ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: కుందేలు, తాబేలు మధ్య పరుగు పదెం.. చివరికి ఏమైందో చూస్తే..

ABN, Publish Date - Oct 01 , 2024 | 09:42 AM

కుందేలు - తాబేలు మధ్య పరుగుపందేనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వీడియో చూసి జనాలు షాకైపోతున్నారు. అచ్చు కథలో చెప్పినట్టే జరిగిందంటూ నోరెళ్లబెడుతున్నారు.

video fo Tortoise rabbit race goes viral

ఇంటర్నెట్ డెస్క్: మనందరం చిన్నప్పుడు కుందేలు, తాబేలు పరుగు పదెం కథ వినే ఉంటాం. కుందేలు ఓడిన తీరు, తాబేలు గెలిచిన వైనం ద్వారా లోకం రీతిని, నీతినియమాలను అర్థం చేసుకున్నాం. అయితే, ప్రపంచంమంతా తెలిసిన ఈ కథకి కొందరు కొత్త ట్విస్ట్ ఇచ్చారు. కుందేలు, తాబేలును ఒక చోటకు చేర్చి వాటి మధ్య పోటీ పెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ (Viral) అవుతుండగా పోటీ విజేతను చూసిన జనాలు నోరెళ్లబెడుతున్నారు.

Viral: రాత్రి 2.00 గంటలకు బాస్ నుంచి ఊహించని మెసేజ్! మహిళకు షాక్!


జపాన్‌లో జరిగిన ఈ పోటీ తాలుకు వీడియో జనాలను అమితంగా ఆకట్టుకుంటోంది. వీడియోలో కనిపించిన దాని ప్రకారం, నిర్వాహకులు రెండు జంతువుల కోసం ప్రత్యేక ట్రాక్స్ సిద్ధం చేశారు. వీటి పొడవు సుమారు ఒక మిటర్ లేదా రెండు మీటర్లు ఉంది. రెండు ట్రాక్స్‌ మధ్య చిన్న ప్లాస్టిక్ ముక్కలను అడ్డుగోడగా ఏర్పాటు చేశారు. రెండు జంతువులు ఒకదాన్ని మరొకటి చూసి డిస్ట్రాక్ట్ కాకుండా ఈ ఏర్పాటన్నమాట (video of Race between rabbit and tortoise goes viral on social media).

Viral: వామ్మో! బెంగళూరులో ఇలాంటి సీన్ ఎప్పుడైనా చూశారా! నోరెళ్లబెట్టాల్సిందే!


ఇక పోటీ మొదలవ్వగానే కుందేలు కథలో చెప్పినట్టుగా చెంగుచెంగున దూకుతూ ముందుకెళ్లిపోయింది. తాబేలు మాత్రం నెమ్మదిగా ముందుకు కదిలింది. కానీ కుందేలు రెండు అడుగులు ముందుకేశాక దాని దృష్టి మరోవైపు మళ్లింది. ముందుకు కదలకుండా అలాగే ఉండిపోయింది. దాన్ని ముందు తోసేందుకు అక్కడున్న వారు ప్రయత్నించినా ఉపయోగం లేకపోయింది.

Viral: వామ్మో.. రోజుకు 18 గంటల పని! ఈ స్టార్టప్ కంపెనీ సీఈఓ కష్టం చూస్తే..


ఇక తాబేలు మాత్రం రేసు మొదలైన క్షణం నుంచీ లక్ష్యం వైపు ఆగకుండా నడిచింది. ఎటూ చూడకుండా ముందుకెళ్లిపోయింది. ఎక్కడా క్షణ కాలం కూడా ఆగలేదు. పక్క చూపులు చూడలేదు. అలా మెల్లగా ఒక్కో అడుగూ ముందుకేసుకుంటూ వెళ్లిపోయింది. చివరకు సునాయసంగా లక్ష్యాన్ని చేరుకుంది. కుందేలు మాత్రం రేసు గురించే మర్చిపోయి చివరకు చతికిలపడింది.

Viral: మార్స్‌పై మనిషి సెటిలైతే జరిగేది ఇదే.. అమెరికా శాస్త్రవేత్త హెచ్చరిక


వీడియోలో ఇదంతా చూసిన జనాలు ఆశ్చర్యపోతున్నారు. కథలో చెప్పినట్టుగానే జరిగిందంటూ నోరెళ్లబెడుతున్నారు. నిలకడ లేని వాళ్లల్లో ఎంత టాలెంట్ ఉన్నా ఉపయోగం లేదని కామెంట్ చేశారు. ఇక మరికొంత మంది సరదా వ్యాఖ్యలు చేశారు. పుర్వకాలంలో ఈ రేసు జరిగే ఉంటుందని, దాన్నుంచే కుందేలు - తాబేలు కథ పుట్టుకొచ్చిందని చెప్పుకొచ్చారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇప్పటివరకూ దీనిక లక్షన్నరకు పైగా వ్యూస్ వచ్చాయి. మరి జనాలను ఇంతలా ఎంటర్‌టైన్ చేస్తున్న ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి!

Viral: డబ్బున్నోళ్లంటే భారతీయులకు అందుకే ద్వేషం! ప్రముఖ సంస్థ సీఈఓ వ్యాఖ్య

వామ్మో! పెళ్లికొచ్చిన అతిథుల నుంచి వధూవరులు రూ.2 లక్షలు చొప్పున వసూల్!

Read Latest and Viral News

Updated Date - Oct 01 , 2024 | 09:48 AM