ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral: నాలుగు కాళ్లున్న పామును ఎప్పుడైనా చూశారా? షాకింగ్ వీడియో!

ABN, Publish Date - May 17 , 2024 | 04:21 PM

నాలుగు కాళ్లతో పాము ఆకారంలో కనబడుతున్న ఓ వింత జీవి వీడియో వైరల్‌గా మారింది. అది కాళ్లున్న పాము అంటూ జనాలు గగ్గోలు పెడుతున్నారు. కొందరు మాత్రం ఇది ఫేక్ వీడియో అని చెబుతున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: జంతుశాస్త్రం ప్రకారం, పాములు సరీసృపాల జాతికి చెందినవి. అయితే, పరిణామ క్రమంలో ఇవి తమ కాళ్లు కోల్పోయాయని శాస్త్రవేత్తలు చెబుతారు. ప్రస్తుతం మనం చూసే ఏ పాములకు కాళ్లు ఉండవు. పాము జీవనశైలికి కాళ్లు, చేతులు నిరుపయోగం కాబట్టి కొన్ని లక్షల ఏళ్ల క్రితమే అవి కాళ్లు కోల్పోయాయట. ఒకప్పటి పాముల శిలాజాల్లో చిన్న చిన్న కాళ్ల ఆనవాళ్లు కూడా కనిపిస్తాయి. ఇప్పుడిదంతా ఎందుకంటే ప్రస్తుతం కాళ్లున్న ఓ పామును చూసి జనాలు భయపడిపోతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా (Viral) మారింది.

@balichannel అనే ఇన్‌స్టా అకౌంట్‌లో ఈ వీడియో వైరల్ అవుతోంది. ఇందులో దాదాపు పాము ఆకారంలో ఉన్న జీవికి కాళ్లు కూడా ఉండటం జనాలను షాక్‌కు గురి చేస్తోంది. అసలు అది పామేనా కాదా అనే విషయంలో జనాలు ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నారు. కొందరు మాత్రం వీడియోలోని జీవి పాము అని ఢంకా బజాయించి చెప్పడమే కాకుండా అది కాళ్లు ఉన్న పాము అని వాదిస్తున్నారు. వీడియోలోని జీవికి మొత్తం రెండు జతల కాళ్లు ఉన్నట్టు కనిపిస్తోంది (Video Of Mysterious Snake With Legs Creeps Out Internet).

Viral: పక్కకు తొలగిన మోకాలి కీలు.. ఉత్త చేతులతో సరిచేశాడుగా! షాకింగ్ వీడియో!


వీడియోలో కనిపించిన దాని ప్రకారం, కెమెరా కదులుతున్నా పాము మాత్రం కదలనట్టు ఉండటంతో కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. నడుము వరకూ స్కింక్ అనే జీవిలా ఉందని ఆ తరువాత మాత్రం పాములా ఉందని కొందరు కామెంట్ చేశారు. ఇదంతా ఫొటోషాప్‌లో చేసిన మాయలాగా ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఇలా రకరకాల కామెంట్ల మధ్య వీడియో తెగ వైరల్ అవుతోంది.

Read Viral and Telugu News

Updated Date - May 17 , 2024 | 04:23 PM

Advertising
Advertising