ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: షాకింగ్..నవజాత శిశువుతో పాలసీసా శుభ్రం చేయించిన తల్లి!

ABN, Publish Date - Sep 26 , 2024 | 06:38 PM

ఓ తల్లి తన నవజాత శిశువుతో పాల బాటిల్ శుభ్రం చేయించింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా జనాలు ఆమె తీరు చూసి తిట్టిపోస్తున్నారు. నువ్వసలు తల్లివేనా అంటూ మండిపడుతున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: నవజాత శిశువులు.. అభంశుభం తెలియని పసిప్రాణాలు. రోజులు, నెలల వయసున్న పిల్లల్ని ఏ తల్లి అయినా ఎలా పెంచుతుందో మనకు తెలిసిందే. ప్రాణం కంటే మిన్నగా చూసుకుంటుంది. కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. కానీ నేటి సోషల్ మీడియా జమానాలో అనేక విపరీతాలు చోటుచేసుకుంటున్నాయి. అలాంటి ఓ దారుణం ప్రస్తుతం జనాల్ని షాకయ్యేలా చేస్తోంది (Viral).

వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఓ తల్లి తన నవజాత శిశువుతో పాల బాటిల్ శుభ్రం చేయించింది. తొలుత పాల బాటిల్‌లో సబ్బు నీళ్లు పోసి ఆ తరువాత చిన్నారి చేయిని అందులో దూర్చింది. ఆ తరువాత బాటిల్‌లో చేయిని అటూ ఇటూ తిప్పుతూ లోపలంతా శుభ్రం చేయించింది. లోపలంతా బాగా శుభ్రం చేయించాక చిన్నారి చేయిని బయటకు తీసింది.

Viral: భార్యకు స్కూటర్ యాక్సిడెంట్! తనపై తానే పోలీసు కేసు పెట్టుకున్న భర్త!


ఈ వీడియో ఎవరూ తీశారో తెలియనప్పటికీ బాల కార్మికులు అనే క్యాప్షన్‌తో నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది. ఇప్పటికే లక్షా డభ్బై వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. కామెంట్స్ కూడా పది వేలు దాటిపోయాయి. జనాల ఆగ్రహానికి అయితే అంతే లేకుండా పోయింది. పెద్దలు వాడే సబ్బు నీరు చిన్నారుల చేయికి తగలడం చాలా అపాయకరమని ఓ వ్యక్తి కామెంట్ చేశారు. చాలా సున్నితంగా ఉండే చిన్నారులు విషయంలో ఇలా కర్కశంగా ఎలా వ్యవహరిస్తారని ప్రశ్నించారు. ఇలాంటి వారిని జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు.

Viral: కెనడాలో రూ.1.2 కోట్ల శాలరీ! తమ సీక్రెట్ చెప్పేసిన ఎన్నారై దంపతులు!


ఓ తల్లి అసాధారణ చర్యకు సంబంధించి మరో వీడియో కూడా ఇటీవల నెట్టింట్లో తెగ వైరల్ అయ్యింది. అందవిహీనంగా ఉన్న తన నవజాత శిశువు ఫొటోలను ఆమె ధైర్యంగా నెట్టింట పంచుకుంది. తన బిడ్డ అందంగా లేడని ఆమె గర్వంగా చెప్పుకుంది. అయితే, కొందరు ఆమె తీరును విమర్శించారు. పెద్దయ్యాక ఈ ఫొటోలను చూసి చిన్నారి ఆత్మన్యూనతకు లోనవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, తన నిర్ణయం వెనక ఉద్దేశాన్ని ఆ మహిళ వివరించింది. పుట్టిన ప్రతి బిడ్డా అందంగా ఉండాలన్న నియమం ఏం లేదని, మనలో ఉన్న లోపాలను కూడా అంగీకరించగలగడం ఓ గొప్ప కళ అని చెప్పుకొచ్చింది. లోపాలను కూడా స్వీకరించగలిగితే జీవితం సంతోషమయం అవుతుందంటూ తన ఫిలాసఫీ వివరించింది. దీంతో, ఈ వీడియోకూడా అప్పట్లో హాట్‌టాపిక్‌గా మారింది.

Viral: 18 ఏళ్లుగా పక్కింటి వ్యక్తి కరెంటు బిల్లు చెల్లిస్తున్నట్టు తెలిసి షాక్!

Civil Aviation: విమానాలు గరిష్ఠంగా ఎంత ఎత్తులో ప్రయాణించగలవో తెలుసా?

Read Latest and Viral News

Updated Date - Sep 26 , 2024 | 06:46 PM