ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: వామ్మో.. ఇలాగైతే సోఫాలో కూర్చోవడానికీ భయపడాల్సిందే!

ABN, Publish Date - Oct 27 , 2024 | 09:58 PM

సోఫాపై ఉన్న దిండులో పాము దాక్కున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. జనాలు షాకైపోయేలా చేస్తోంది. ఘటన ఎక్కడ జరిగిందీ తెలీకపోయినప్పటికీ వీడియో మాత్రం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.

ఇంటర్నెట్ డెస్క్: మీరు బాగా అలిసిపోయి ఇంట్లోకి వచ్చారనుకుందాం. ఎదురుగా సోఫా కనిపించడంతో వెంటనే దానిమీద కూలబడిపోయారు. అప్పటికే దిండులో దాక్కున్న పాము బుసకొడుతూ బయటకు వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి..! తలుచుకుంటేనే భయం వేస్తోంది కదూ! దాదాపు ఇలాంటి ఘటన తాలూకు వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. నెటిజన్లకు గూస్ బంప్స్ తెప్పిస్తోంది (Viral).

Viral: మహిళ దాగుడుమూతల ఆట! బాయ్‌ఫ్రెండ్‌ సూట్‌కేసులో దాక్కోవడంతో..


వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఓ ఇంట్లో పాము బుస కొడుతున్న శబ్దం పదే పదే రావడంతో ఇంట్లోని వారికి డౌటొచ్చింది. ఇల్లంతా వెతగ్గా సోఫాపై ఉన్న ఓ దిండులో పాము దాక్కున్న విషయం అర్థమైంది. దీంతో వారు వెంటనే అప్రమత్తమై పాములు పట్టే వ్యక్తికి సమాచారం అందించారు. దీంతో, అతడు వచ్చి పామును జాగ్రత్తగా బయటకు తీశాడు.

పాము ఎక్కడుందో కనిపెట్టిన వెంటనే అతడు మెల్లగా ఓ ఇనుప రాడ్డుతో దాన్ని బయటకు లాగే ప్రయత్నం చేశాడు. దిండు కవర్ తెరిచేసరికి లోపలున్న పాము కనిపించింది. దాన్ని బయటకు లాగబోతుంటే ఒక్కసారిగా పడగ విప్పి బుస కొట్టింది. కాటేసే ప్రయత్నం కూడా చేసింది. అయితే, పాములు పట్టే వ్యక్తి మాత్రం చాకచక్యంగా వ్యవహరించి దాన్ని జాగ్రత్తగా బయటకు తీశాడు.

Viral: బాబోయ్.. బాణసంచా దుకాణం పెట్టుకున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్!


ఈ భయానక ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఏకంగా కోటిన్నరకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ షాకింగ్‌ దృశ్యాలు చూసి అనేక మంది బెదిరిపోయారు. ఇలాంటి సీన్స్ చూశాక సోఫాలో కూర్చోవాలంటేనే వెన్నులో వణుకు పుడుతోందని కామెంట్ చేశారు. ఆ దిండుపై ఎవరో కూర్చోలేదు కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే పెను ప్రమాదమే సంభవించి ఉండేదని కొందరు అన్నారు. ఇలా రకరకా కామెంట్స్ మధ్య వీడియో వైరల్‌గా మారింది.

Read Latest and Travel News

Updated Date - Oct 27 , 2024 | 10:04 PM