ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Wedding Invitation: విగ్నేశ్వరుడికి తొలి వెడ్డింగ్ కార్డును ఇచ్చిన ముస్లిం యువకుడు..

ABN, Publish Date - Feb 25 , 2024 | 11:00 AM

Muslim Wedding Card: ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్(Bahraich) పట్టణానికి చెందిన ఓ ముస్లిం యువకుడు తన వివాహ తొలి ఆహ్వాన పత్రికను గణపతికి ఇచ్చాడు. తన పెళ్లికి రావాలంటూ గణపయ్యను(Lord Ganesh) ఆహ్వానించాడు. ఇందుకు సంబంధించిన వెడ్డింగ్ కార్డ్(Wedding Card) సోషల్ మీడియాలో వైరల్(Viral) అవుతోంది. ఈ కార్డులో హిందూ సంప్రదాయం ప్రకారం పదాలు పేర్కొంటూ, హిందీలో ముద్రించారు. వినాయకుడికి తొలి ఆహ్వాన పత్రిక అందజేసిన యువకుడు.. ప్రకృతిలోని పంచ భూతాలను కూడా ఆహ్వానించాడు.

Wedding Invitation

Muslim Wedding Card: ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్(Bahraich) పట్టణానికి చెందిన ఓ ముస్లిం యువకుడు తన వివాహ తొలి ఆహ్వాన పత్రికను గణపతికి ఇచ్చాడు. తన పెళ్లికి రావాలంటూ గణపయ్యను(Lord Ganesh) ఆహ్వానించాడు. ఇందుకు సంబంధించిన వెడ్డింగ్ కార్డ్(Wedding Card) సోషల్ మీడియాలో వైరల్(Viral) అవుతోంది. ఈ కార్డులో హిందూ సంప్రదాయం ప్రకారం పదాలు పేర్కొంటూ, హిందీలో ముద్రించారు. వినాయకుడికి తొలి ఆహ్వాన పత్రిక అందజేసిన యువకుడు.. ప్రకృతిలోని పంచ భూతాలను కూడా ఆహ్వానించాడు.

ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్‌ జిల్లా కైసర్‌గంజ్‌లో ఓ ముస్లిం యువకుడి వెడ్డింగ్ కార్డ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కార్డ్ వైరల్ కావడానికి అతిపెద్ద కారణం.. పెళ్లి జరిగేది ముస్లిం యువకుడిది. తన పెళ్లి మొదటి ఆహ్వాన పత్రికను గణేషుడికి ఇవ్వడమే ఇప్పుడు ప్రధానాంశంగా మారింది. తన వివాహానికి సాక్షిగా పంచ భూతాలను కూడా ఆహ్వానించాడు ఆ యువకుడు. కార్డులో హిందూ ఆచారాల ప్రకారమే పెళ్లి క్రతువును పేర్కొన్నారు. పెళ్లి చేసుకోబోయే యువకుడు తన వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డును తన బంధువులు, మిత్రులతో పాటు.. హిందూమతానికి చెందిన వ్యక్తులకు కూడా ఇచ్చాడు.

పెళ్లి ఎప్పుడంటే..

ఈ వెడ్డింగ్ కార్డ్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. సఫీపూర్ గ్రామంలో నివసించే అజుల్ కమర్ కుమారుడు సమీర్ అహ్మద్ వివాహం ఫిబ్రవరి 29న జరగనుంది. పెళ్లికి ఇంకో నాలుగు రోజుల సమయం ఉంది. అయితే ఈ వెడ్డింగ్ కార్డ్ మాత్రం ఇప్పటికే వైరల్ అవుతోంది. సమీర్ ముస్లిం బంధువుల కోసం ముస్లిం సంప్రదాయం ప్రకారం ఒక వెడ్డింగ్ కార్డును, హిందూ స్నేహితుల కోసం మరొక వెడ్డింగ్ కార్డును ముద్రించాడు. హిందూ ఆచారాల ప్రకారం ముద్రించిన వెడ్డింగ్ కార్డు శ్రీ గణేశాయ నమః అని ప్రారంభమవుతుంది. హిందీ భాషలో ముద్రించిన కార్డును తొలి ఆహ్వాన పత్రికగా బొజ్జ గణపయ్యకు సమర్పించాడు.

హిందువుల కోసం హిందీలో..

సమీర్ వివాహం జర్వాల్ రోడ్‌లోని జుమెరాటి కుమార్తె సానియా ఖాతూన్‌తో నిశ్చయమైంది. ముస్లిం మత సంప్రదాయం ప్రకారం ప్రింట్ చేయించిన వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డులో ‘నిఖా’, ‘వెడ్స్’ అని ఆంగ్ల పదాలను ఉపయోగించారు. హిందువుల కోసం ముద్రించిన వెడ్డింగ్ కార్డులో ‘శుభ్ వివాహ’ అనే పదాన్ని రాయించారు. సాధారణంగా హిందువుల వివాహ ఆహ్వాన పత్రికలో వరుడికి చిరంజీవి.. వధువు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి(చిలసౌ) అని రాస్తారు. సమీర్ వివాహ ఆహ్వాన పత్రికపైనా అలాగే రాయించాడు.

ఉర్దూలో ముద్రించిన కార్డును ముస్లిం బంధుమిత్రులకు..

వైరల్ అయిన కార్డు గురించి సమీర్ అతని తండ్రి ఉఝుల్‌ మాట్లాడుతూ.. తమకు ఎక్కువగా హిందువులలో మిత్రులు ఉన్నారని, అందుకే హిందూ సోదరులకు పంపించేందుకు హిందూ సంప్రదాయం ప్రకారం ఆహ్వాన పత్రికను ప్రింట్ చేయించామన్నారు. తమ కమ్యూనిటీ వారి కోసం ఉర్దూలో కూడా కార్డులను ముద్రించామని చెప్పారు. కార్డు మాత్రమే కాదు.. ఈ పెళ్లి వేడుకలో చాలా విషయాలు భిన్నంగా ఉంటాయని చెప్పారు. పెళ్లికి ఒక రోజు ముందే హిందూ సోదరులకు విందు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.

మరిన్ని ప్రత్యేకం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Feb 25 , 2024 | 11:05 AM

Advertising
Advertising