజిలిస్‌లో జీవనవ్యయానికి ఏమాత్రం సరిపోవట్లేదని డా.డేనియల్ మెక్‌కియోన్ వీడియోలో పేర్కొన్నారు. ‘‘హాయ్.. నా పేరు డేనియల్, నేను యూసీఎల్‌ఏలో ఆస్ట్రోఫిజిక్స్ ప్రొఫెసర్‌గా ఉన్నాను. ఈ ఏడాదికి నాకు యూనివర్సిటీ వారు కేవలం 70 వేల డాలర్లు మాత్రమే ఇచ్చేందుకు అంగీకరించారు. ఇది ఖర్చులకు అస్సలు సిరపోవట్లేదు. నా కంటూ ఉండేందుకు ఇల్లు లేదు. అద్దెకు కూడా ఏదీ తీసుకోలేకపోయాను. ఒకరకంగా నేను కొంపాగూడు లేని వాణ్ణి’’ అని వీడియోలో చెప్పుకొచ్చారు.

డేనియల్ 2023 సెప్టెంబర్ నుంచి అక్కడ పనిచేస్తున్నారు. తప్పని సరి పరిస్థితుల్లో తన ఆర్థిక విషయాలు, కష్టాలు పంచుకుంటున్నానని అన్నారు. ఇటీవలే తాను వెస్ట్‌వుడ్‌లోని సింగిల్ బెడ్‌‌రూం ఫ్లాట్‌ను ఖాళీ చేసి, ముఖ్యమైన వస్తువులను పబ్లిక్ లాకర్లో పెట్టుకున్నానని చెప్పారు.

Viral: బాస్ తిట్టడంతో షాక్! చలనం లేకుండా బొమ్మలా మారిపోయిన యువతి!


యూనివర్సిటీ తీరు కారణంగా తన కష్టాలు ఎక్కువయ్యాయని ఆరోపించారు. తన ఆర్థిక వివరాలు బహిర్గతం చేసినందుకు యూనివర్సిటీ వారు ఆగ్రహం వ్యక్తం చేశారని, రిమోట్ వర్క్ దరఖాస్తును కూడా తిరస్కరించారని తెలిపారు. వాస్తవానికి తాను అక్టోబర్ 21 నుంచి క్లాసులకు హాజరు రావాల్సి ఉన్నా ఇల్లు లేని కారణంగా పని మొదలెట్టలేకపోతున్నానని అన్నారు. తాజాగా యూనివర్సిటీ వారు తనకు నిరవధిక లీవ్‌కు ఇచ్చారని, ఈ సెమిస్టర్‌లో బోధించాల్సిన క్లాసులను తన అనుమతి లేకుండానే రద్దు చేశారని అన్నారు.

కాగా, ఈ వీడియోపై నెట్టింట సానుభూతి వెల్లువెత్తింది. బడా నగరాల్లో ఉండే ప్రముఖ యూనివర్సిటీల్లో పనిచేసే అధ్యాపకుల పరిస్థితి ఇంత దారుణమా అని కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాబుద్ధులు నేర్పించే ఉపాధ్యాలను గౌరవించుకునే తీరు ఇదేనా అని కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ వీడియో వైరల్‌గా మారింది.

Viral: దీపావళి రోజున ఇంట్లో ఒంటరిగా మహిళ! ఇంతలో ఊహించని విధంగా..

Read Latest and Travel News

Updated Date - Oct 27 , 2024 | 07:06 PM