ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: ఈ వీధి వ్యాపారి ముందు టెకీలు కూడా దిగదుడుపే! ఇతడి రేంజ్ ఏంటో చూస్తే..

ABN, Publish Date - Oct 07 , 2024 | 10:30 AM

వీధి పక్కన బండిపై వడాపావ్ అమ్ముకునే ఓ వ్యాపారి ఏడాది సంపాదన రూ.24 లక్షలుగా తేలడంతో జనాలు నోరెళ్లబెడుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

ఇంటర్నెట్ డెస్క్: ఏటా రూ.24 లక్షలు ఆర్జిస్తున్నారంటే వాళ్లు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు అయ్యుంటారని భావిస్తాం. కానీ వీధిలో బండిపై వడాపావ్ అమ్ముకునే ఓ వ్యక్తి ఇంత మొత్తం సంపాదిస్తున్నాడని ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఆధారాలతో సహా బయటపెట్టాడు. దీంతో, ఈ ఉదంతం ప్రస్తుతం వైరల్‌గా (Viral) మారింది.

Viral: భారతీయులకే జాబ్స్ ఇస్తున్నారు.. కెనడా శ్వేతజాతీయురాలి సంచలన ఆరోపణ

సార్థక్ సచ్‌దేవా అనే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఈ వీడియోను పోస్టు చేశారు. ముంబైలో ఓ వీధి వ్యాపారి వద్ద రోజంతా ఉండి అతడి సంపాదనను అంచనా వేశారు. ఆ వివరాలన్నీ లెక్కలతో సహా వివరించాడు. తొలుత అసలు వడాపావ్ వ్యాపారం ఎలా చేస్తారన్న విషయంపై సచ్‌దేవా పలు విషయాలు అడిగి తెలుసుకున్నాడు. ఆ తరువాత వడాపావ్ వండటం, కస్టమర్లతో ఎలా వ్యవహరించాలనేదానిపై వివరాలు అడిగి తెలుసుకున్నాడు. ఈ లోపు వీధి వ్యాపారి ఎన్ని వడాపావ్‌లు అమ్మీందీ కూడా లెక్క రాసుకున్నాడు.


Viral: రూ.27 వేలకే ఐఫోన్ 16 కొనుక్కుని.. చివరకు విచారం! అసలేమైందంటే..

అతడు చెప్పిన దాని ప్రకారం దాదాపు మధ్యాహ్నం అయ్యేసరికే వీధి వ్యాపారి దాదాపు 200 వడాపావ్‌లు అమ్మేశాడు. రోజంతా ఇదే జోరు కొనసాగడంతో మొత్తం 622 వడాపావ్‌లు అమ్ముడుపోయాయి. ఒక్కో వడాపావ్ రూ.15 చొప్పున ఆ రోజున వీధి వ్యాపారి సంపాదన ఏకంగా రూ.9,300కు చేరింది. ఇలా ఖర్చులు పోను చూస్తే అతడి నెల సంపాదన రూ.2.8 లక్షలకు వెళ్లింది. అంటే..అతడి ఏడాది సంపాదన రూ.24 లక్షలు. ఈ లెక్కలన్నీ వివరంగా చెప్పుకొచ్చిన సచ్‌దేవా..వీధి వ్యాపారి సంపాదన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లను తలదన్నేలా ఉందని అన్నాడు.

Inflation: మీ వద్ద రూ.కోటి ఉందా! 2050 కల్లా ఆ విలువ ఎంత తగ్గుతుందో తెలిస్తే..


ఇక ఆ వీధి వ్యాపారి సంపాదన ఈ రేంజ్‌‌లో ఉండటం చూసి నెటిజన్లు షాకైపోతున్నారు. ఇది నిజంగా అద్భుతమే అని కొందరు కామెంట్ చేశారు. ‘‘వామ్మో.. ఇంత సంపాదనా! మరి నేను నా జీవితంలో చేస్తున్నదేంటో’’ అంటూ కొందరు నైరాశ్యం వ్యక్తం చేశారు. మరికొందరేమో ఇక ఫుడ్ కార్ట్ స్టార్ట్ చేయాల్సిన సమయం వచ్చిందని అభిప్రాపడ్డారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. మరీ మీరూ ఈ వీడియోను చూసి ఎంజాయ్ చేయండి!

Viral: వీడేం దొంగరా బాబూ! చోరీకొచ్చి.. అంట్లు తోమి..బట్టలు ఉతికి.. ఆపై..

Viral: ఇలాంటి వ్యక్తికి రూ.65 లక్షల శాలరీనా! గూగుల్ ఆఫర్‌కు జనాలు షాక్

Read Latest and Viral News

Updated Date - Oct 07 , 2024 | 10:35 AM