Viral: చావుతో చలగాటమంటే ఇదే! జూకు వచ్చిన ఈ తింగరి మహిళ ఏం చేసిందో చూస్తే..
ABN, Publish Date - Aug 23 , 2024 | 03:21 PM
అమెరికాలో ఓ మహిళ దారుణానికి ఒడిగట్టింది. పులి బోనులోకి దూకి దానితో పరాచకాలు ఆడే ప్రయత్నం చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతూ జనాలకు ఆగ్రహం తెప్పిస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో ఓ మహిళ దారుణానికి ఒడిగట్టింది. పులి బోనులోకి దూకి దానితో పరాచకాలు ఆడే ప్రయత్నం చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ (Viral) అవుతూ జనాలకు ఆగ్రహం తెప్పిస్తోంది. మహిళ చేసిన పని చూసి అనేక మంది ఆమెను తెగ తిట్టిపోస్తున్నారు.
న్యూజెర్సీ రాష్ట్రంలోని కొహాన్‌జిక్ జూలో ఈ ఘటన వెలుగు చూసింది. బ్రిడ్జ్‌టన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, జూకు వచ్చిన ఓ మహిళ అకస్మాత్తుగా పులి ఉన్న ఎన్‌క్లోజర్‌లోకి దూకింది. ఆ తరువాత లోపలున్న మరో ఫెన్సింగ్‌లోంచి వెళ్లు పోనిచ్చి పులిని తాకే ప్రయత్నం చేసింది.
Viral: శ్వాస తీసుకోకుండా 6 రోజులు బతకగల ఈ జీవి గురించి తెలుసా?
మహిళ బోనులోకి దూకగానే అప్రమత్తమైన పులి ఆమెపై దాడి చేసేందుకు సిద్ధమైంది. అయితే, పులి మహిళ వేళ్లను నోటపట్టే లోపే ఆమె అప్రమత్తమై వెనుదిరిగింది (US Woman Climbs Into Tiger's Enclosure In Zoo Nearly Gets Bitten).
ఈ ఘటన తాలూకు వీడియోను పోలీసులు స్వయంగా నెట్టింట పోస్టు చేసి ఆపై డిలీట్ చేశారు. అయితే, అప్పటికే వీడియో జనాలను ఆకర్షించడంతో పలువురు వీడియో నకళ్లను కూడా వైరల్ చేసేశారు. అయితే, పోలీసులు మాత్రం మహిళ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. పులి, సింహాలు ఉన్న బోనుల్లోకి వెళ్లే ప్రయత్నం చేయకూడదని గట్టిగా సోషల్ మీడియాలో హెచ్చరించారు. ఇలాంటి వారిని మళ్లీ జీవితంలో ఎన్నడూ జూలో కాలుపెట్టకుండా నిషేధించే అవకాశాలు ఉన్నాయని వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని బ్రిడ్జ్‌టన్ అధికార ప్రతినిధి ప్రతికాసమావేశంలో పేర్కొన్నారు.
ఇక జూ అధికారుల ప్రకారం, అక్కడ రిషి, మహేశా అనే రెండు బెంగాల్ టైగర్లు ఉన్నాయి. 2016లో ఆ జూలో అవి కాలుపెట్టాయి. వచ్చినప్పుడు ఇరవై పౌండ్లు కూడా లేని ఆ మగ పులులు ప్రస్తుతం ఏకంగా 500 పౌండ్ల బరువును దాటిపోయాయట.
జంతుశాస్త్రజ్ఞుల ప్రకారం, బెంగాల్ టైగర్లు అంతరించిపోయే స్థితికి చేరుకున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కేవలం 3500 బెంగాల్ టైగర్లు మాత్రమే ఉన్నాయి. రష్యాలో కనిపించే సైబీరియన్ పులుల తరువాత అతిపెద్దవిగా బెంగాల్ పులులు పేరు గడించాయి. ఇక పులుల సంరక్షణ కోసం మన దేశం ప్రాజెక్టు టైగర్ కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.
Updated Date - Aug 23 , 2024 | 04:21 PM