ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: నూడుల్స్ అంటే చెవి కోసుకునే వాళ్లు అస్సలు చూడకూడని వీడియో ఇది!

ABN, Publish Date - Feb 25 , 2024 | 07:13 PM

అపరిశుభ్ర పద్ధతుల్లో ఓ వ్యక్తి నూడుల్స్ చేస్తున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల కాలంలో పలు వంటల వీడియోలు నెట్టింట వైరల్‌గా (Viral) అయ్యాయి. అనేక మంది కొత్త తరహా రెసిపీలను పరిచయం చేశారు. కొన్నింటిపై ప్రశంసలు కురిస్తే మరికొన్ని బెడిసికొట్టాయి. ఇక అపరిశుభ్ర వాతావరణంలో, పద్ధతుల్లో వంట చేస్తున్న వీడియోలు కూడా జనాలకు రోత పుట్టించాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి మళ్లీ నెటిజన్లతో గగ్గోలు పెట్టిస్తోంది. వీడియోలోని వ్యక్తి నూడుల్స్ (Noodles) చేస్తున్న విధానం చూసి జనాలు ఛీదరించుకుంటున్నారు.

Viral video: ఎలా అడ్డంగా బుక్కయ్యాడో మీరే చూడండి.. సివిల్ డ్రెస్‌లో ఉన్నది ఐపీఎస్ ఆఫీసరని తెలీక..

వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఆ వ్యక్తి నూడుల్స్ చేసే క్రమంలో పొయ్యి మీద ఉన్న గిన్నెలోని నూడుల్స్‌ను ఉత్తచేతులతో కలిపేశాడు (Mixing Noodles with bare hands). ముఖంపై కనీసం మాస్క్‌కు పెట్టుకోకుండా అతడు వంట చేస్తున్న విధానంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఎక్కడో జరిగిన ఓ పెళ్లిలో అతడు ఇలా వంట చేసినట్టు కొందరు నెటిజన్లు కామెంట్ చేశారు.

Dubai: భారతీయుల కోసం దుబాయ్ కొత్త వీసా.. దరఖాస్తు చేసుకున్న 5 రోజులకే జారీ!


అధికశాతం మంది మాత్రం వంట వ్యక్తి తీరును ముక్తకంఠంతో ఖండించారు. ఉత్త చేతులతో ఆహారాన్ని కలుపుతున్న అతడు ఆహారాన్ని కలుషితం చేస్తున్నాడని ఆరోపించారు. పెళ్లికొచ్చిన అతిథుల ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేశాడని మండిపడ్డారు. నూడుల్స్ అంటే ఇష్టపడే వాళ్ల ఈ వీడియో అస్సలు చూడొద్దని కొందరు సలహా ఇచ్చారు. ఈ సూచనను పాటించని వాళ్లు భవిష్యత్తులో నూడుల్స్ అంటేనే ముఖం తిప్పుకునే స్థితి రావచ్చని హెచ్చరించారు. ఇలాంటి వాళ్లపై ఫిర్యాదు చేయాలని కూడా కొందరు అన్నారు.

Viral: మీరు ఈ లేఖ చదువుతున్నారంటే.. తనకు చావు తప్పదని తెలిసి మహిళ బహిరంగ లేఖ

అయితే, వీడియోలో వంట వ్యక్తి ఏదో తొందర్లో ఉన్నట్టు కనిపించడం నెటిజన్లు దృష్టి దాటిపోలేదు. దీంతో, కొందరు ఆ వ్యక్తికి మద్దతు కూడా ఇచ్చారు. సడెన్‌గా పెద్దమొత్తంలో ఏదైనా వంటకం సిద్ధం చేయాల్సి వస్తే పరిస్థితి ఇలాగే ఉంటుందని చెప్పారు. అతడి పరిస్థితిని తాము అర్థం చేసుకోగలమని కూడా అన్నారు. పొట్టకూటి కోసం ఇంతలా కష్టపడేవారిని అవహేళన చేయకూడదని హితవు పలికారు. ఇలా రకరకాల అభిప్రాయాల మధ్య వీడియో వైరల్‌గా మారింది.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Feb 25 , 2024 | 07:19 PM

Advertising
Advertising