ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: భార్యలో తీవ్ర అసహనం.. సీసీటీవీ ఫుటేజీలో ఆమె చేస్తున్న పనిని భర్త చూసి..

ABN, Publish Date - Jul 04 , 2024 | 04:54 PM

తనను మట్టుపెట్టడానికి భార్య సీక్రెట్ చేస్తున్న పనిని చూసి షాకైపోయిన భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే, పోలీసులు ద్వారా ఆమె చెప్పిన కారణం విని నివ్వెరపోయాడు. అమెరికాలోని మిస్సోరీ రాష్ట్రంలో ఈ ఘటన వెలుగు చూసింది.

ఇంటర్నెట్ డెస్క్: తనను మట్టుపెట్టడానికి భార్య సీక్రెట్‌గా చేస్తున్న పనిని చూసి షాకైపోయిన భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల ద్వారా ఆమె చెప్పిన కారణం విని నివ్వెరపోయాడు. అమెరికాలోని మిస్సోరీ రాష్ట్రంలో ఘటన జరిగింది. ప్రస్తుతం ఈ ఉదంతం సంచలనంగా (Viral) మారింది.


లాక్లీడ్ కౌంటీకి చెందిన మిషెల్ అనే 47 ఏళ్ల మహిళ తన భర్త కోసం ఇటీవల పుట్టినరోజు వేడుక ఏర్పాటు చేసింది. బంధువులు, స్నేహితులందరినీ పిలిచి హంగామా చేసింది. భర్త కోసం ఆమె అంత కష్టపడినా అతడి నుంచి ఒక్క ప్రశంస కూడా పొందలేకపోయింది. దీంతో, ఆమెలో అసంతృప్తికి తారాస్థాయికి చేరుకుంది. ఈ ఉదంతం తరువాత మిషెల్ భర్త ఇంట్లో ఓ విచిత్రమైన మార్పును గుర్తించాడు. ఫ్రిజ్‌లో దాచుంచిన కూల్ డ్రింక్‌ల రుచిలో మార్పును గమనించి ఆశ్చర్యపోయాడు. ఫ్రిజ్‌లోనే కాకుండా ఇంట్లో ఇతర చోట్లు ఉన్ కూల్ డ్రింకుల్లో కూడా ఇదే తరహా మార్పు కనిపించింది. అంతేకాకుండా, ఇవి తాగిన తరువాత అతడి వాంతులు, విరేచనాలు, జ్వరం వంటి రోగాలు వేధించేవి. బయట తాగిన కూల్ డ్రింకులు మాత్రం యథాప్రకారం పాత రుచిలోనే ఉండేవి

Viral: భారతీయులు ఆరోగ్యంగా ఉన్నారంటే ఇదే కారణం! అమెరికా యువతి కామెంట్ వెనక..


అసలేం జరుగుతోందో తెలుసుకుందామనుకున్న అతడు ఇంట్లోని సీసీటీవీ కెమెరా ఫుటేజీ పరిశీలించి నిర్ఘాంతపోయాడు. భార్య తరచూ ఇంట్లోని కూల్‌‌డ్రింకులతో పాటు కలుపుమొక్కల సంహారక మందును బయటకు తీసికెళ్లి మళ్లి లోపలికి తీసుకొస్తున్నట్టు గుర్తించాడు. కూల్‌డ్రింకుల్లో ఆమె విషపదార్థాలను కలుపుతున్నట్టు అతడికి అర్థమైంది. దీంతో, పరాయి పురుషుడికి దగ్గరై తనను అడ్డుతొలగించుకునేందుకు ఆమె ప్రయత్నిస్తోందని అనుమానపడ్డాడు. ఇన్సూరెన్స్ సొమ్ముపై కన్నేసి ఉంటుందని భావించాడు చివరకు పోలీసులను ఆశ్రయించాడు. ఈ క్రమంలో పోలీసులు ఘటనపై దర్యాప్తు చేయగా అతడి అనుమానాలేవీ నిజం కాదని తేలింది. పుట్టినరోజు వేడుకను కష్టపడి జరిపినా కూడా తనను ప్రశంసించని, తన కష్టాన్ని గుర్తించని భర్తపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఆమె ఈ దారుణానికి పాల్పడట్టు తేలింది. విషయం తెలిసి భర్త కూడా ఆశ్చర్యపోయారు. నిందితురాలిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Read Viral and Telugu News

Updated Date - Jul 04 , 2024 | 06:31 PM

Advertising
Advertising