Viral: ఇదేమి మిస్టరీ బాబోయ్! లాప్‌టాప్ స్క్రీన్ లోపల చీమ..!
ABN, Publish Date - Oct 05 , 2024 | 10:58 AM
లాప్‌టాప్ స్క్రీన్‌లో ఓ చీమ చోరబడ్డ ఘటన తాలూకు వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అది స్క్రీన్ లోపలికి ఎలా చొరబడిందనే దానిపై నెట్టింట పెద్ద చర్చ జరుగుతోంది. జనాలు నోరెళ్లబెట్టేలా చేస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: బాగా ఖరీదు పెట్టి కొనుక్కునే లాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లను జాగ్రత్తగా చూసుకుంటాం. అవి పాడయితే బాగు చేయించుకునేందుకు వేలు చెల్లించాల్సి వస్తుంది కాబట్టి అత్యంత అప్రమత్తంగా ఉంటాం. ఇలా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని సార్లు ఊహించని సమస్యలు వచ్చిపడతాయి. అసలు ఇలాంటి ఇబ్బందులు కూడా వస్తాయా? అనే రేంజ్‌లో ఈ చిక్కులు ఉంటాయి. వాటి నుంచి ఎలా తప్పించుకోవాలో నిపుణులు కూడా చెప్పలేరేమో అని అనిపిస్తుంది. ఓ వ్యక్తికి పాపం.. సరిగ్గా ఇలాంటి సమస్యే ఎదురైంది. ఏం చేయాలో తెలీక తన సమస్యను నెట్టింట పంచుకున్నాడు (viral).
Canada: కెనడాలో దారుణం.. ఏ ఎన్నారైకీ ఈ కష్టం రాకూడదు!
ఆదిత్య అనే వ్యక్తి తన వింత సమస్య గురించి వివరిస్తూ ఓ షాకింగ్ వీడియో కూడా షేర్ చేశాడు. వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఓ చీమ అతడి లాప్‌టాప్ స్క్రీన్‌లోకి చొరబడింది. అంతేకాకుండా, స్క్రీన్ లోపల అది చెక్కర్లు కొట్టడం కూడా వీడియోలో స్పష్టంగా కనిపించింది. ఈ విషయంలో ఎటువంటి సందేహాలకు తావు లేకుండా అతడు స్క్రీన్‌పై వేలు పెట్టి మరీ చీమ లోపలున్న విషయాన్ని స్పష్టంగా చూపించాడు.
Viral: ఇలాంటి వ్యక్తికి రూ.65 లక్షల శాలరీనా! గూగుల్ ఆఫర్‌కు జనాలు షాక్
ఇక వీడియో చూసిన జనాల ఆశ్చర్యానికి అంతేలేకుండా పోయింది. స్క్రీన్‌లోపలకు ఆ చీమ ఎలా వెళ్లిందో అర్థం కాక జనాలు నోరెళ్లబెట్టారు. అయితే, ఓ వ్యక్తి మాత్రం దీని వెనకున్న ఓ భిన్నమైన కారణాన్ని చెప్పుకొచ్చాడు. అతడు తెలిపిన దాని ప్రకారం, చీమ లాప్‌టాప్‌లో స్క్రీన్ లోపలకు చొరబడలేదు. అసలు అందుకు అవకాశమే లేదు.
అయితే, లాప్‌టాప్ తయారీ సందర్భంగా చీమ గుడ్డు అందులో ఇరుక్కుపోయి ఉంటుందని, స్క్రీన్‌లోపల గోరువెచ్చని వాతావరణం కారణంగా గుడ్డులోంచి చీమ బయటకు వచ్చింది. తనకూ ఇలాంటి సమస్యే ఎదురైందని అతడు చెప్పుకొచ్చాడు. ఇండియాలోని యాపిల్ సంస్థ వారితో గొడవ పడి మరీ పాత స్క్రీన్ స్థానంలో కొత్త స్క్రీన్ వేయించుకున్నట్టు వివరించాడు. తొలుత తప్పు నాదే అన్నట్టు వారు మాట్లాడినా తాను వెనక్కు తగ్గకుండా న్యాయం కోసం పోరాడినట్టు వివరించాడు.
Viral: భార్యకు విడాకులు ఇవ్వడం ఇష్టంలేని భర్త.. జడ్జి చూస్తుండగానే ఆమెను..
కానీ ఆదిత్య మాత్రం ఇలా జరిగి ఉండే అవకాశం లేదని తేల్చి చెప్పాడు. లాప్‌టాప్ నాలుగు సంవత్సరాలుగా తన వద్దే ఉందని, ఓ చీమ గుడ్డు అంతకాలం పాటు లాప్‌టాప్‌లో బతికిబట్టకట్టలేదని స్పష్టం చేశాడు. చార్జింగ్ పోర్టు ద్వారా అది లోపలకు వెళ్లి ఉండొచ్చని అన్నాడు. ఈ ఉదంతంపై కొందరు ఫన్నీ కామెంట్స్ కూడా చేశారు. కర్సర్‌తో కొట్టాలని, ఫ్రీడైనమిక్ వాల్ పేపర్‌ను ఎంజాయ్ చేయాలని సూచించారు.
Viral: టైం వేస్ట్.. ఐఫోన్ 16 ప్రోపై టెకీ తీవ్ర అసంతృప్తి! కారణం ఏంటంటే..
Updated Date - Oct 05 , 2024 | 11:06 AM