Viral: తొలిసారి భారతీయ బార్బర్‌తో మసాజ్ చేయించుకున్న అమెరికన్! చివరకు ఏమైందో మీరే చూడండి!
ABN, Publish Date - Apr 23 , 2024 | 06:00 PM
ఇండియాకొచ్చిన ఓ అమెరికన్ యూట్యూబర్ ఇక్కడ ఓ బార్బర్‌తో నెత్తికి మసాజ్ చేయించుకున్నాడు. మసాజ్ మహిమతో స్వర్గం అంచుల వరకూ వెళ్లానన్న అతడు.. ఈ బార్బర్‌కు ఎలాన్ మస్క్ జాబ్ ఇవ్వాలని కూడా వ్యాఖ్యానించాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఇండియాకొచ్చిన ఓ అమెరికన్ యూట్యూబర్ ఇక్కడ ఓ బార్బర్‌తో నెత్తికి మసాజ్ చేయించుకున్నాడు. మసాజ్ మహిమతో స్వర్గం అంచుల వరకూ వెళ్లానన్న అతడు.. ఈ బార్బర్‌కు ఎలాన్ మస్క్ జాబ్ ఇవ్వాలని కూడా వ్యాఖ్యానించాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా (Viral) మారింది.
డెయిలీ మ్యాక్స్ అనే యూట్యూబర్ నెట్టింట బాగా పాప్యులర్. అతడి యూట్యూబ్ ఛానల్‌కు 12 లక్షల మందికి పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఇటీవల అతడు ఇండియాకు వచ్చాడు. ఢిల్లీలో ఫుట్‌పాత్‌పై వ్యాపారం చేసుకునే బార్బర్ ముహమ్మద్ వారిస్ వద్దకు వెళ్లాడు. అతడు ఇతరులకు తలకు మసాజ్ చేస్తుండగా చూసి మ్యాక్స్‌కు కూడా మసాజ్‌పై మనసు పోయింది. దీంతో, ఓపిగ్గా క్యూలో వేచి చూసి మరీ ముహమ్మద్‌తో మసాజ్ చేయించుకున్నాడు (US YouTuber gives huge tip to Delhi barber for head massage).
Viral: టాప్ మార్కులొచ్చిన విద్యార్థిని నిర్దాక్షిణ్యంగా ఫెయిల్ చేసిన యూనివర్సిటీ! ఎందుకో తెలిస్తే..
పది నిమిషాల పాటు సాగిన ఈ మసాజ్‌తో మ్యాక్స్ ఫుల్‌గా రిలాక్సైపోయాడు. స్వర్గలోకపు అంచుల వరకూ వెళ్లాడు. ‘‘వీధుల్లో మసాజులు ఎందుకింత బాగుంటాయి.. వావ్.. నమ్మలేకపోతున్నా. ఇది నిజంగా బాగుంది. ఈ పది నిమిషాలు అద్భుతంగా గడిపోయాయి’’ అంటూ మ్యాక్స్ మైమరిచిపోతూ బోలెడన్ని కామెంట్స్ చేశాడు. పైసా ఖర్చు లేకుండా అంతరీక్షాన్ని తాకొచ్చానన్న అతడు.. ఎలాన్ మస్క్‌కు ముహమ్మద్‌ను పనిలో పెట్టుకోవాలని సూచించాడు. చివరకు బార్బర్‌కు ఊహించని విధంగా రూ.3,000 టిప్ ఇచ్చాడు. ఆ తరువాత అతడికి షేక్ హ్యాండ్ ఇచ్చి మరీ వెనుదిరిగాడు.
వీడియో వైరల్ కావడంతో జనాల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ముహమ్మద్ కష్టం అనేక మందిని కదిలించింది. బార్బర్‌కు భారీ టిప్పిచ్చిన యూబ్యూర్ను కూడా జనాలు మెచ్చుకున్నారు.
Read Latest Offbeat and Telugu News
Updated Date - Apr 23 , 2024 | 06:07 PM