ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral: ఈమె అసలు మనిషేనా? మరీ ఇంత పైశాచికత్వమా!

ABN, Publish Date - Jun 11 , 2024 | 09:25 PM

ఓ యువతి కోడిపుంజును టార్చర్ పెట్టిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. జనాలకు చిర్రెత్తుకొచ్చేలా చేస్తోంది. శాడిస్టులాగా ఉన్న యువతిని వెంటనే అరెస్టు చేయాలని జనాలు డిమాండ్ చేస్తున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: కొందరు మూగ జీవాలపై తమ పైశాచికత్వం ప్రదర్శిస్తుంటారు. మానవత్వం మరిచి దానవుల్లా రెచ్చిపోతుంటారు. ఓ యువతి సరిగ్గా ఇలాగే చేసింది. ఓ కోడిపుంజును దారుణంగా టార్చర్ పెట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ (Viral) అవుతూ జనాలకు ఆగ్రహం తెప్పిస్తోంది. అయితే, యువతి పైశాచికత్వం వెనక కారణం మాత్రం తెలియరాలేదు.

వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఓ యువతి కోడి పుంజుపై రెచ్చిపోయింది. తొలుత రెండు మూడు సార్లు దాని తలపై కొట్టింది. దానికి తిక్కరేగేలా చేసి తనపై దాడి చేసే పరిస్థితి తెచ్చింది. అక్కడి నుంచి మరింతగా రెచ్చిపోయింది. కోడి గాల్లోకి ఎగరగానే దాని పీక పట్టుకుని పలుమార్లు తలపై కొట్టింది. ఆ తరువాత దాన్ని దూరంగా విసిరేసింది. ఆ తరువాత మళ్లీ కోడిపుంజును దొరకపుచ్చుకుని గిర్రున తిప్పి నేలకేసి కొట్టింది. ఈ టార్చర్ తో ఆ కోడిపుంజు నరకం చూసింది. అయితే, కోడిపుంజును అంతగా హింసించడానికి కారణాలేంటో మాత్రం వీడియోలో తెలియరాలేదు.

Viral: గర్ల్‌ఫ్రెండ్ నిజస్వరూపం తెలిసి ఆగ్రహం.. పెళ్లి రోజున ప్రతీకారం


ఇక ఈ సీన్ చూసిన జనాలు మండిపడుతున్నారు. యువతి శాడిస్టులా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూగజీవాలపై ఇంతటి కాఠిన్యం ప్రదర్శించేవాళ్లు సభ్య సమాజంలో ఉండటానికి వీల్లేదని అన్నారు. ఇలాంటి వాళ్లను తక్షణం జైల్లో పెట్టాలని అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. మరి మీరూ ఈ వీడియోపై ఓ లుక్కేయండి.

Read Viral and Telugu News

Updated Date - Jun 11 , 2024 | 09:26 PM

Advertising
Advertising